Posts

Current Affairs

Akash Bobba

♦ An Indian-origin engineer, Akash Bobba (22) is among the staff of Elon Musk's Department of Government Efficiency (DOGE) being publicly targetted over gaining access to classified government systems. ♦ The federal agency, spearheaded by Musk, has raised eyebrows by hiring six young engineers, all between the ages of 19 and 24. ♦ Akash Bobba attended the University of California, Berkeley, where he was part of the Management, Entrepreneurship, and Technology (MET) programme, designed for future tech industry leaders, according to his now-deleted LinkedIn account. ♦ Before joining DOGE, he interned at Meta, Palantir, and the hedge fund Bridgewater Associates, working in AI, data analytics, and financial modelling.

Current Affairs

ఎస్సీ వర్గీకరణకు ఆమోదం

తెలంగణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేశంలోనే తొలుత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పంజాబ్‌ ప్రభుత్వం వర్సెస్‌ దవిందర్‌ సింగ్‌ అండ్‌ అదర్స్‌ కేసులో 2024, ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ నాలుగు సిఫార్సులు చేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్‌ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు... క్రీమీలేయర్‌ సిఫార్సును తిరస్కరించింది.  మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను 2025, ఫిబ్రవరి 4న శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. రెండుచోట్లా నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్‌-1లో, మధ్యస్థ లబ్ధిపొందిన కులాలను గ్రూప్‌-2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్‌-3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ జనాభాలో 61.967% మంది ఉన్న మాదిగ కులంతోసహా 18 కులాలను గ్రూప్‌-2 కింద చేర్చి 9% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 29.26% మంది ఉన్న మాల, మాలఅయ్యవార్‌ కులంతోసహా 26 కులాలను గ్రూప్‌-3లో చేర్చి 5% రిజర్వేషన్లను, ఇక 3.28% మంది ఉన్న 15 కులాలను గ్రూప్‌-1లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది.  ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ 199 పేజీల నివేదిక అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. 2024 నవంబరు 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 82 రోజుల వ్యవధిలోనే అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2024 డిసెంబరు 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని పూర్వ జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి, అభిప్రాయాలను తెలుసుకుంది. ఎస్సీల్లోని 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన డేటాను అధ్యయనం చేసిన కమిషన్‌ తన నివేదికను రూపొందించింది. 

Current Affairs

సీఎంఆర్‌ నివేదిక

భారత్‌లో అత్యుత్తమ 5 స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్లలో అమెరికా సాంకేతికత దిగ్గజం యాపిల్‌కు తొలిసారి చోటు లభించింది. సైబర్‌ మీడియా రిసెర్చ్‌ (సీఎంఆర్‌) నివేదిక ప్రకారం వివో, షియోమీ, శామ్‌సంగ్‌లు భారత్‌లో దిగ్గజ బ్రాండ్లుగా తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ఇప్పుడు వీటి సరసన యాపిల్‌ కూడా చేరింది.  అమెరికా, చైనా తర్వాత యాపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద విపణిగా భారత్‌ అవతరించనుంది. 2024లో భారత్‌కు యాపిల్‌ ఎగుమతులు 34-35 శాతం పెరిగి 1.2 కోట్ల యూనిట్లకు చేరాయి. 2023లో ఈ సంఖ్య 90 లక్షలు అని ఐడీసీ గణాంకాల ప్రకారం తెలుస్తోంది.

Current Affairs

రష్యాతో భారత్‌ ఒప్పందం

నౌకా విధ్వంసక క్రూజ్‌ క్షిపణుల కొనుగోలుకు భారత్‌ 2025, ఫిబ్రవరి 4న రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అస్త్రాల రాకతో భారత నౌకాదళంలోని జలాంతర్గాముల పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

Current Affairs

కొబ్బరి ఉత్పత్తి

కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2025, ఫిబ్రవరి 4న లోక్‌సభలో తెలిపారు. 2023-24వ సంవత్సరం మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 23.33 లక్షల హెక్టార్లలో సాగయిన కొబ్బరి తోటలనుంచి 153.29 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుందని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉన్నదని చెప్పారు. 

Current Affairs

ఆకాశ్‌ బొబ్బా

అమెరికా ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తేవడమే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్టుమెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీలో (డోజ్‌) భారత సంతతి కుర్రాడు ఆకాశ్‌ బొబ్బాకు చోటు దక్కింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో పని చేసే ఈ విభాగంలోకి తీసుకున్న ఆరుగురు యువ ఇంజినీర్లలో అతడూ ఉన్నాడు. ఈ ఆరుగురూ 19 నుంచి 24 ఏళ్ల లోపు వయసు వారే. ఆకాశ్‌ బొబ్బా బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో మేనేజ్‌మెంట్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. మెటా, పలంటీర్‌ సంస్థల్లో ఇంటర్న్‌గా పని చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ బ్రిడ్జ్‌వాటర్‌ అసోసియేట్స్‌లోనూ కొంతకాలం పని చేశాడు.

Current Affairs

చంద్రుడిపై పరిశోధనలకు ఫ్లయింగ్‌ రోబో

చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి నీటి అన్వేషణ కోసం స్మార్ట్‌ రోబోటిక్‌ ‘ఫ్లయర్‌ డిటెక్టర్‌’ను పంపేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోంది. 2026లో చేపట్టనున్న చాంగే-7 మిషన్‌లో ఈ ఫ్లయింగ్‌ రోబో డిటెక్టర్‌ భాగం కానుంది. దీంతోపాటు ఓ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ ఉంటాయి. ఈ యాత్రలో జాబిల్లిపై ఐస్‌ రూపంలో ఉన్న నీటిని స్పష్టంగా గుర్తించడమే లక్ష్యం.

Walkins

Posts In TMC Mumbai

Tata Memorial Hospital Mumbai (TMC MUMBAI) is conducting interview for the vacant posts of Trial Coordinator and Technician. Number of Posts: 02 Details: 1. Trial Co-ordinator: 01 2. Technician: 01 Qualification: PG (Pharmacy, Life Science, Biotech, Zoology, Botany), B.Sc, DMLT with work experience in relevant department following the post. Salary: Rs.23,000 - Rs.60,000 for Trial Co-ordinator, Rs.22,000 - Rs.45,000 for Technician. Selection Process: Based on Interview.  Interview Date: 10-02-2025. Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=32649  

Admissions

GATB-2025 - Biotechnology Admissions

Inviting Online Applications for Graduate Aptitude Test- Biotechnology (GAT-B) - 2025 Graduate Aptitude Test- Biotechnology (GAT-B) is a National Level Entrance Examination for admission to Department of Biotechnology supported Post Graduate Programme in Biotechnology and allied areas in Participating Institutions. Details: Graduate Aptitude Test - Biotechnology (GAT-B) 2025 Eligibility: B.Sc, MBBS, BDS in the relevant discipline with at least 55% marks. Exam Pattern: Computer Based Test (CBT) mode. Exam Duration: 180 (3 Hours) Minutes. Application Fee: Rs.1300; Rs.650 for SC/ST/PwBD. Last Date for Online Application & Examination Fee Payment: 03-03-2025. Correction in the Particulars of Application: From 05-03-2025 to 06-03-2025. Exam Date: 20-04-2025. Website:https://exams.nta.ac.in/DBT/ Apply online:https://dbt2025.ntaonline.in/

Admissions

జీఏటీ-బీ 2025

పోస్టు గ్రాడ్యుయేట్‌ బయోటెక్నాలజీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ పీజీలో ప్రవేశాలు పొందవచ్చు. జీఏటీ-బీ 2025ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. వివరాలు: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ - బయోటెక్నాలజీ(జీఏటీ-బీ) 2025 అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు.  పరీక్ష వ్యవధి: 180 (3 గంటలు) నిమిషాల సమయం. దరఖాస్తు రుసుము: రూ.1300; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.650. ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 03-03-2025. దరఖాస్తు సవరణ తేదీలు: 05-03-2025 నుంచి 06-03-2025 వరకు. పరీక్ష తేదీ: 20-04-2025. Website:https://exams.nta.ac.in/DBT/ Online Application:https://dbt2025.ntaonline.in/