Posts

Current Affairs

3rd India-Cambodia Foreign Office Consultations (FOC)

♦ The 3rd India-Cambodia Foreign Office Consultations (FOC) were held in Siem Reap, Cambodia on 10 March 2025. ♦ The consultations were held in a warm and friendly atmosphere and provided an opportunity to review the entire gamut of bilateral relations including political cooperation, trade and investment, defence and security, development assistance, heritage conservation and restoration and consular issues. ♦ The two sides also exchanged views on regional and multilateral issues of mutual interest. 

Current Affairs

Railways (Amendment) Bill 2024

♦ Parliament has passed the Railways (Amendment) Bill 2024 with the Rajya Sabha approving it on 10 March 2025. ♦ The bill seeks to amend the Railways Act 1989 and is intended to enhance the power of the Railways Board and enhance the functioning and independence of the body. ♦ Lok Sabha has already given its nod to this bill on 2024 December 11.  ♦ Railways Minister Ashwini Vaishnaw said, the Indian railway is undergoing continuous reforms focussing on infrastructure modernisation, technology adoption and improved safety. ♦ He said, that in the last 11 years, 34 thousand new railway tracks have been laid down and 45 thousand kilometres of tracks have been electrified. 

Current Affairs

Memorandum of Understanding (MoU)

♦ India has signed a Memorandum of Understanding (MoU) with Armenia for cooperation in the field of medical products regulation on 10 March 2025. ♦ The MoU was signed in the presence of External Affairs Minister, Dr S Jaishankar and Foreign Minister of Armenia, Ararat Mirzoyan in Delhi. ♦ The two ministers agreed to explore cooperation in digital technologies and pharmaceuticals.  ♦ They also reviewed the whole range of growing India-Armenia bilateral cooperation including in the areas of political exchanges, trade, economics, connectivity, education, culture, and people-to-people contacts.  ♦ The two nations also signed an MoU on Cooperation between the Sushma Swaraj Institute of Foreign Service and the Diplomatic School of the Ministry of Foreign Affairs of Armenia.

Current Affairs

Commonwealth Games Federation (CGF)

♦ The Commonwealth Games Federation (CGF) has changed its name to Commonwealth Sports under the ‘More in Common’ brand campaign on 10 March 2025. ♦ The announcement was made on the occasion of Commonwealth Day, an annual celebration of the Commonwealth of Nations held on the second Monday in March. ♦ The Glasgow 2026 Commonwealth Games is the first edition of the Games to incorporate this logo into the event mark. ♦ The Commonwealth Day also marks the launch of the Commonwealth Sport King’s Baton Relay at Buckingham Place, starting the relay with 500 days to go to the Opening Ceremony of Glasgow 2026.

Current Affairs

రైల్వే బిల్లుకు ఆమోదం

రైల్వే (సవరణ) బిల్లు 2024కు రాజ్యసభ మూజువాణి ఓటుతో 2025, మార్చి 10న ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును 2024, డిసెంబరు 11న లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు 1905 నాటి రైల్వే చట్టం స్థానంలో అమలులోకి వస్తుంది. రైల్వే బోర్డు మరింత స్వతంత్రంగా వ్యవహరించడానికి, దాని పనితీరును మెరుగు పరచడానికి దోహదపడుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

Current Affairs

సైనిక దళాల శౌర్య యాత్ర

సైనిక దళాల సుదీర్ఘ మోటార్‌ సైకిల్‌ యాత్ర 2025, మార్చి 10న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన చాంగ్‌లాంగ్‌ జిల్లా విజయ్‌ నగర్‌లో ప్రారంభమైంది. 3,900 కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ శౌర్య యాత్ర గుజరాత్‌లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌లో ముగియనుంది. ఐక్యత, సాహసం, దేశభక్తి పేరుతో ఈ యాత్ర సాగుతోంది. ఈ యాత్రను విజయ్‌ నగర్‌లో నివసిస్తున్న 90 ఏళ్ల అస్సాం రైఫిల్స్‌ మాజీ ఉద్యోగి పదమ్‌ సింగ్‌ జెండా ఊపి ప్రారంభించారు.  ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌లో భాగంగా రక్షణ విభాగం ఈ యాత్రను నిర్వహిస్తోంది. యాత్రలో అస్సాం రైఫిల్స్, భారతీయ సైన్యం సిబ్బందితోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నలుగురు పౌరులు పాల్గొన్నారు. 

Current Affairs

సీజీఎఫ్‌ ఇక కామన్వెల్త్‌ స్పోర్ట్‌

కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) తన పేరును కామన్వెల్త్‌ స్పోర్ట్‌గా మార్చుకుంది. 2025, మార్చి 10న కామన్వెల్త్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది. గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్‌ క్రీడలను పురస్కరించుకుని కింగ్స్‌ బాటన్‌ రిలేను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో కింగ్‌ ఛార్లెస్‌ ప్రారంభించారు. 500 రోజుల కౌంట్‌డౌన్‌తో ఈ రిలేను మొదలుపెట్టారు. 74 దేశాల గుండా రిలే సాగనుంది.

Current Affairs

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జోయ్‌మల్యా

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ 2025, మార్చి 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. నియామకం ఖరారు కావడంతో ఆయన సుప్రీంకోర్టులో ఆరేళ్లకు పైగా సేవలందించనున్నారు. జస్టిస్‌ కె.వి.విశ్వనాథ్‌ పదవీ విరమణ అనంతరం 25 మే 2031 నుంచి 2 అక్టోబరు, 2031 వరకూ జస్టిస్‌ బాగ్చీ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది.  జస్టిస్‌ బాగ్చీ నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. కేటాయించిన సంఖ్య 34. 

Government Jobs

పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు

మహారాష్ట్రలోని పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 28 (అన్‌ రిజర్వ్‌డ్-13, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2, ఈడబ్ల్యూఎస్‌-2, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌-3) వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ సిస్టం ఇంజినీరింగ్‌, పవర్‌ ఇంజినీరింగ్‌, సివిల్, మెకానికల్, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మార్చి 25వ తేదీ నాటికి 29 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.23,000 - రూ.1,05,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-03-2025. Website:https://www.powergrid.in/en/job-opportunities

Government Jobs

ఐఏఎస్‌ఆర్‌ఐలో రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ( ఐఏఎస్‌ఆర్‌ఐ) ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 08 వివరాలు: 1. రిసెర్చ్‌ అసోసియేట్‌: 02 2. ఐటీ ప్రొఫెషన్‌-IV: 01 3. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 03 4. యంగ్‌ ప్రొఫెషనల్-I: 01 5. ఆఫీస్‌-కమ్‌-ల్యాబ్‌ అసిస్టెంట్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు, నెట్‌/ గేట్‌ స్కోర్‌, ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌ రూ.61,000, ఐటీ ప్రొఫెషన్‌కు రూ.60,000; సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.30,000; ఆఫీస్‌-కమ్‌-ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.25,000.  వయోపరిమితి: పోస్టును అనుసరించి 21 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31.3.2025  Website:https://www.iari.res.in/en/index.php