న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
రాజస్థాన్‌లోని రావత్‌భట్ రాజస్థాన్ సైట్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ ట్రేడ్‌ల్లో ఏడాది శిక్షణకు ట్రేడ్ అప్రెంటిస్‌ల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 245 వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు: 245 పోస్టులు ఫిట్టర్- 68 ఎలక్ట్రీషియన్ - 68 మెకానిక్- 68 సీఓపీఏ (COPA) - 10 టర్నర్- 10 మెషినిస్ట్- 10 వెల్డర్- 11 అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 18/03/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.9,600. ఎంపిక విధానం: విద్యార్హత మెరిట్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా NAPS 2.0 పోర్టల్‌లో అనంతరం ఎన్‌పీసీఐఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 26.02.2026. దరఖాస్తు గడువు: 18.03.2026. Website: https://npcil.nic.in/index.aspx