Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

సీఎస్‌గా సాయిప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్‌ 2026, ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా సేవలందించిన విజయానంద్‌ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో సాయిప్రసాద్‌ నియమితులయ్యారు.  సాయిప్రసాద్‌ను జలవనరులు, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పోస్టుల్లోను (పూర్తి అదనపు బాధ్యత) కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Current Affairs

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా హ్యూమన్‌ ప్యాపిలోమావైరస్‌(హెచ్‌పీవీ)ని ఇది అరికడుతుంది. ఇందులోభాగంగా 14 సంవత్సరాల బాలికలకు సింగిల్‌ డోస్‌ ‘గార్డాసిల్‌-4’ అనే టీకాను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది.   

Current Affairs

93వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆరవ్‌

ముంబయికి చెందిన ఆరవ్‌ (17 ఏళ్లు) గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు. మన దేశం నుంచి జీఎం అయిన 93వ ఆటగాడిగా అతడు సాధించాడు. బోస్నియాలో జరిగిన జీఎం మిక్స్‌ బిజెల్‌జినా టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా.. గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు అవసరమైన చివరి నార్మ్‌ను ఆరవ్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 2506 ఎలో పాయింట్లు ఉన్నయి. ఆరవ్‌ 2022లో ఫిడే మాస్టర్, 2024లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాలు దక్కించున్నాడు. 

Current Affairs

రంజీ ట్రోఫీ

    భారత దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూకశ్మీర్‌ నిలిచింది. 67 ఏళ్ల తన రంజీ చరిత్రలో తొలిసారిగా ఈ జట్టు విజేతగా నిలిచింది. 2026, ఫిబ్రవరి 28న హుబ్బళి వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కర్ణాటకపై జమ్మూకశ్మీర్‌ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్‌ 584 పరుగుల భారీ స్కోరు సాధించగా.. కర్ణాటక 293 పరుగులకే ఆలౌటైంది. జమ్మూకశ్మీర్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన శుభమ్‌ పుందిర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా.. ఈ రంజీ సీజన్లో 60 వికెట్లు పడగొట్టడమే కాక, 245 పరుగులు చేసిన ఆకిబ్‌ నబి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. జమ్మూకశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌: 584; కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 293; జమ్మూకశ్మీర్‌ రెండో ఇన్నింగ్స్‌: 342/4 డిక్లేర్డ్‌ (కమ్రాన్‌ ఇక్బాల్‌ 160 నాటౌట్, సాహిల్‌ లోత్రా 101 నాటౌట్‌; ప్రసిద్ధ్‌ కృష్ణ 2/42) రంజీ ట్రోఫీ గెలిచిన 18వ జట్టు జమ్మూకశ్మీర్‌. 

Walkins

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్‌కేసర్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలు

ఎన్‌ఎఫ్‌సీ నగర్‌, ఘట్‌కేసర్‌, భువనగిరిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపాదికన టీచింగ్‌ పోసట్ఉల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: పీజీటీ: హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌. టీజీటీ: ఇంగ్లిష్‌, సంస్కృతం, మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌,  ఇతర పోస్టులు: పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌), కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, అకాడమిక్‌ కౌన్సెలర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, నర్స్‌, బాలవాటిక టీచర్‌, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, తెలుగు టీచర్‌. అర్హత: పోస్టును అనుసరించి 50% మార్కులతో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ/ బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఏ/బీఏ, బీఎస్సీ, బీఎడ్‌, ఎంఎడ్‌, డీఎడ్‌, పీజీ, సీటెట్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్‌ టీచింగ్‌ ప్రావీణ్యం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ: 06.03.2026. వేదిక: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌, ఘట్‌కేసర్‌, భువనగిరి. Website:https://ghatkesarnfc.kvs.ac.in/

Government Jobs

ఎన్‌ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ (ఎన్ఐటీ), తిరుచిరాపల్లి, రెగ్యులర్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ /జూనియర్ ఇంజినీర్ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య - 09 వివరాలు: 1. టెక్నికల్ అసిస్టెంట్ - 05  2. జూనియర్ ఇంజినీర్ - 03  3. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 01  అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.9,300 - రూ.34,800. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ /రిటన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా  చిరునామా: ది రిజిస్ట్రార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ తిరుచిరప్పల్లి. దరఖాస్తు చివరి తేదీ: 25-03-2026  Website:https://www.nitt.edu/

Government Jobs

హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), హైదరాబాద్, రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 22 వివరాలు: 1. ప్రొఫెసర్  - 08 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 09 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్/స్లేట్‌లో అర్హత సాధించి ఉండాలి. జీతం: ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి  రూ.2,17,100 వరకు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి  రూ.1,82,400 వరకు ఉంటుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 23-03-2026. హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: 30-03-2026. Website:https://manuu.edu.in/notifications/Employment

Admissions

సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు

హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), 2026-27 విద్యా సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: 1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60 సీట్లు 2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (డీఈసీఈ): 60 సీట్లు 3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్‌ రోబోటిక్స్ ఇంజినీరింగ్ (డీఏఆర్‌ఈ): 60 సీట్లు 4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ (డీపీఈ): 60 సీట్లు వ్యవధి: మూడేళ్లు. అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: 22-05-2026 నాటికి 19 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు.  ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 10వ తరగతికి సంబంధించి మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌, యాప్టిట్యూడ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి: ఒకటిన్నర గంటలు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 22-05-2026. ప్రవేశ పరీక్ష తేదీ: 25-05-2026. ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్. Website:https://www.citd.in/index.php

Walkins

Teaching Posts In PM Shri Kendriya Vidyalaya, Ghatkesar

PM Shri Kendriya Vidyalaya, NFC Nagar, Ghatkesar, Bhuvanagiri is conducting interviews for the teaching posts on contractual basis for the academic year 2026-27.  Details: PGT: Hindi, English, Physics, Maths, Chemistry, Biology, Computer Science, Commerce, Economics. TGT: English, Sanskrit, Maths, Social Science, Other posts: PRT (Primary Teacher), Computer Instructor, Sports Coach, Academic Counselor, Special Educator, Nurse, Nursery Teacher, Vocational Instructor, Telugu Teacher. Qualification: Intermediate, Diploma, Degree/ BE/B.Tech, M.Sc, MA/BA, B.Sc, B.Ed, M.Ed, D.Ed, PG, CTET passed with 50% marks as per the post. Should have computer knowledge, Hindi, English teaching proficiency. Age limit: Should be between 18 to 65 years. Interview date: 06.03.2026. Venue: PM Shri Kendriya Vidyalaya, NFC Nagar, Ghatkesar, Bhuvangiri. Website:https://ghatkesarnfc.kvs.ac.in/

Government Jobs

Technical Assistant Jobs in NIT Tiruchirappalli

National Institute of Technology (NIT), Tiruchirappalli, invites applications for the recruitment of Technical Assistant/ Junior Engineer/ Library and Information Assistant posts on regular basis.  No. of Posts - 09 Details: 1. Technical Assistant - 05 2. Junior Engineer - 03 3. Library and Information Assistant - 01 Eligibility: Candidates should have passed Diploma/Degree/BE/B.Tech in the relevant discipline from a recognized university as per the posts. Maximum Age Limit: Not exceeding 30 years. Age relaxation of 5 years for SC/ST and 3 years for OBC. Salary: Rs.9,300 - Rs.34,800 per month. Selection Process: Candidates will be selected on the basis of Screening Test, Skill Test/Main Written Test. Application Procedure: Online Address: The Registrar, National Institute of Technology Tiruchirappalli-620015, Last Date of Application: 25-03-2026 Website:https://www.nitt.edu/