Posts

Current Affairs

వందన కటారియా

భారత మహిళల హాకీ వెటరన్‌ ప్లేయర్‌ వందన కటారియా 2025, ఏప్రిల్‌ 1న ఆటకు వీడ్కోలు ప్రకటించింది. హరిద్వార్‌కు చెందిన వందన 2009లో అరంగేట్రం చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఈ స్ట్రైకర్‌.. 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్‌ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ చేసిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది.  హాకీలో వందన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ (2022), అర్జున (2021) పురస్కారాలు దక్కాయి.

Walkins

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 20  వివరాలు: 1. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్-2: 11 2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01 3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 08 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌లో (మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2కు రూ.20,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2కు రూ.28,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7 వేదిక: సీఎస్‌ఐఆర్‌-నాల్ (రాబ్‌ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్), ఎస్‌బీఐ పక్కన, నాల్‌ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు - 560017. Website:https://www.nal.res.in/en/news/walk-interview-project-staff-advt-no-082025

Walkins

ఎన్‌ఐఎంఆర్‌లో ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎంఆర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-I: 2 ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-II: 2 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, డిప్లొమా, (ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌/ ఐటీఐ) ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-I 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-II 30 ఏళ్లు మించకూడదు. జీతం: ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-Iకు నెలకు రూ.18,000; ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-IIకు రూ.20,000. పని ప్రదేశం: న్యూ దిల్లీ. ఇంటర్వ్యూ ప్రదేశం: ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌, సెక్టార్‌ 8 ద్వారక, న్యూ దిల్లీ. ఇంటర్వ్యూ తేదీ: 08.04.2025. Website:https://hindi.nimr.org.in/

Internship

అర్బనికా రియల్‌ ఎస్టేట్‌లో ఆర్కిటెక్చర్‌ పోస్టులు

అర్బనికా రియల్‌ ఎస్టేట్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ కింది ఆర్కిటెక్చర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: ఆర్కిటెక్చర్‌ సంస్థ: అర్బనికా రియల్‌ ఎస్టేట్‌ ఎల్‌ఎల్‌పీ నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఆటోక్యాడ్, గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యాలు ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.5,000. వ్యవధి: నెల రోజులు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌. దరఖాస్తు చివరి తేదీ: 20.04.2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-architecture-internship-at-urbanica-real-estate-llp1742540662

Government Jobs

నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టులు

నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) కాంట్రాక్ట్‌/ రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 71 వివరాలు:  జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (సివిల్‌)- 35 జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 17 జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎస్‌ఎన్‌టీ)- 3 జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎస్‌)- 4 అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (అర్కిటెక్చర్‌)- 08 అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (డెటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌)- 01 అసిస్టెంట్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)- 01 అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌)- 02 అర్హతలు: 31.03.2025 నాటికి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: 31.03.2025 నాటికి అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి.  దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఫీజు లేదు. వేతనం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000-రూ.1,60,000; ఇతర పోస్టులకు రూ.40,000-1,40,000.  ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24.04.2025. Website:https://www.nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే) ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.50,400 - రూ.1,26,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-04-2025. Website:https://iitk.ac.in/dord/project/mcc-peo-01-04-25.html

Government Jobs

డీఎంహెచ్‌ఓ నెల్లూరులో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

నెల్లూరులోని డిస్ట్రిక్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (డీహెచ్‌ఎంఓ) ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్‌ గ్రేడ్-2: 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.32,670. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 04-04-2025. Website:https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సూపర్ వైజర్‌ పోస్టులు

బిహార్‌ రాష్ట్రం సివాన్‌ రీజియన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: బిజినెస్‌ కరస్పాండెంట్‌ సూపర్‌వైజర్‌: 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.   వయోపరిమితి: 21 నుంచి 65 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: 1వ అంతస్తు, పటేల్‌ చౌక్‌, హెచ్‌పీఓ దగ్గర, సివాన్‌, - 841226. దరఖాస్తు చివరి తేదీ: 15-04-2025. Website:https://centralbankofindia.co.in/en/recruitments

Admissions

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025

సైన్స్‌, మాథ్స్‌ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్‌ ఒకటి. తాజాగా నెస్ట్‌-2025 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు.  వివరాలు: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025 సీట్ల రిజర్వేషన్: నైసర్‌(200 సీట్లు): జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్‌- 0, ఓబీసీ ఎన్‌సీఎల్‌- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు. సీఈబీఎస్‌(57 సీట్లు): జనరల్- 23, జనరల్ ఈడబ్ల్యూఎస్‌- 6, ఓబీసీ ఎన్‌సీఎల్‌- 15, ఎస్సీ- 9, ఎస్టీ- 4, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు. అర్హత: సైన్స్‌ గ్రూప్‌లతో 2023, 2024లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి. వయసు: వయోపరిమితి లేదు. ప్రశ్నపత్రం: పరీక్ష రెండు సెషన్‌లలో.. ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. వ్యవధి మూడున్నర గంటలు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో 20 ప్రశ్నలు అడుగుతారు.   ఫీజు: జనరల్‌, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700. పరీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.  ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఫిబ్రవరి 17 నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: జూన్‌ 02. పరీక్ష తేదీ: జూన్‌ 22. Website:https://www.nestexam.in/

Admissions

ఏపీ పీజీఈసెట్‌ - 2025

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌.డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలు: ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 కోర్సులు: ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌.డి (పీబీ) విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, జియో- ఇన్ఫర్మాటిక్స్‌ తదితరాలు. అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1200; బీసీలకు రూ.900; ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.700. ఏప్రిల్‌ 01 నుంచి 30 వరకు: ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు అవకాశం మే 01 నుంచి 26 వరకు: రూ.1000 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం మే 25- మే 27: దరఖాస్తు సవరణ తేదీలు మే 31 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం జూన్‌ 06 నుంచి 08 వరకు: ప్రవేశ పరీక్షలు జూన్‌ 11: ప్రాథమిక కీ విడుదల తేదీలు జూన్‌ 11 నుంచి 14:  ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ జూన్‌ 25: ఫలితాల వెల్లడి. Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx