Posts

Current Affairs

మొండి బకాయిల రైటాఫ్‌

గత పదేళ్లలో (2014-24) బ్యాంకులు రూ.16.35 కోట్ల విలువైన మొండి బకాయిల (ఎన్‌పీఏ-నిరర్థక ఆస్తుల)ను రైటాఫ్‌ (సాంకేతికంగా రద్దు) చేసినట్లు పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇలా రైటాఫ్‌ చేసిన మొత్తాలు బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తారు మినహా, సదరు రుణగ్రహీత ఖాతా నుంచి మాఫీ కావు. అంటే రుణాలు తీసుకున్న వ్యక్తులు, కంపెనీలు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే. ఒక ఖాతాను మొండి ఖాతాగా వర్గీకరించాక, బ్యాంకు బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం, వివిధ రకాలుగా రికవరీ చర్యలను బ్యాంకులు కొనసాగిస్తాయి. 

Current Affairs

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా

కేంద్ర పన్నుల్లో 60% వాటా ఏడు రాష్ట్రాలకే వెళ్తోంది. అందులో ఉత్తర్‌ప్రదేశ్‌(18%), బిహార్‌(10%)లకు ఎక్కువ భాగం దక్కుతోంది. తొలిమూడు స్థానాల్లో ఉన్న యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌లకు కలిపి దాదాపు 36% వాటా వెళ్తోంది. తొలి ఏడు స్థానాల్లో ఉన్న పైమూడు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలకు కలిపి రూ.7,75,242.02 కోట్లు వెళ్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సంజయ్‌చౌధరి 2025, మార్చి 17న లోక్‌సభలో వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కలిపి కేంద్రం పన్నుల్లో వాటా కింద రూ.12,86,885.44 కోట్లు పంపిణీ చేయగా అందులో ఏడు రాష్ట్రాలకు 60%, మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% దక్కినట్లు తేలింది. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కలిపి రూ.2,03,327.38 కోట్లు (15.79%) దక్కాయి. 

Current Affairs

లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌

లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ (2028)లో బాక్సింగ్‌ను చేర్చనున్నారు. ఈ మేరకు బాక్సింగ్‌ను క్రీడల్లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఐఓసీ 2025, ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్‌కు గుర్తింపునిచ్చింది. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘాన్ని పక్కన పెట్టినట్లయింది. అధికారాలన్నీ ప్రపంచ బాక్సింగ్‌కు దక్కాయి. టోక్యో 2020, పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ పోటీలను ఐఓసీనే పర్యవేక్షించింది. పాలన విషయంలో వివాదాల నేపథ్యంలో ఐఓసీ 2023లో.. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) గుర్తింపును రద్దు చేసింది. 2028 ఒలింపిక్స్‌ కోసం ఐఓసీ 2022లో ప్రాథమికంగా క్రీడల జాబితాను సిద్ధం చేసింది. అందులో బాక్సింగ్‌ లేదు. 

Current Affairs

మోదీతో క్రిస్టోఫర్‌ లక్సాన్‌ భేటీ

భారతదేశ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి క్రిస్టోఫర్‌ లక్సాన్‌ 2025, మార్చి 17న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల లాంటి రంగాలకు సంబంధించి ఆరు ఒప్పందాలపై రెండు పక్షాలు సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని సంస్థాగతపరచుకోవాలని భారత్, న్యూజిలాండ్‌ నిర్ణయించుకున్నాయి. 

Current Affairs

జస్టిస్‌ జోయ్‌మల్యా ప్రమాణం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ 2025, మార్చి 17న బాధ్యతలు చేపట్టారు. ఆయనతో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం చేయించారు. జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ ఇప్పటివరకూ కలకత్తా హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ ఆరేళ్లకు పైగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆ వ్యవధిలో ఆయన సీజేఐగా పదోన్నతి పొందే అవకాశం ఉంది.

Current Affairs

‘టేస్ట్‌ అట్లాస్‌’ జాబితా

ప్రముఖ ఆహార, ప్రయాణ సంస్థ ‘టేస్ట్‌ అట్లాస్‌’ ప్రపంచంలోని 50 ఉత్తమ బ్రెడ్ల జాబితా విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన గార్లిక్‌ బటర్‌ నాన్‌కు మొదటిస్థానం లభించింది. తమిళనాడులో దొరికే పరోటాకు 6వ ర్యాంకు, ఉత్తరాది పరోటాకు 18వ ర్యాంకు దక్కాయి. ఈ జాబితాలో భటూరే వంటకం 26వ స్థానంలో నిలిచింది.

Current Affairs

ఎస్సీ వర్గీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని మొదట భావించింది. అయితే జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభాపై కచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది.  ఎస్సీ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేయనున్నారు. ఏ- కేటగిరీలో రెల్లి, ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్‌.. బీ కేటగిరీలో మాదిగ, ఉపకులాలకు 6.5 శాతం.. సీ కేటగిరీలో మాల, ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదిస్తూ రాజీవ్‌ రంజన్‌ మిశ్ర నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో 200 రోస్టర్‌ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్‌ నివేదికపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫారసుల్ని రాష్ట్ర మంత్రిమండలి 2025, మార్చి 17న ఆమోదించింది. 

Admissions

తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు

మహాత్మా జ్యోతిబాఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6, 7, 8, 9వ తరగతుల్లోని ఖాళీ సీట్లు భర్తీ కానున్నాయి.  వివరాలు: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9తరగతుల బ్యాక్‌లాగ్‌ ప్రవేశాలు (ఇంగ్లిష్‌ మీడియం, స్టేట్‌ సిలబస్‌) అర్హతలు: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 లేదా 2023-24 విద్యా సంవత్సరం విద్యను అభ్యసించి ఉండాలి. ఆరో తరగతికి సంబంధించి అయిదో తరగతి; ఏడో తరగతికి సంబంధించి ఆరో తరగతి; ఎనిమిదో తరగతికి సంబంధించి ఏడో తరగతి; తొమ్మిదో తరగతికి సంబంధించి ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000, పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000కు మించకూడదు. వయోపరిమితి: 31-08-2024 నాటికి ఆరో తరగతికి పన్నెండేళ్లు; ఏడో తరగతికి పదమూడేళ్లు; ఎనిమిదో తరగతికి పధ్నాలుగేళ్లు, తొమ్మిదో తరగతికి పదిహేనేళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. పరీక్ష విధానం: ప్రవేశ పరీక్ష తెలుగు-15, గణితం-30, సామాన్య శాస్త్రం-15, సాంఘీక శాస్త్రం-15, ఇంగ్లిషు-25 మార్కులతో అబ్జెక్టీవ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష కేంద్రం: వారి సొంత జిల్లాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.150. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2025. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ తేదీ: 15-04-2025. ప్రవేశ పరీక్ష తేదీ: 20-04-2025. అడ్మిషన్‌ ప్రక్రియ ముగింపు తేదీ: 31-07-2025. Website:https://mjptbcwreis.telangana.gov.in/ Apply online:https://mjptbcadmissions.org/home.do

Admissions

ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్‌ అండ్ ఎంపీపీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు:  మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌)   డాక్టర్‌ పబ్లిక్‌ పాలసీ (ఎంపీపీ) విభాగాలు: సివిల్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌/ బీఈ/ ఎంఎస్సీ, ఎంస్‌, వ్యాలీడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.  దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ పురుష అభ్యర్థులకు రూ.400, మహిళా అభ్యర్థులకు రూ.200; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 20-03-2025. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 21-04-2025. Website:https://www.iittp.ac.in/

Admissions

ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎంఎస్‌ అండ్ పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు:  మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్ బై రిసెర్చ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (ఎంఎస్ (ఆర్‌))  డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్ సైన్స్‌ (పీహెచ్‌డీ) అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌, ఎంస్‌, బీటెక్‌, ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ, పీజీ ఉత్తర్ణతతో పాటు గేట్‌/ యూజీసీ నెట్‌/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ ఎన్‌డీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌/ జేయూఎస్‌టీ వ్యాలీడ్‌ స్కోర్‌ ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ పురుష అభ్యర్థులకు రూ.400; మహిళా అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. ఎంపిక విధానం: విద్యార్హతలు, స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-04-2025. Website:https://www.iittp.ac.in/ph-d-admission Apply Onine:https://iittp.plumerp.co.in/prod/iittirupati/phdapplication