ఐసీఏఆర్-ఐఐఆర్‌ఆర్ హైదరాబాద్‌లో పోస్టులు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐసీఏఆర్-ఐఐఆర్‌ఆర్) ఒప్పంద ప్రాతిపదికన డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫార్మ్ మెషనరీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫార్మ్ మెషనరీ ఆపరేటర్: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ ఉత్తర్ణతతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయోపరిమితి: 21 - 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు రూ.20,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ఐసీఏఆర్-ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030. ఇంటర్వ్యూ తేది: మార్చి 25 Website:https://www.icar-iirr.org/index.php/en/?option=com_content&view=article&id=72