Posts

Current Affairs

ఛైర్మన్స్‌ అవార్డు

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ 2025, ఫిబ్రవరి 23న ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్‌’ (ఎన్‌ఏఏసీపీ) ఇచ్చే ఛైర్మన్స్‌ అవార్డును లాస్‌ ఏంజెలిస్‌లో ఆమె స్వీకరించారు.

Current Affairs

జీఎఫ్‌ఎస్‌టీ సర్వే

గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ సస్టేనబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో ‘ఆక్వా కల్చర్‌ ఇన్నోవేషన్‌ టెక్‌ 2.0’ సదస్సు సందర్భంగా జనవరి 5 నుంచి 23 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగంపై సర్వే నిర్వహించారు. అందులోని అంశాలను 22 ఫిబ్రవరి 2025న వెల్లడించారు. అందులోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఆక్వా సాగు చేస్తుండగా అందులో 5 ఎకరాల్లోపు చెరువులు ఉన్న రైతులే 59 శాతానికిపైగా ఉన్నారు. కానీ, విస్తీర్ణపరంగా చూస్తే వీరు సాగు చేసేది 17.76% మాత్రమే. మొత్తం 59,879 మంది 4.44 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. అయిదెకరాల్లోపు 35,527 మంది ఉండగా వారు సాగు చేసే విస్తీర్ణం 78,889 ఎకరాలుగా ఉంది. 

Current Affairs

‘టెస్ట్‌ సిటీ’ నిర్మాణం

ఆటోమొబైల్‌ దిగ్గజమైన టయోటా, జపాన్‌లో వినూత్నంగా ఒక ‘టెస్ట్‌ సిటీ’ నిర్మిస్తోంది. రోబోలు, ఏఐ యంత్రాలు, అటానమస్‌ వాహనాల లాంటి అధునాతన సాంకేతిక ఉపకరణాలను పరీక్షించే అవకాశం ఈ టెస్ట్‌ సిటీలో ఉంటుంది. దీనికోసం 10 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.87,000 కోట్లు) వెచ్చిస్తోంది. మౌంట్‌ ఫుజీ సమీపంలోని వూవెన్‌ సిటీ వద్ద దీన్ని సిద్ధం చేస్తోంది. దాదాపు 47,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి దశను ఇప్పటికే పూర్తి చేశారు.  మొత్తం పూర్తయ్యే నాటికి 2.94 లక్షల చదరపు మీటర్ల ‘టెస్ట్‌ సిటీ’ ప్రాంగణం సిద్ధం అవుతుంది. ఈ ప్రదేశంలో గతంలో టయోటా ఆటో ప్లాంట్‌ ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న టెస్ట్‌ సిటీ పరిశోధకులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ప్రయోగశాల మాదిరిగా ఉపయోగపడుతుందని టయోటా పేర్కొంది.

Current Affairs

మయోరానా-1

శక్తిమంతమైన క్వాంటమ్‌ కంప్యూటర్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్‌ మయోరానా-1 పేరుతో ఒక విప్లవాత్మక క్వాంటమ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (క్యూపీయూ)ను ఆవిష్కరించింది. అరచేతిలో ఇమిడిపోయే ఈ సాధనాన్ని ‘గాడ్‌ చిప్‌’గా పేర్కొంటున్నారు. ఇది కంప్యూటింగ్‌ తీరుతెన్నులను సమూలంగా మార్చివేయనుందని నిపుణులు చెబుతున్నారు. పదార్థ శాస్త్రం, కృత్రిమ మేధ, కొత్త ఔషధాల ఆవిష్కరణ తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బాటలు పరుస్తుందని పేర్కొంటున్నారు.   మయోరానా-1 సాధనం టోపోలాజికల్‌ కోర్‌పై నిర్మితమైన తొలి క్వాంటమ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ అని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. పదార్థానికి సంబంధించి కొత్తగా కనుగొన్న ఒక దశ సాయంతో ఈ చిప్‌ పనిచేస్తుంది. 

Walkins

ఎన్‌ఐఎంఆర్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎంఆర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06  వివరాలు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I (నాన్‌ మెడికల్‌)- 01 కన్సల్టెంట్‌ (అడ్మిన్‌/ ఫైనాన్స్‌)- 03 3. కన్సల్టెంట్‌ (మానిటరింగ్‌)- 01 4. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III - 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, పీహెచ్‌డీ  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు 35 ఏళ్లు, కన్సల్టెంట్‌కు 70 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-1కు రూ.56,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు రూ.28,000; కన్సల్టెంట్‌కు రూ.60,000.  ఇంటర్వ్యూ తేదీ: 03.03.2025. ఇంటర్వ్యూ ప్రదేశం: ఎన్‌ఐఎంఆర్‌ సెక్టార్‌-8, ద్వారక, న్యూ దిల్లీ. Website:https://hindi.nimr.org.in/

Walkins

ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌ బెంగళూరులో పోస్టులు

ఐసీఎంఆర్‌- నేషనల్ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్ఫర్‌మ్యాటిక్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. యంగ్ ప్రొఫెషనల్-1(గ్రాఫిక్‌ డిజైన్‌): 01 2. యంగ్ ప్రొఫెషనల్-1(సాఫ్ట్ వేర్‌ టెస్టర్‌): 01 3. యంగ్‌ ప్రొఫెషనల్-2(సాఫ్ట్‌ వేర్‌ డెవలపర్‌): 01 4. యంగ్ ప్రొఫెషనల్-2(డేటా వేర్‌ హౌసింగ్‌ స్పెషలిస్ట్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ(కంప్యూటర్‌ అప్లికేషన్‌, ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్-1కు 35 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్-2కు 40 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్-1కు రూ.30,000, యంగ్‌ ప్రొఫెషనల్-2కు రూ.42,000. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా email recruitment@ncdirindia.org ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 18-03-2025. వేదిక: ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌, బెంగళూరు. Website:https://www.ncdirindia.org/Ncdir_Career.aspx

Government Jobs

ఎన్‌ఐఆర్‌టీలో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులు

ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపాదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 16 వివరాలు: అసిస్టెంట్‌: 05  అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01  లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 10 అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. వయోపరిమితి: అసిస్టెంట్‌ పోస్టుకు 30 ఏళ్లు ఏళ్లు మించకూడదు; అప్పర్‌ డివిజన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు 18 - 27 మధ్య ఉండాలి. జీతం: నెలకు అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.11,2400; అప్పర్‌ డివిజన్‌కు రూ.25,500-రూ.81,100; లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు రూ.19,900-రూ.63,200. దరఖాస్తు ఫీజు: అన్ రిజర్వ్‌డ్‌/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ వారికి రూ.2000; ఎస్సీ/ మహిళా అభ్యర్థులకు రూ.1,600. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-3-2025 Website:https://nirt.res.in/  

Government Jobs

నైపర్‌-అహ్మదాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్‌ అండ్ రిసెర్చ్‌ (నైపర్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లోని ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. ప్రొఫెసర్‌: 05 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 02 3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 04 విభాగాలు: బెయోటెక్నాలజీ, మెడికల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైసెస్‌, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్ ఎనలైసిస్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 40 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23-03-2025. Website:https://niperahm.ac.in/career/

Government Jobs

ఐఐఐటీఎంలో ఫ్యాకల్టీ పోస్టులు

గ్వాలియర్‌లోని అటల్‌ బీహరీ వాజ్‌పేయీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 55 వివరాలు:  1. ప్రొఫెసర్‌- 29 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌- 10 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 16 అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ-ఎన్‌సీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఇతరులకు రూ.500. ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, టీచింగ్‌ ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది జాయింట్‌ రిజిస్ట్రర్‌ ఏబీవీ- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ గ్వాలియర్‌ మెరెనా లింక్‌ రోడ్‌, గ్వాలియర్‌, మధ్యప్రదేశ్‌. దరఖాస్తు చివరి తేదీ: 17.03.2025. Website:https://iiitm.ac.in/index.php/en/

Admissions

ఎన్‌టీఏ- నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఎన్‌టీఏ విడుదల చేసింది. దేశంలోని 13 మాధ్యమాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కళాశాలలతో సహా మొదలైన వాటిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు పొందవచ్చు.  వివరాలు: నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) 2025 కోర్సులు: బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ. అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్‌సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 వివిధ వర్సిటీలు/ ఆర్‌ఐఈ/ ఎన్‌ఐటీలు/ ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ సంస్థల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్‌ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు; ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్‌ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో (50 సీట్లు), శ్రీకాకుళం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో (100 సీట్లు) ఉన్నాయి. పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లిష్‌, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది. దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650. తెలుగు రాష్ట్రాలలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-03-2025. దరఖాస్తు సవరణ తేదీలు: 18, 19.03.2025. పరీక్ష కేంద్రం వివరాల వెల్లడి: ఏప్రిల్‌ మొదటి వారం. అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: పరీక్షకు 3 లేదా 4 రోజుల ముందు. పరీక్ష తేది: 29-04-2025. Website:https://exams.nta.ac.in/NCET/ Apply online:https://ncet2025.ntaonline.in/