Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

అర్థ, గణాంక శాఖ అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తెలంగాణలో ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రికార్డు స్థాయిలో 2.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని భారత అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు సీజన్లలో కలిపి 2.37 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రాగా.. బియ్యం 174.46 లక్షల టన్నులు వచ్చింది. ఈ సారి దాన్ని అధిగమిస్తుందని పేర్కొంది.  ఏటా నాలుగుసార్లు పంట దిగుబడులపై ఈ శాఖ క్షేత్రస్థాయిలో పంట కోత ప్రయోగాలు నిర్వహించి సాగు విస్తీర్ణం ఆధారంగా అంచనా వేస్తుంది. 2025, నవంబరులో మొదటి ముందస్తు అంచనాలను కేంద్రానికి పంపింది.  

Current Affairs

నాస్కామ్‌-ఇండీడ్‌ నివేదిక

ప్రస్తుతం టెక్‌ సంస్థల్లో దాదాపు 40% పనులు కృత్రిమ మేధ (ఏఐ) నిర్వహిస్తున్నట్లు పరిశ్రమ సంఘం నాస్కామ్, ఇండీడ్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘వర్క్‌ రీ-ఇమాజిన్డ్‌- ది రైస్‌ ఆఫ్‌ హ్యూమన్‌-ఏఐ కొలాబరేషన్‌’ సర్వే తెలిపింది. 2027 నాటికి నిపుణులు, ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని 97% మంది మానవ వనరుల విభాగాధిపతులు ఊహిస్తున్నారు. ఆటోమేషన్‌ పెరుగుతున్నా, నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఏఐ టెక్‌ సంస్థల్లో ఒక సహోద్యోగిగా మారిపోయింది అని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20-40% పనులను ఏఐ నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Walkins

డీఆర్‌డీఓలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ పోస్టులు

బెంగళూరులోని డీఆర్‌డీవో- సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌బోర్న్స్‌ సిస్టమ్‌ (సీఏబీఎస్) వివిధ విభాగాల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 10 వివరాలు: విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత, గేట్ స్కోర్‌ లేదా ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు రూ.37,000. వయోపరిమితి: 31.12.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ jrf.rectt.cabs[at]gov.in ద్వారా ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీలు: 25, 26.02.2026. Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies

Walkins

బార్క్‌ ముంబయిలో నర్స్ ఉద్యోగాలు

ముంబయిలోని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్‌) అడ్‌హక్‌ ప్రాతిపదికన నర్స్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: నర్స్‌: 12 పోస్టులు అర్హత: నర్సింగ్ & మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.  గరిష్ఠ వయో పరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.  జీతం: నెలకు రూ.24,234 ఇంటర్వ్యూ తేదీ: 27.01.2026. వేదిక: కాన్ఫరెన్స్‌ రూం.నెం2, గ్రౌండ్‌ఫ్లోర్‌, బార్క్‌ హాస్పిటల్‌, అనుశక్తినగర్‌, ముంబయి. Website:https://barc.gov.in/careers/recruitment.html

Private Jobs

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో బ్రాంచ్‌ హెడ్‌ పోస్టులు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎంబీ) దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లో బ్రాంచ్‌ హెడ్‌ (మేనేజర్‌/ సీనియర్‌మేనేజర్‌/అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 20 వివరాలు: రాష్ట్రాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 1, కర్ణాటక 05, కేరళ 4, గుజరాత్‌ 02 మహారాష్ట్ర 03, రాజస్థాన్ 1, తెలంగాణ 02, పశ్చిమ్‌ బెంగాల్ 1, దిల్లీ 1. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైన విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ /పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: 31.12.2025 నాటికి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 31.01.2026. Website:https://www.tmbnet.in/tmb_careers/ 

Internship

స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌ కంపెనీలో ఉద్యోగాలు

స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌ కంపెనీ మార్కెటింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: స్టార్‌టూన్‌ ల్యాబ్స్‌ పోస్టు పేరు: మార్కెటింగ్‌  నైపుణ్యాలు: లీడ్‌ జనరేషన్, ఎంఎస్‌-ఆఫీస్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.8,000 - రూ.10,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 06-02-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-marketing-internship-at-startoon-labs-private-limited1767782300

Government Jobs

సమీర్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (సమీర్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడదుల చేసింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 147. వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 71 ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 05 ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 34 ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఏ అండ్‌ బి): 37 విభాగాలు: ఆర్‌ఎఫ్‌ అండ్‌ ఎండబ్ల్యూ, ఎలక్ట్రానిక్స్‌, సీఎస్‌/ఐటీ, సేఫ్టీ, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ హెచ్‌వీఏసీ, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌, అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌, మెడికల్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ, ఉత్తీర్ణత ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు రూ.34,000; ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ రూ.23,500; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏకు రూ.21,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌  -బికు రూ.23,500. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఏకు 25 ఏళ్లు; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ 30ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: పోస్టును అనుసరించి, రాత పరీక్ష/ స్కిల్‌/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 25-01-2026. ఆన్‌లైన్‌ టెస్ట్‌: 01.02.2026. Website:https://recruitment.sameer.gov.in/

Government Jobs

ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్‌ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ), ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఫ్యాకల్టీ, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 05 వివరాలు: 1. జూనియర్ ఫ్యాకల్టీ - 02 2. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ - 02 3. జూనియర్ ల్యాబ్ ఇన్‌స్ట్రక్టర్ - 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి కనీసం 55 శాతం మార్కులతో టెన్త్‌/ఇంటర్‌/ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.30,000.- రూ.50,000. గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 27.  Website:https://fddiindia.com/career

Walkins

Junior Research Fellowship Posts In DRDO-CABS

DRDO-Centre for Airborne Systems (CABS), Bengaluru is inviting applications for the Junior Research Fellowship program in various departments.  No. of posts: 10 Details: Departments: Computer Science and Engineering, Electronics and Communication Engineering, Electrical Engineering, Mechanical Engineering. Eligibility: Must have passed BE/B.Tech in the relevant engineering discipline or ME/M.Tech with a GATE score. Stipend: Rs.37,000 per month. Age limit: Should not exceed 28 years as on 31.12.2025. Application process: Applications must be submitted via email to jrf.rectt.cabs[at]gov.in by February 22.  Interview Dates: 25, 26.02.2026. Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies

Walkins

Nurse Posts In BARC, Mumbai

The Bhabha Atomic Research Centre (BARC), under the Department of Atomic Energy, Mumbai is conducting interviews for the recruitment of Nurse posts on an ad-hoc basis.  Details: Nurse: 12 posts Eligibility: Diploma in Nursing & Midwifery or B.Sc Nursing, along with computer knowledge and work experience. Maximum age limit: Should not exceed 50 years. Salary: Rs.24,234 per month Interview date: 27.01.2026. Venue: Conference Room No. 2, Ground Floor, BARC Hospital, Anushaktinagar, Mumbai. Website:https://barc.gov.in/careers/recruitment.html