పద్మ పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర-సాంకేతికం, వాణిజ్యం-పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం- విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వారిలో ఏడు మన తెలుగు వారికి దక్కాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ప్రవాస భారతీయులు/ఓసీఐలు ఉన్నారు. మొత్తం 13 మందికి మరణానంతరం పద్మ పురస్కారాలు దక్కాయి. పద్మవిభూషణ్: హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు (గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు) దువ్వూరి నాగేశ్వరరెడ్డికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ దక్కింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖేహర్ (చండీగఢ్)కు పద్మవిభూషణ్ దక్కింది. గుజరాత్ నుంచి కుముదిని రజినీకాంత్ లఖియా, కర్ణాటక నుంచి లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం, కేరళ నుంచి ఎంటీ వాసుదేవన్ నాయర్ (మరణానంతరం), జపాన్ నుంచి సుజుకీ మోటార్స్ వ్యవస్థాపకుడు ఒసాము సుజుకీ (మరణానంతరం), బిహార్ నుంచి శారదా సిన్హాలు (మరణానంతరం) పద్మ విభూషణ్‌కు ఎంపికయ్యారు. పద్మ భూషణ్: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న వారిలో సాహిత్యం, విద్య, జర్నలిజం విభాగం నుంచి కర్ణాటకకు చెందిన ఎ.సూర్య ప్రకాశ్ ఉన్నారు. ఆయన గతంలో ఈనాడు దిల్లీ బ్యూరో చీఫ్‌గా పని చేశారు. ప్రసార భారతి ఛైర్మన్‌గానూ సేవలందించారు. కర్ణాటక నుంచి ప్రముఖ సినీ నటుడు అనంత్ నాగ్, మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్, తమిళనాడు నుంచి బహుభాషా నటి శోభనా చంద్ర కుమార్, బహుభాషా నటుడు అజిత్ కుమార్‌లు పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషీ, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్‌లకు మరణానంతరం పద్మ భూషణ్ ప్రకటించారు. పద్మభూషణ్ దక్కిన ఇతర ప్రముఖులు పేరు రంగం రాష్ట్రం జతిన్ గోస్వామి కళలు అస్సాం జోస్ జాకో పెరియప్పురం వైద్యం కేరళ కైలాశ్ నాథ్ దీక్షిత్ పురావస్తు విభాగం దిల్లీ నల్లి కుప్పుస్వామి చెట్టి వాణిజ్యం, పరిశ్రమలు తమిళనాడు పీఆర్ శ్రీజేశ్ క్రీడలు కేరళ పంకజ్ పటేల్ వాణిజ్యం, పరిశ్రమలు గుజరాత్ రాంబహదూర్ రాయ్ సాహిత్యం, విద్య, జర్నలిజం ఉత్తర్ ప్రదేశ్ సాధ్వీ రితంభర సామాజిక సేవ ఉత్తర్ ప్రదేశ్ వినోద్ ధామ్ సైన్స్, ఇంజినీరింగ్ అమెరికా పద్మశ్రీ: ఏపీలో కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు (మరణానంతరం), సాహిత్యం, విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. డి.నాగేశ్వరరెడ్డి, మంద కృష్ణ మాదిగలకు తెలంగాణ నుంచి పురస్కారాలు దక్కాయి. పేరు రంగం రాష్ట్రం/దేశం అద్వైత చరణ్ గడనాయక్ కళలు ఒడిశా అచ్యుత్ రామచంద్ర పలావ్ కళలు మహారాష్ట్ర అజయ్ వి భట్ సైన్స్, ఇంజినీరింగ్ అమెరికా అనిల్ కుమార్ బోరో సాహిత్యం, విద్య అస్సాం అరిజిత్ సింగ్ కళలు బెంగాల్ అరుంధతీ భట్టాచార్య వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర అరుణోదయ్ సాహ సాహిత్యం, విద్య త్రిపుర అరవింద్ శర్మ సాహిత్యం, విద్య కెనడా అశోక్ కుమార్ మహాపాత్ర వైద్యం ఒడిశా అశోక్ లక్ష్మణ్ సరాఫ్ కళలు మహారాష్ట్ర ఆశుతోష్ శర్మ సైన్స్, ఇంజినీరింగ్ ఉత్తర్ ప్రదేశ్ అశ్వినీ భిడే దేశ్‌పాండే కళలు మహారాష్ట్ర బైజ్‌నాథ్ మహరాజ్ ఆధ్యాత్మికం రాజస్థాన్ బ్యారీ గాడ్‌ఫ్రే జాన్ కళలు దిల్లీ బతూల్ బేగం కళలు రాజస్థాన్ భరత్ గుప్త్ కళలు దిల్లీ భెరు సింగ్ చౌహాన్ కళలు మధ్యప్రదేశ్ భీంసింగ్ భవేశ్ సామాజిక సేవ బిహార్ భీమవ్వ దొడ్డబలప్ప షిలేఖ్యతార కళలు కర్ణాటక భుదేంద్ర కుమార్ జైన్ వైద్యం మధ్యప్రదేశ్ సీఎస్ వైద్యనాథన్ ప్రజా సంబంధాలు దిల్లీ చిత్రం దేవ్‌చంద్ పవార్ సామాజిక సేవ మహారాష్ట్ర చంద్రకాంత్ సేథ్ (మరణానంతరం) సాహిత్యం, విద్య గుజరాత్ చంద్రకాంత్ సోంపుర ఆర్కిటెక్చర్ గుజరాత్ చేతన్ ఇ చిత్నిస్ సైన్స్, ఇంజినీరింగ్ ఫ్రాన్స్ డేవిడ్ ఆర్ శియెంలీ సాహిత్యం, విద్య మేఘాలయ దుర్గాచరణ్ రణ్‌బీర్ కళలు ఒడిశా ఫరూక్ అహ్మద్ మీర్ కళలు జమ్మూకశ్మీర్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ సాహిత్యం, విద్య ఉత్తర్‌ప్రదేశ్ గీతా ఉపాధ్యాయ్ సాహిత్యం, విద్య అస్సాం గోకుల్ చంద్ర దాస్ కళలు బెంగాల్ గురువాయూర్ దొరై కళలు తమిళనాడు హర్‌చందన్ సింగ్ భాటీ కళలు మధ్యప్రదేశ్ హరిమన్ శర్మ వ్యవసాయం హిమాచల్‌ప్రదేశ్ హర్జీందర్ సింగ్ శ్రీనగర్ వాలె కళలు పంజాబ్ హర్వీందర్ సింగ్ క్రీడలు హరియాణా హసన్ రఘు కళలు కర్ణాటక హేమంత్ కుమార్ వైద్యం బిహార్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ సాహిత్యం, విద్య ఉత్తర్ ప్రదేశ్ హ్యూ అండ్ కోలెన్ గాంజెర్ (ఇద్దరికీ మరణానంతరం) సాహిత్యం, విద్య ఉత్తరాఖండ్ ఇనివాలప్పిల్ మణి విజయన్ క్రీడలు కేరళ జగదీశ్ జోషిలా సాహిత్యం, విద్య మధ్యప్రదేశ్ జస్పీందర్ నరులా కళలు మహారాష్ట్ర జోనాస్ మాసెట్టి ఆధ్యాత్మికం బ్రెజిల్ జాయ్‌నచరణ్ బథరి కళలు అస్సాం జుండే యోంగం గమ్లిన్ సామాజిక సేవ అరుణాచల్ కె దామోదరన్ పాకశాస్త్రం తమిళనాడు కేఎల్ కృష్ణ సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ ఒమనకుట్టి అమ్మ కళలు కేరళ కిశోర్ కునాల్ (మరణానంతరం) సివిల్ సర్వీస్ బిహార్ ఎల్ హాంగ్‌తింగ్ వ్యవసాయం నాగాలాండ్ లక్ష్మీపతి రామసుబ్బయ్యర్ సాహిత్యం, విద్య, జర్నలిజం తమిళనాడు లలిత్ కుమార్ మంగోత్ర సాహిత్యం, విద్య జమ్మూ కశ్మీర్ లామా లోబ్‌జాంగ్ (మరణానంతరం) ఆధ్యాత్మికం లద్దాఖ్ లిబియా లోబో సర్దేశాయ్ సామాజిక సేవ గోవా ఎం.డి.శ్రీనివాస్ సైన్స్, ఇంజినీరింగ్ తమిళనాడు మాడుగుల నాగఫణి శర్మ కళలు ఆంధ్రప్రదేశ్ మహాబీర్ నాయక్ కళలు ఝార్ఖండ్ మమతా శంకర్ కళలు బెంగాల్ మంద కృష్ణ మాదిగ ప్రజా సంబంధాలు తెలంగాణ మారుతి భుజంగరావ్ చితంపల్లి సాహిత్యం, విద్య మహారాష్ట్ర మిరియాల అప్పారావు (మరణానంతరం) కళలు ఆంధ్రప్రదేశ్ నాగేంద్ర నాథ్ రాయ్ సాహిత్యం, విద్య బెంగాల్ నారాయణ్ (మరణానంతరం) ప్రజా సంబంధాలు ఉత్తర్ ప్రదేశ్ నరేన్ గురుంగ్ కళలు సిక్కిం నీరజా భట్ల వైద్యం దిల్లీ నిర్మలా దేవి కళలు బిహార్ నితిన్ నోహ్రియా సాహిత్యం, విద్య అమెరికా ఓంకార్ సింగ్ పహ్వా వాణిజ్యం, పరిశ్రమలు పంజాబ్ పి దక్షిణామూర్తి కళలు పుదుచ్చేరి పండి రామ్ మండవి కళలు ఛత్తీస్‌గఢ్ పర్మార్ లావ్‌జీభాయ్ నాగ్‌జీభాయ్ కళలు గుజరాత్ పవన్ గోయెంకా వాణిజ్యం, పరిశ్రమలు బెంగాల్ ప్రశాంత్ ప్రకాశ్ వాణిజ్యం, పరిశ్రమలు కర్ణాటక ప్రతిభ సత్పతి సాహిత్యం, విద్య ఒడిశా పురిశాయ్ కన్నప్ప సంబంధన్ కళలు తమిళనాడు ఆర్ అశ్విన్ క్రీడలు తమిళనాడు ఆర్ జీ చంద్రమోహన్ వాణిజ్యం, పరిశ్రమలు తమిళనాడు రాధా బహిన్ భట్ సామాజిక సేవ ఉత్తరాఖండ్ రాధాకృష్ణన్ దేవసేనాపతి కళలు తమిళనాడు రాందర్శ మిశ్ర సాహిత్యం, విద్య దిల్లీ రాణేంద్ర భాను మజుందార్ కళలు మహారాష్ట్ర రతన్ కుమార్ పరిమూ కళలు గుజరాత్ రేబా కాంత మహంత కళలు అస్సాం రెంత్‌లీ లాల్‌రావ్నా సాహిత్యం, విద్య మిజోరం రికీ జ్ఞాన్ కేజ్ కళలు కర్ణాటక సజ్జన్ భజంకా వాణిజ్యం, పరిశ్రమలు బెంగాల్ శాలీ హోల్కర్ వాణిజ్యం, పరిశ్రమలు మధ్యప్రదేశ్ సంత్ రామ్ దేశ్వాల్ సాహిత్యం, విద్య హరియాణా సత్యపాల్ సింగ్ క్రీడలు ఉత్తర్‌ప్రదేశ్ ఎస్.విశ్వనాథన్ సాహిత్యం, విద్య తమిళనాడు సేతురామన్ పంచనాథన్ సైన్స్, ఇంజినీరింగ్ అమెరికా అలీ అల్-జబేర్ అల్-సబా వైద్యం కువైట్ ఎస్.కె.నిజాం (శివ కిషన్ బిస్సా) సాహిత్యం, విద్య రాజస్థాన్ శ్యామ్ బిహారీ అగర్వాల్ కళలు ఉత్తర్‌ప్రదేశ్ సోనియా నిత్యానంద్ వైద్యం ఉత్తర్‌ప్రదేశ్ స్టీఫెన్ క్నాప్ సాహిత్యం, విద్య అమెరికా సుభాష్ ఖేతులాల్ శర్మ వ్యవసాయం మహారాష్ట్ర సురేశ్ హరిలాల్ సోని సామాజిక సేవ గుజరాత్ సురీందర్ కుమార్ వసాల్ సైన్స్, ఇంజినీరింగ్ దిల్లీ స్వామి ప్రదీప్తానంద (కార్తిక్ మహరాజ్) ఆధ్యాత్మికం బెంగాల్ సయ్యద్ అయినుల్ హసన్ సాహిత్యం, విద్య ఉత్తర్‌ప్రదేశ్ తేజేంద్ర నారాయణ్ మజుందార్ కళలు బెంగాల్ టి.సూర్యముఖీ దేవి కళలు మణిపుర్ తుషార్ దుర్గేశ్‌భాయ్ శుక్ల సాహిత్యం, విద్య గుజరాత్ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ వాసుదేవ్ కామత్ కళలు మహారాష్ట్ర వేలు ఆసాన్ కళలు తమిళనాడు వెంకప్ప అంబాజీ సుగటేకర్ కళలు కర్ణాటక విజయ్ నిత్యానంద మహరాజ్ ఆధ్యాత్మికం బిహార్ విజయలక్ష్మీ దేశమణే వైద్యం కర్ణాటక విలాస్ డాంగ్రే వైద్యం మహారాష్ట్ర వినాయక్ లొహాని సామాజిక సేవ బెంగాల్