ప్రపంచ బాక్సింగ్ కప్
ప్రపంచకప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గింది. 2025, నవంబరు 20న గ్రేటర్ నోయిడాలో జరిగిన మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవో యీ గ్జువాన్ (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఇదే ఈవెంట్‌లో మరో ఎనిమిది పసిడి పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. 57 కేజీల్లో పారిస్ కాంస్య పతక విజేత వుయీ (చైనీస్ తైపీ)ను జైస్మిన్ లాంబోరియా (57 కేజీ) ఓడించింది. 60 కేజీల్లో తగుచి అయాకా (జపాన్)పై పర్వీన్ హుడా నెగ్గింది. 80 కేజీల్లో సొటిమ్‌బొయెవా (ఉజ్బెకిస్థాన్)ను నుపుర్ షెరోన్ ఓడించగా.. 70 కేజీల్లో అజీజా (ఉజ్బెకిస్థాన్)పై అరుంధతి చౌదరి పైచేయి సాధించింది.