పెరిగిన ఖరీఫ్ సాగు విస్తీర్ణం
2025లో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 6.51 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అక్టోబరు 6న వెల్లడించింది. 2024లో దేశవ్యాప్తంగా 1,114.95 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈసారి అది 1,121.46 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది. వరిసాగు విస్తీర్ణం 5.90 లక్షల హెక్టార్లు, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 1.37 లక్షల హెక్టార్లు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 11.13 లక్షల హెక్టార్లు, చెరకు సాగు విస్తీర్ణం 1.86 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు వెల్లడించింది.