Posts

Current Affairs

రక్షణ నౌక ‘మగదల’ జలప్రవేశం

భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్‌ షిప్‌యార్డు నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్‌ నౌక ‘మగదల’ను కొచ్చిన్‌లో జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.

Current Affairs

పాక్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

పాకిస్థాన్‌కు చెందిన ‘పీఆర్‌ఎస్‌ఎస్‌-2’ అనే రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని చైనా 2025, అక్టోబరు 19న ప్రయోగించింది. లిజియాన్‌-1 వై8 వాహక రాకెట్‌ ఈ ఉపగ్రహంతో పాటు ఎయిర్‌శాట్‌ 03, ఎయిర్‌శాట్‌ 04 అనే రెండు చైనా ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లి.. నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.

Current Affairs

వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో 24 దేశాలకు మన ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్‌ల వల్ల 2025 సెప్టెంబరులో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయని పేర్కొంది. మన ఎగుమతులు పెరిగిన 24 దేశాల్లో కొరియా, యూఏఈ, జర్మనీ, టోగో, ఈజిప్ట్, వియత్నాం, ఇరాక్, మెక్సికో, రష్యా, కెన్యా, నైజీరియా, కెనడా, పోలండ్, శ్రీలంక, ఒమన్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, బ్రెజిల్, బెల్జియం, ఇటలీ, టాంజానియా తదితర దేశాలున్నాయి. ఈ 24 దేశాలకు 129.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11.37 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు జరిగాయి. మొత్తం మన ఎగుమతుల్లో ఈ దేశాల వాటా 59%.

Current Affairs

రాయచూరులో ‘లిథియం’ నిల్వలు

కర్ణాటకలోని రాయచూరులో ఉన్న తూర్పు ధార్వాడ్‌ క్రాటన్‌లోని అమరేశ్వర్‌ ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, ఇతర సంస్థలతో కలిసి జరిపిన పరిశోధనలోల ఇది వెల్లడైంది.  ఈ  అధ్యయనంలో లిథియం ప్రధానంగా రెండు ఖనిజాలు.. స్పోడుమీన్, జిన్వాల్డైట్‌లలో ఉన్నట్లు కనుగొన్నారు. వీటిపై భూ రసాయన విశ్లేషణ చేపట్టగా అరుదైన లోహాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు.

Current Affairs

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ తన్వి శర్మ (16 ఏళ్లు) రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 19న గువాహటిలో జరిగిన బాలికల సింగిల్స్‌ తుది పోరులో తన్వి 7-15, 12-15తో అన్యాపత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది.  ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన పతకమిది. 

Current Affairs

జాబిల్లిపై సూర్యుడి ప్రభావం

సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్‌-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్‌), దాని ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, అక్టోబరు 18న తెలిపింది.  2019 జులై 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌.. అదే ఏడాది ఆగస్టు 20న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అందులో భాగంగా ఉన్న ల్యాండర్‌.. చందమామ ఉపరితలంపై కూలిపోయినా ఆర్బిటర్‌ మాత్రం సేవలు అందిస్తూనే ఉంది. అందులోని చంద్రా అట్మాస్పియరిక్‌ కంపోజిషనల్‌ ఎక్స్‌ప్లోరర్‌-2 (చేస్‌-2) పరికరం.. చంద్రుడి వాతావరణంపై సౌర జ్వాలల ప్రభావాన్ని నిశితంగా పరిశీలించింది. 

Current Affairs

ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్‌జింగ్‌ (చైనా)లో జరిగిన కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌)ను ఓడించింది. ఈ పోరులో ఆమె వరుసగా 15 సార్లు ఫర్‌ఫెక్ట్‌ టెన్‌ స్కోరు చేసింది.  ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో భారత్‌కు ఇదే  తొలి పతకం.

Current Affairs

చెన్‌నింగ్‌ యాంగ్‌ కన్నుమూత

 చైనాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత చెన్‌ నింగ్‌ యాంగ్‌(103) బీజింగ్‌లో 2025, అక్టోబరు 18న మరణించారు. తూర్పు చైనాలోని అన్హుయ్‌ ప్రావిన్స్‌లో ఉన్న హెఫెయ్‌లో 1922లో యాంగ్‌ జన్మించారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన అనంతరం బోధనా పదవులను చేపట్టారు. భౌతికశాస్త్రంలో చేసిన కృషికి 1957లో యాంగ్‌కు నోబెల్‌ బహుమతి లభించింది. 

Government Jobs

ఐఐటీ రూర్కెలాలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కెలా ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: రిసెర్చ్ అసోసియేట్ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.58,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా anjaneya.dixit@ce.iitr.ac.in కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 26-10-2025. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html  

Apprenticeship

సీఎస్ఐఆర్- ఎన్‌ఎంఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్‌ మెటలార్జికల్‌ ల్యాబొరేటరీ గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ట్రేయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 22 వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 13 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 09 విభాగాలు: మెటలార్జికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, ఈసీఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ డిగ్రీ, ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఇప్పటికే అప్రెంటిషిప్‌ అర్హత పొంది ఉండకూడదు. వయోపరిమితి: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు 18 నుంచి 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు.  స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.10,900.  దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీ: 31-10-2025. వేదిక: సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ మెటలార్జికల్‌ ల్యాబొరేటరీ, బర్మామైన్స్‌, జంషెడ్పూర్‌. Website:https://nml.res.in/