Posts

Current Affairs

పీఎల్‌ఐ పథకాలు

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2021లో పీఎల్‌ఐ పథకాలను ప్రకటించింది. టెలీకమ్యూనికేషన్స్, వైట్‌ గూడ్స్, టెక్స్‌టైల్స్, వైద్య పరికరాల తయారీ, వాహన, స్పెషాల్టీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీస్, డ్రోన్లు, ఔషధాల లాంటి 14 రంగాలకు రూ.1.97 లక్షల కోట్లతో ఈ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు రూ.14,020 కోట్ల నిధులను 10 రంగాలకు ప్రోత్సాహకాలుగా అందించించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Current Affairs

Jal Shakti Abhiyan Catch the Rain-2025

♦ Union Minister of Jal Shakti, CR Patil launched the nationwide campaign 'Jal Shakti Abhiyan Catch the Rain-2025' at the Tau Devi Lal Stadium in District Panchkula, Haryana on 22 March 2025. ♦ The campaign has been launched in collaboration with the Ministry of Jal Shakti, Ministry of Environment, Forest and Climate Change and Government of Haryana.  ♦ The campaign underlines the importance of water conservation, rainwater harvesting and groundwater recharge in the wake of climate change and increasing water challenges. The initiative is focusing on 148 districts across the country. ♦ Patil also launched ‘Jal-Jungle-Jan: Ek Prakritik Bandhan Abhiyan’, which strengthens the ecological relationship between rivers, springs and forests.

Walkins

ఇండియన్ రైల్వేస్‌లో టీచర్‌ ఉద్యోగాలు

ఇండియన్ రైల్వేస్‌ చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌  రైల్వే స్కూల్ డీవీ(గర్ల్స్‌), డీవీ(బాయ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన టీచర్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 37 వివరాలు: 1. పీజీటీ: 21 2. టీజీటీ: 16 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్‌, డిగ్రీ, డీఎడ్‌, ఎంఈడీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 20-03-2025 తేదీ నాటికి 18 - 65 ఏళ్లలోపు ఉండాలి. జీతం: నెలకు పీజీటీ పోస్టుకు రూ.27,500, టీజీటీ పోస్టుకు రూ.26,250. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12 వేదిక: మీటింగ్ రూమ్‌/జీఎం ఆఫీస్‌ బిల్డింగ్/ సీఎల్‌డబ్ల్యూ/సీఆర్‌జే. Website: https://clw.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,297,310&dcd=205&did=1742623461543DAEC6F2D5B1F7A136848820F3437EFBE

Walkins

సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐలో పోస్టులు

తమిళనాడులోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ) జూనియర్ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: జూనియర్ రిసెర్చ్‌ ఫెలో: 05 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 ఏప్రిల్ 9వ తేదీ నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. జీతం: నెలకు రూ.37,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: సీఎస్‌ఐఆర్‌-సీఈసీఆర్‌ఐ కరైకుడి ఇంటర్వ్యూ తేదీ: 1 ఏప్రిల్ 2025 Website: https://www.cecri.res.in/opportunities.aspx

Walkins

ఎయిమ్స్ మంగళగిరిలో పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎమిమ్స్‌), మంగళగిరి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. కౌన్సిలర్‌: 01 2. ప్రాజెక్టు అసిస్టెంట్: 01 3. ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్‌: 02 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: కౌన్సిలర్‌, ప్రాజెక్టు్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్‌కు 40-45 ఏళ్ల లోపు ఉండాలి. జీతం: నెలకు కౌన్సిలర్‌, ప్రాజెక్టు్‌ అసిస్టెంట్‌కు రూ. 23,515, ప్రాజెక్ట్‌ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.26,500. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 1 ఏప్రిల్ 2025 Website: https://www.aiimsmangalagiri.edu.in/vacancies/

Internship

ట్యూట్‌డ్యూడ్‌లో లో-లెవెల్‌ డిజైన్ పోస్టులు

ట్యూట్‌డ్యూడ్‌ కంపెనీ లో-లెవెల్‌ డిజైన్‌/ హైలెవెల్‌ డిజైన్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: లో-లెవెల్‌ డిజైన్‌/ హైలెవెల్‌ డిజైన్‌ ఇన్‌స్ట్రక్షన్‌  సంస్థ: ట్యూట్‌డ్యూడ్‌   నైపుణ్యాలు: ఏపీఐస్, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌  స్టైపెండ్‌: నెలకు రూ.25,000. వ్యవధి: నెల రోజులు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 12.04.2025. Website: https://internshala.com/internship/detail/work-from-home-part-time-low-level-design-high-level-design-instruction-internship-at-tutedude1741857193

Current Affairs

హోల్బర్గ్‌ ప్రైజ్‌-25

కోల్‌కతాకు చెందిన గాయత్రీ చక్రవర్తికి (82 ఏళ్లు) ప్రతిష్ఠాత్మకమైన ‘హోల్బర్గ్‌ ప్రైజ్‌-25’ దక్కింది. దీన్ని నోటెల్‌తో సమానంగా భావిస్తారు. ఆమె ప్రముఖ సాహితీ విమర్శకురాలు. తులనాత్మక సాహిత్యం, అనువాదం, అధ్యయనాలు, రాజకీయ తత్వశాస్త్రంసహా స్త్రీవాద సిద్ధాంతంలో గాయత్రి చేసిన విప్లవాత్మక ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధనలు ఆమెకు ఈ గౌరవం దక్కేలా చేశాయి.  నార్వే ప్రభుత్వం నుంచి జూన్‌ 5న ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. దీంతోపాటు రూ.4.6 కోట్ల నగదు బహుమతీ ఆమెకు లభిస్తుంది. 

Current Affairs

వినోద్‌ శుక్లాకు జ్ఞానపీఠ్‌

ప్రముఖ హిందీ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లా (88)ను దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్‌ వరించింది. 2024కి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ 2025, మార్చి 22న ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సృజనాత్మక, విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్యరంగానికి అందించిన విశిష్ట సేవలకు 59వ జ్ఞాన్‌పీఠ్‌కు శుక్లా ఎంపికయ్యారని కమిటీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత ఆయనే. జ్ఞానపీఠ్‌ను అందుకున్న 12వ హిందీ రచయితగా ఆయన నిలుస్తారు. పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.

Government Jobs

షిల్లాంగ్‌-ఎన్‌ఈఐజీఆర్‌ఐహెచ్‌ఎన్‌ఎస్‌లో గ్రూప్‌-సీ ఉద్యోగాలు

షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్‌ ఇంధిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎన్‌ఈఐజీఆర్‌ఐహెచ్‌ఎన్‌ఎస్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 130 వివరాలు: 1. నర్సింగ్ ఆఫీసర్‌: 105 2. స్టోర్‌ కీపర్‌: 03 3. రేడియోగ్రాఫర్‌: 03 4. మెడికల్ సోషల్‌ వర్కర్‌: 01 5. టెక్నీషియన్‌(ఎండోస్కోపి/కొలనోస్కోపీ): 02 6. టెక్నీషియన్‌(న్యూక్లియర్‌ మెడిసిన్‌): 04 7. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌: 01 8. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: 01 9. జూనియర్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్): 01 10. ఫార్మసిస్ట్‌: 01 11. టెక్నికల్ అసిస్టెంట్‌: 01 12. ఈసీజీ టెక్నీషియన్‌: 01 13. సానిటరి ఇన్‌స్పెక్టర్‌: 02 14. సెక్యూరిటీ గార్డ్‌: 01 15. రికార్డ్ క్లర్క్‌: 01 16. డ్రైవర్‌ గ్రేడ్-3: 01 17. డార్క్‌ రూమ్ అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఏ, బీఎస్సీ, బీటెక్‌, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌, జీఎన్‌ఎం, ఎంఏ, ఎంఎస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, డీ ఫార్మసి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 27 - 35 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20-04-2025. Website: https://neigrihms.gov.in/adsnotification.html

Government Jobs

సీసీఆర్‌హెచ్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 5 వివరాలు: 1. ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌: 01  2. కన్సల్టెంట్‌ (అకౌంట్స్‌): 02  3. కన్సల్టెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌): 01  4. కన్సల్టెంట్‌ (లీగల్‌): 01  అర్హత: పోస్టును అనుసరించి బీఈ (సివిల్‌), ఎస్‌ఏఎస్‌ లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ, లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 64 ఏళ్లు మించకూడదు. పని ప్రదేశం: సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి, జేఎల్‌ఎన్‌బీసీ అండ్‌ హెచ్‌ అనుసంధాన్‌ భవన్‌, ఇంటర్నేషనల్‌ ఏరియా, డి-బ్లాక్‌, జానక్‌పురి, న్యూదిల్లీ. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఈమెయిల్‌: ad.ccrh@yahoo.com దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2025. Website: https://www.ccrhindia.nic.in/