Posts

Admissions

నిట్‌ కురుక్షేత్రలో ఎంబీఏ ప్రవేశాలు

నిట్‌ కురుక్షేత్రలో ఎంబీఏ ప్రవేశాలు  హరియాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర (ఎన్‌ఐటీకే) 2025- 27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  వివరాలు:  మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) 2025 - 2027 మొత్తం సీట్ల సంఖ్య: 53 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఏదైనా నేషనల్‌ లెవెల్‌ పరీక్ష స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.2000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2025. గ్రూప్‌ డిస్క్‌షన్‌, ఇంటర్వ్యూ ప్రకటన తేదీ: 08.05.2025. గ్రూప్‌ డిస్క్‌షన్‌, ఇంటర్వ్యూ తేదీ: 19.05.2025. మెరిట్‌ లిస్ట్‌: 20.05.2025. మొదటి రౌండ్‌ అడ్మిషన్ కౌన్సెలింగ్‌: 21-22.05.2025. రెండో మెరిట్‌ లిస్ట్‌: 23.05.2025. రెండో రౌండ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ (మిగిలి సీట్లకు మాత్రమే): 27.05.2025. Website: https://nitkkr.ac.in/admission-2021/

Current Affairs

ఆర్థిక కార్యదర్శిగా అజయ్‌ సేథ్‌

ఆర్థిక కార్యదర్శిగా అజయ్‌ సేథ్‌ కేంద్రప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ సేథ్‌ 2025, మార్చి 24న నియమితులయ్యారు. ఈయన కర్ణాటక క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న తుహిన్‌ కాంత పాండే, సెబీ ఛైర్మన్‌గా వెళ్లడంతో ప్రస్తుత నియామకం జరిగింది.

Current Affairs

పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌

దేశవ్యాప్తంగా గత పదేళ్లలో (2014-24) 1,734 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది దిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువని పేర్కొంది. అటవీయేతర కార్యకలాపాల కోసం 1.73 లక్షల హెక్టార్ల అటవీ భూమిని అనుమతించామని 2025, మార్చి 24న కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ లోక్‌సభలో తెలిపారు. ఇందులో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులున్నాయని వివరించారు.  మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 385.52 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను మళ్లించామని మంత్రి తెలిపారు. రెండో స్థానంలో ఒడిశా ఉందని, అక్కడ 244 చదరపు కిలోమీటర్ల అటవీ భూములను మళ్లించామని వెల్లడించారు. మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 114.22 చదరపు కిలోమీటర్లను అభివృద్ధి ప్రాజెక్టులకు ఇచ్చామని పేర్కొన్నారు. 

Current Affairs

బిల్లీ జీన్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ

బిల్లీ జీన్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా- ఓసియానియా గ్రూపు-1 టెన్నిస్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. 2025,  ఏప్రిల్‌ 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే ప్రతిష్టాత్మక మహిళల టీమ్‌ టోర్నీలో ఆరు జట్లు బరిలో దిగనున్నాయి. భారత్‌తో పాటు న్యూజిలాండ్, చైనీస్‌ తైపీ, హాంకాంగ్, థాయ్‌లాండ్‌లు టోర్నీలో పాల్గొంటాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. ప్రతి పోరులో రెండు సింగిల్స్, ఒక డబుల్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి. అంకిత రైనా ఆధ్వర్యంలో ప్రార్థన తొంబారె, సహజ యమలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరిలు భారత్‌ తరఫున బరిలో దిగనున్నారు.

Current Affairs

గోపాల్‌ మిత్తల్‌

గోపాల్‌ మిత్తల్‌ ప్రపంచ మొబైల్‌ ఆపరేటర్ల సంఘం (జీఎస్‌ఎంఏ) బోర్డు కొత్త ఛైర్మన్‌గా భారతీ ఎయిర్‌టెల్‌ వైస్‌ ఛైర్మన్, ఎండీ గోపాల్‌ మిత్తల్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన జీఎస్‌ఎంఏ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సునీల్‌ భారతీ మిత్తల్‌ తర్వాత, జీఎస్‌ఎంఏ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికైన రెండో భారతీయుడిగా గోపాల్‌ నిలిచారు. 

Current Affairs

సంజయ్‌సింగ్‌

సంజయ్‌సింగ్‌  భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్‌సింగ్‌ యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2025, మార్చి 24న యూడబ్ల్యూడబ్ల్యూ- ఆసియా జనరల్‌ అసెంబ్లీ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో సంజయ్‌ విజయం సాధించాడు. మొత్తం 38 ఓట్లలో సంజయ్‌కు 22 లభించాయి.  

Current Affairs

Yes! We Can End TB: Commit, Invest, Deliver

♦ World Tuberculosis Day is observed annually on March 24. ♦ On March 24, 1882, when Dr. Robert Koch discovered Mycobacterium tuberculosis, the bacterium responsible for the disease. ♦ More than a century later, World Tuberculosis Day was established on the same date to honour this discovery. ♦ 2025 theme: “Yes! We Can End TB: Commit, Invest, Deliver." 

Current Affairs

Chopra was appointed as the Chairman and Managing Director

♦ Parminder Chopra was appointed as the Chairman and Managing Director (CMD) of REC Limited for a three-month tenure.   ♦ Currently she holds the position of CMD at Power Finance Corporation Ltd. (PFC). ♦ Chopra made history on August 14, 2023, when she became the first woman to lead India’s largest Non-Banking Financial Company (NBFC), PFC. ♦ Her remarkable career also includes serving as Director (Finance) at PFC since 2020 and holding the additional charge of CMD from June 1, 2023.

Current Affairs

Ajay Seth was appointed Finance Secretary

♦ Ajay Seth was appointed Finance Secretary in the Union Ministry of Finance on 24 March 2025. ♦ He is currently the secretary in the Department of Economic Affairs in the finance ministry and holds additional charge as revenue secretary. ♦ Ajay is a 1987-batch Indian Administrative Service officer from the Karnataka cadre. He was the officer-in-charge of the finance track of the Group of 20 (G20) under India’s presidency. ♦ The role of the finance secretary usually goes to the senior-most officer in the finance ministry. The post had fallen vacant after the previous finance secretary, Tuhin Kanta Pandey, was appointed chairman of the Securities and Exchange Board of India (SEBI).

Current Affairs

Gopal Vittal was elected as the new Chairman

♦ Bharti Airtel's Vice Chairman and Managing Director Gopal Vittal was elected as the new Chairman of the GSMA board on 24 March 2025. ♦ He is currently the acting Chair of the GSMA board. Gopal is the second Indian, after Sunil Bharti Mittal, to be elected as the Chairman of the GSMA board. ♦ GSMA include 1,000 telecom companies from across the world, handset and device companies, software companies, equipment providers, internet companies and organisations in allied industry sectors.