Posts

Current Affairs

43rd All India Police Equestrian Championship (AIPEC)

♦ The 43rd All India Police Equestrian Championship (AIPEC) and Mounted Police Duty Meet 2024-25 was commenced at the Basic Training Centre, Indo Tibetan Border Police (ITBP) campus, Bhanu, Haryana. ♦ The event was inaugurated by Punjab Director General of Police Gaurav Yadav as the Chief Guest. ♦ The event brought together elite riders from 19 states and Central Armed Police Forces (CAPFs). ♦ A total of 588 male and female riders competing in ranking, individual, team, and mixed events. The finale is scheduled to be held on March 23. ♦ With a 74-year legacy, the All India Police Games, organised under the All India Police Sports Control Board (AIPSCB), were first held in 1951.

Current Affairs

Women's Premier League (WPL)

♦ Mumbai Indians clinched the Women's Premier League (WPL) title at the Brabourne Cricket Stadium, Mumbai, on 15 March 2025. ♦ They defended Delhi Capitals in the final. ♦ This is Mumbai's second title. In 2023, Mumbai beat Delhi Capitals in the final of the Women's Premier League to clinch the title in the inaugural season of the women's domestic league.  ♦ Harmanpreet Kaur was awarded player of the match for her knock. ♦ Nat Sciver-Brunt was chosen as the Most Valuable Player of the tournament. ♦ She also won the Orange Cap for her 523 runs this season. ♦ Amelia Kerr won the Purple Cap for her 18 wickets this season while Amanjot Kaur won the Emerging Player of the Season award. 

Current Affairs

ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సు

జాతీయ భద్రత సలహాదారు అజీత్‌ డోభాల్‌ అధ్యక్షతన 2025, మార్చి 16న దిల్లీలో ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సు జరిగింది. ఉగ్రవాదం, అధునాతన సాంకేతికత ద్వారా ఎదురవుతున్న భద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన విధానాలపై ఇందులో చర్చించారు. ఈ సదస్సులో అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ , కెనడా నిఘాధిపతి డేనియల్‌ రోజర్స్, యూకే జాతీయ భద్రత సలహాదారు జొనాథన్‌ పొవెల్‌ తదితరులు పాల్గొన్నారు.

Current Affairs

రోప్‌వే పర్యాటకం

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్‌వే పర్యాటకంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్‌ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యం ఉంది. ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది. స్వదేశీదర్శన్‌ 2.0 పథకం కింద ఈ కోటను రూ.56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది. భువనగిరి ఖిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్‌-వరంగల్‌ 165వ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటరు దూరం వరకు రోప్‌వే ఏర్పాటుకానుంది. రాష్ట్రంలో తొలి రోప్‌వేగా ఇది గుర్తింపు పొందనుంది. ట్రెక్కింగ్‌ ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో ఒకటైన భువనగిరి కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతుంది. రోప్‌వే ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.

Current Affairs

రక్షణ రంగానికి విద్యుత్తు వాహనం

బెంగళూరుకు చెందిన విద్యుత్‌ వాహన (ఈవీ) తయారీ అంకుర సంస్థ ప్రవేగ్‌ ఆవిష్కరించిన ఆల్‌-టెర్రెయిన్‌ స్టెల్త్‌ వాహనం ‘వీర్‌’కు ఐడీఈఎక్స్‌ పురస్కారం లభించింది. వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం ప్రపంచంలోనే తొలి ఆపరేషనల్‌ ఈవీగా దీన్ని డిజైన్‌ చేశారు. సైన్యం పరిశీలన కోసం వెళ్లిన ఈ వాహనం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిష్ఠాత్మక ఐడీఈఎక్స్‌ పురస్కారాన్ని అందుకుంది. దేశ రక్షణ అవసరాల కోసం విద్యుత్తు వాహనాన్ని ప్రవేశ పెట్టడంలో, ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.

Current Affairs

చంద్రయాన్‌-5

చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్‌-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ వి.నారాయణన్‌ 2025, మార్చి 16న తెలిపారు. 2023లో ప్రయోగించిన చంద్రయాన్‌-3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్‌ రోవర్‌ను జాబిల్లిపై దించామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్‌-5లో మాత్రం 250 కిలోల రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ చేస్తామన్నారు. జపాన్‌తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్‌-4 మిషన్‌ను 2027లో ప్రయోగిస్తామని తెలిపారు.

Current Affairs

32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం, చండీగఢ్‌లోని సెమీకండక్టర్‌ లేబొరేటరీ (ఎస్‌సీఎల్‌) సంయుక్తంగా 32-బిట్‌ మైక్రోప్రాసెసర్‌ను అభివృద్ధి చేశాయి. దీన్ని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ సాధనానికి ‘విక్రమ్‌ 3201’ అని పేరు పెట్టారు. దీన్ని పూర్తిస్థాయి భారత పరిజ్ఞానంతో రూపొందించామని ఇస్రో తెలిపింది.

Current Affairs

శ్రీలంక

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జంతువుల సంఖ్య తెలుసుకునేందుకు 2025, మార్చి 15 నుంచి జంతుగణనను శ్రీలంక ప్రారంభించింది. గ్రామాల పరిసరాల్లో సంచరించే కోతులు, నెమళ్లు, ఉడతలు, కొండముచ్చుల సంఖ్య గురించి ప్రజల నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించారు. ఈ సర్వే కోసం దాదాపు 40 వేల మందికిపైగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లారు. జంతువుల వల్ల జరుగుతున్న పంటనష్టాన్ని శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం ఈ సర్వేకు కారణం.  శ్రీలంకలో 2022లో కేవలం జంతువుల వల్ల 6 నెలల వ్యవధిలో రూ.3 వేల కోట్ల విలువైన పంటనష్టం జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. 

Current Affairs

హాకీ ఇండియా పురస్కారాలు

భారత హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళల టీమ్‌ సీనియర్‌ గోల్‌కీపర్‌ సవిత పునియాలకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఉత్తమ ప్లేయర్‌ (2024) అవార్డులు దక్కాయి. సవిత బెస్ట్‌ గోల్‌కీపర్‌గా కూడా ఎంపికైంది. 2024లో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో జట్టు కాంస్యం గెలవడంలో హర్మన్‌ప్రీత్‌ కీలకపాత్ర పోషించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌ భారత మహిళల జట్టులో సవిత సభ్యురాలు. జట్టు కాంస్య పోరు వరకు వెళ్లడంలో ఈ గోల్‌కీపర్‌ పాత్ర కీలకం. ఈ పురస్కారం దక్కడం సవితకు ఇది మూడోసారి.  భారత్‌ హాకీ వందేళ్లు పూర్తి చేసుకోవడం, ప్రపంచకప్‌ నెగ్గి 50 ఏళ్లు గడిచిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. 

Current Affairs

హాకీ ప్రపంచకప్‌కు 50 ఏళ్లు

1975 మార్చి 15న భారత హాకీ జట్టు ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. దేశానికి దక్కిన ఏకైక ప్రపంచకప్‌ అది. ఒలింపిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యంతో భారత హాకీ జట్టు అప్పటికే ఏడు స్వర్ణాలు సాధించింది. 1971 ప్రపంచకప్‌ మొదలైనపుడు భారత జట్టు కాంస్యం నెగ్గింది, 1973లో రజతం సాధించింది. 1975లో అజిత్‌పాల్‌ సింగ్‌ నేతృత్వంలోని జట్టు స్వర్ణం నెగ్గింది. తర్వాత ఇంకెప్పుడూ భారత్‌కు కప్పు దక్కలేదు. ఈ అద్భుత విజయానికి 2025, మార్చి 15తో 50 ఏళ్లు పూర్తయ్యింది.