Posts

Current Affairs

తొలి ప్యాసింజర్‌ రైలుకు 172 ఏళ్లు

దేశంలో నిత్యం కోట్లాదిమంది ప్రయాణికులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వే 172 ఏళ్లు పూర్తి చేసుకొంది. 1853 ఏప్రిల్‌ 16న ముంబయి నుంచి ఠాణెకు బయలుదేరిన రైలు దేశంలో తొలి ప్యాసింజర్‌ రైలుగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తేదీన మధ్యాహ్నం 3.35 గంటలకు 14 కోచ్‌లతో కూడిన రైలు ముంబయిలోని బోరీబందర్‌ నుంచి ఠాణెకు ప్రయాణించింది. 21 తుపాకులతో సెల్యూట్‌ చేశారు. ఆహ్వానం ఉన్న 400 మంది అందులో ప్రయాణించారు. సింధ్, సుల్తాన్, సాహెబ్‌ పేర్లు కలిగిన మూడు ఇంజిన్లతో రైలు ప్రారంభమైంది. 34 కి.మీ.ల దూరం 1.15 గంటల్లో చేరుకుంది. నాటి నుంచి భారతీయ రైల్వే సేవలు అందిస్తూనే ఉంది.

Current Affairs

నితిన్, తన్నులకు రజతాలు

ఆసియా అండర్‌-18 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నితిన్‌ గుప్తా, తన్ను రజతాలు గెలిచారు. 2025, ఏప్రిల్‌ 16న సౌదీ అరేబియాలో జరిగిన పురుషుల 5000 మీటర్ల రేస్‌ వాక్‌ను నితిన్‌ 20 నిమిషాల 21.51 సెకన్లలో ముగించి రెండో స్థానం సాధించాడు. నింగ్‌హావో జు (20ని 21.50సె- చైనా) స్వర్ణం, షెంగ్‌ కిన్‌ (21ని 37.88సె- చైనీస్‌ తైపీ) కాంస్యం నెగ్గారు.  మహిళల 400 మీటర్ల పరుగును తన్ను 57.63 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఇమామిన్‌ సైకి (జపాన్‌- 57.27 సె) స్వర్ణం, డెంగ్‌ నాంగ్జి (చైనా-58.01 సె) కాంస్యం గెలిచారు.

Current Affairs

ఉపాధి లేనివాళ్లు 1.56 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు వారిలో ఏ ఉపాధీ లేనివాళ్లు 1.56 కోట్ల మంది ఉన్నారు. ఇలాంటివారున్న మొదటి ఐదు జిల్లాల్లో కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం ఉన్నాయి. కర్నూలు జిల్లా అత్యధికంగా 7.62 లక్షల మందితో మొదటి స్థానంలో ఉంది. ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 5 లక్షల వరకు ఉపాధి లేని వారున్నారు. సచివాలయాల ఉద్యోగులు మార్చిలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో ఈ విషయాలను గుర్తించారు. 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది వివరాలను ఉద్యోగులు తెలుసుకున్నారు. ఇందులో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తేల్చారు.

Current Affairs

తదుపరి సీజేఐగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌(బి.ఆర్‌.గవాయ్‌) బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2025, ఏప్రిల్‌ 16న సిఫారసు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లాంఛనమే కానుంది. మే 13న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. 14న జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 6 నెలలకుపైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబరు 23న పదవీ విరమణ చేస్తారు.  జస్టిస్‌ గవాయ్‌ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఆయన కంటే ముందు 2007లో జస్టిస్‌ బాలకృష్ణన్‌ ఆ పదవిలో ఉన్నారు. 

Walkins

హైదరాబాద్‌ మిధానిలో పోస్టులు

హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్‌ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌ (మిధాని) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 43 1. అసిస్టెంట్(ఫిట్టర్‌): 07 2. అసిస్టెంట్(ఎలక్ట్రీషియన్‌): 04 3. అసిస్టెంట్(టర్నర్‌): 01 4. అసిస్టెంట్‌(వెల్డర్‌): 02 5. అసిస్టెంట్‌ (మెటలర్జీ): 23 6. అసిస్టెంట్‌(మెకానికల్): 05 7. అసిస్టెంట్‌(సీఏడీ ఆపరేటర్‌): 01 అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి అసిస్టెంట్‌(ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌)కు 33 ఏళ్లు, అసిస్టెంట్‌(మెటలర్జీ, మెకానికల్)కు 38 ఏళ్లు, అసిస్టెంట్(సీఏడీ ఆపరేటర్‌)కు 35 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌(ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌)కు రూ.29,920, అసిస్టెంట్‌(మెటలర్జీ, మెకానికల్, సీఏడీ ఆపరేటర్‌)కు రూ.32,770.  ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 25, 26, 28, మే 5, 6, 7. వేదిక: మిధాని కార్పొరేట్‌ ఆఫీస్‌ ఆడిటోరియం, కాంచన్‌బాగ్‌, హైదరాబాద్‌-500058. Website:https://midhani-india.in/department_hrd/career-at-midhani/

Government Jobs

ఐఐటీ మద్రాస్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 22 వివరాలు: 1. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01 2. డిప్యూటీ రిజిస్ట్రార్‌: 02 3. టెక్నికల్ ఆఫీసర్‌: 01 4. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 02 5. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్‌: 01 6. జూనియర్‌ సూపరింటెండెంట్‌: 05 7. జూనియర్‌ అసిస్టెంట్: 10 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, టెక్నికల్ ఆఫీసర్‌, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు 45 ఏళ్లు, జేటీఎస్‌, జేఎస్‌ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్‌ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రొఫెషనల్ కాంపెటెన్స్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2025 ఏప్రిల్ 19. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19. Website:https://recruit.iitm.ac.in/

Government Jobs

ఐఐఎం బోధ్‌ గయాలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌ గయా ఒప్పంద ప్రాతిపదికన నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 13 వివరాలు: 1. ఎస్టేట్ కమ్ ప్రాజెక్టు ఆఫీసర్‌: 01 2. సిస్టం మేనేజర్‌: 01 3. కార్పొరేట్‌ రీలేషన్స్‌ మేనేజర్‌: 01 4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌: 01 5. ఇంటర్నల్‌ ఆడిట్ ఆఫీసర్‌: 01 6. ఏఏఓ(హిందీ లాంగ్వేజ్‌&అడ్మినిస్ట్రేషన్‌): 01 7. ఏఏఓ(ప్లేస్‌మెంట్): 02 8. వెబ్‌ డిజైనర్‌: 01 9. ఐటీ& కంప్యూటర్‌ అసిస్టెంట్(అడ్మిషన్స్‌): 01 10. ఆఫీస్‌ అసిస్టెంట్‌: 01 11. నర్సింగ్ స్టాఫ్‌(ఫీమేల్‌): 01 12. జూనియర్ హర్టీకల్చరిస్ట్‌: 01 13. లీగల్‌ ఆఫీసర్‌(కాంట్రాక్ట్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, సీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, డిగ్రీ,  నర్సింగ్‌, బీఎస్సీ, అగ్రి కల్చర్‌, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: లీగల్ ఆఫీసర్‌కు 65 ఏళ్లు, జూనియర్‌ హర్టీకల్చరిస్ట్‌కు 32 ఏళ్లు, నర్సింగ్‌ స్టాఫ్‌కు 35 ఏళ్లు, వెబ్ డిజైనర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఐటీ అండ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, కార్పొరేట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, సిస్టం మేనేజర్‌కు 50 ఏళ్లలోపు, ఎస్టేట్ కమ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌కు 55 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు లీగల్ ఆఫీసర్‌కు రూ.60,000, నర్సింగ్‌ స్టాఫ్‌, జూనియర్‌ హర్టీకల్చరిస్ట్‌కు రూ.25,500, ఐటీ అండ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌కు రూ.35,400, వెబ్‌ డిజైనర్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు రూ.47,600, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, కార్పొరేట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌కు రూ.56,100, సిస్టం మేనేజర్‌కు రూ.67,700, ఎస్టేట్‌ కమ్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.78,800. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 7. Website:https://iimbg.ac.in/careers/

Government Jobs

నేషనల్ ఏరోస్పేస్‌ ల్యాబోరేటరీస్‌లో పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ ల్యాబోరేటరీస్‌ (ఎన్ఏఎల్‌) జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 26 వివరాలు: 1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్): 09 2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(ఎస్‌&పీ): 05 3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎఫ్‌&ఏ): 07 4. జూనియర్ స్టెనోగ్రాఫర్‌: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్‌+2లో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ వచ్చి ఉండాలి.  వయోపరిమితి: 2025 మే 20వ తేదీ నాటికి జేఎస్‌ఏకు 28 ఏళ్లు, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 - రూ.63,200, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500 - రూ.81,100. ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 20. Website:https://recruit.nal.res.in/

Government Jobs

సీఎస్‌ఐఆర్‌ మద్రాస్‌ కాంప్లెక్స్‌లో జేఎస్‌ఏ పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌- మద్రాస్‌ కాంప్లెక్స్‌ జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్): 01 2. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(ఎఫ్‌&ఏ): 02 3. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌&పీ): 01 4. జూనియర్ స్టెనోగ్రాఫర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్‌+2లో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ వచ్చి ఉండాలి.  వయోపరిమితి: 2025 మే 20వ తేదీ నాటికి జేఎస్‌ఏకు 28 ఏళ్లు, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 30 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు జేఎస్‌ఏ పోస్టులకు రూ.37,885, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.51,408. ఎంపిక విధానం: ప్రొఫీషియన్సీ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19. Website:https://www.csircmc.res.in/careers

Admissions

మహాత్మా జ్యోతిబా ఫులె డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

మహాత్మా జ్యోతిబా ఫులె తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఎంజేటీబీసీ) హైదరాబాద్ 2025-2026 విద్యా సంత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: బీఎస్సీ, బీకామ్‌, బీబీఏ, బీఏ, బీఎఫ్‌టీ, బీహెచ్‌ఎంసీటీ. అర్హత: ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.  దరఖాస్తు ఫీజు: దోస్త్‌ స్టూడెంట్ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.225, మెయింటెనెన్స్‌ ఛార్జెస్‌ రూ.1000, కాషన్‌ డిపాజిట్‌ రూ.1000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 5. Website:https://tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ Apply online:https://cggpggateway.cgg.gov.in/PAYMENTSSPR/paymentEntrytgrdc15032025.tgrdc2025