ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పోస్టులు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) బెంగళూరు జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 23 వివరాలు: 1. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 21 2. రీసెర్చ్ అసోసియేట్: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 20-04-2025 నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 28 ఏళ్లు, రీసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏళ్లులోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: జూనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ.37,000, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.58,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-04-2025. Website: https://www.isro.gov.in/URSCRecruitment2025_1.html