ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్ గయా ఒప్పంద ప్రాతిపదికన నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. ఎస్టేట్ కమ్ ప్రాజెక్టు ఆఫీసర్: 01
2. సిస్టం మేనేజర్: 01
3. కార్పొరేట్ రీలేషన్స్ మేనేజర్: 01
4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01
5. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: 01
6. ఏఏఓ(హిందీ లాంగ్వేజ్&అడ్మినిస్ట్రేషన్): 01
7. ఏఏఓ(ప్లేస్మెంట్): 02
8. వెబ్ డిజైనర్: 01
9. ఐటీ& కంప్యూటర్ అసిస్టెంట్(అడ్మిషన్స్): 01
10. ఆఫీస్ అసిస్టెంట్: 01
11. నర్సింగ్ స్టాఫ్(ఫీమేల్): 01
12. జూనియర్ హర్టీకల్చరిస్ట్: 01
13. లీగల్ ఆఫీసర్(కాంట్రాక్ట్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ, నర్సింగ్, బీఎస్సీ, అగ్రి కల్చర్, ఎల్ఎల్బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: లీగల్ ఆఫీసర్‌కు 65 ఏళ్లు, జూనియర్ హర్టీకల్చరిస్ట్కు 32 ఏళ్లు, నర్సింగ్ స్టాఫ్‌కు 35 ఏళ్లు, వెబ్ డిజైనర్, ఆఫీస్ అసిస్టెంట్, ఐటీ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు, కార్పొరేట్ రిలేషన్షిప్ మేనేజర్, సిస్టం మేనేజర్‌కు 50 ఏళ్లలోపు, ఎస్టేట్ కమ్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు 55 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు లీగల్ ఆఫీసర్‌కు రూ.60,000, నర్సింగ్ స్టాఫ్, జూనియర్ హర్టీకల్చరిస్ట్కు రూ.25,500, ఐటీ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ.35,400, వెబ్ డిజైనర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు రూ.47,600, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కార్పొరేట్ రిలేషన్షిప్ మేనేజర్‌కు రూ.56,100, సిస్టం మేనేజర్‌కు రూ.67,700, ఎస్టేట్ కమ్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు రూ.78,800.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 7.
Website:https://iimbg.ac.in/careers/