Posts

Current Affairs

గాబ్రియేల్‌ బోరిక్‌తో మోదీతో భేటీ

అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్‌ బోరిక్‌ 2025, ఏప్రిల్‌ 1న దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.   అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేశాయి. 

Current Affairs

పరమాణు పరిశోధనకు సరికొత్త ప్రాజెక్టు

విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా పనిచేస్తోంది అన్న అంశంపై నిరంతరం అణు పరిశోధన చేస్తున్న సెర్న్‌ (యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రిసెర్చ్‌) సంస్థ మరిన్ని భౌతిక శాస్త్ర రహస్యాల్ని ఛేదించేందుకు ఒక భారీ అణు విచ్ఛిత్తి వ్యవస్థను రూపొందించే ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ సరిహద్దు వద్ద 91 కిలోమీటర్ల భారీ విస్తృతిలో నిర్మించదలచిన ఈ అణు విచ్ఛిత్తి వ్యవస్థకు ‘ఫ్యూచర్‌ సర్క్యులర్‌ కొలైడర్‌’ (ఎఫ్‌సీసీ)గా నామకరణం చేశారు. ఈ వ్యవస్థ సాయంతో 2040 సంవత్సర మధ్యకల్లా ఇప్పటి వరకూ తెలిసిన భౌతికశాస్త్ర పరిజ్ఞానంపై తిరిగి అధ్యయనం చేసి మరిన్ని కొత్త వివరాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు. 

Current Affairs

‘టైగర్‌ ట్రంప్‌-25’ విన్యాసాలు

భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘టైగర్‌ ట్రంప్‌-2025’ సముద్ర విన్యాసాలు 2025, ఏప్రిల్‌ 1న విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంత భద్రతను పెంపొందించడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం.  ‘ఐఎన్‌ఎస్‌ జలశ్వ’ నౌకపై విన్యాసాలు ప్రారంభం కాగా.. ముగింపు వేడుకలు ఏప్రిల్‌ 13న కాకినాడ తీరాన అమెరికా నౌక ‘యూఎస్‌ఎస్‌-కాంస్టాక్‌’పై జరగనున్నాయి. 

Current Affairs

ఫిదెల్‌ స్నేహిత్‌

తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు ఫిదెల్‌ స్నేహిత్‌ 89వ స్థానంలో నిలిచాడు. ఇటీవల డబ్ల్యూటీటీ స్టార్‌ కంటెండర్‌ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన స్నేహిత్‌.. 34 స్థానాలు మెరుగయ్యాడు. భారత్‌ తరఫున స్నేహిత్‌ కాకుండా మానవ్‌ థక్కర్‌ (47వ ర్యాంకు), హర్మీత్‌ దేశాయ్‌ (68), మనుష్‌ షా (73), శరత్‌ కమల్‌ (80) టాప్‌-100లో ఉన్నారు.

Current Affairs

వందన కటారియా

భారత మహిళల హాకీ వెటరన్‌ ప్లేయర్‌ వందన కటారియా 2025, ఏప్రిల్‌ 1న ఆటకు వీడ్కోలు ప్రకటించింది. హరిద్వార్‌కు చెందిన వందన 2009లో అరంగేట్రం చేసింది. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఈ స్ట్రైకర్‌.. 320 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్‌ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ చేసిన ఆమె ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది.  హాకీలో వందన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ (2022), అర్జున (2021) పురస్కారాలు దక్కాయి.

Walkins

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 20  వివరాలు: 1. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్-2: 11 2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01 3. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 08 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌లో (మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 35 ఏళ్లు. జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2కు రూ.20,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1కు రూ.25,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2కు రూ.28,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7 వేదిక: సీఎస్‌ఐఆర్‌-నాల్ (రాబ్‌ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్), ఎస్‌బీఐ పక్కన, నాల్‌ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు - 560017. Website:https://www.nal.res.in/en/news/walk-interview-project-staff-advt-no-082025

Walkins

ఎన్‌ఐఎంఆర్‌లో ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎంఆర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-I: 2 ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-II: 2 అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, డిప్లొమా, (ఎంఎల్‌టీ/ డీఎంఎల్‌/ ఐటీఐ) ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-I 28 ఏళ్లు; ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-II 30 ఏళ్లు మించకూడదు. జీతం: ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-Iకు నెలకు రూ.18,000; ప్రాజెక్ట్‌ టెక్ని్కల్‌ సపోర్ట్‌-IIకు రూ.20,000. పని ప్రదేశం: న్యూ దిల్లీ. ఇంటర్వ్యూ ప్రదేశం: ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌, సెక్టార్‌ 8 ద్వారక, న్యూ దిల్లీ. ఇంటర్వ్యూ తేదీ: 08.04.2025. Website:https://hindi.nimr.org.in/

Internship

అర్బనికా రియల్‌ ఎస్టేట్‌లో ఆర్కిటెక్చర్‌ పోస్టులు

అర్బనికా రియల్‌ ఎస్టేట్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ కింది ఆర్కిటెక్చర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: ఆర్కిటెక్చర్‌ సంస్థ: అర్బనికా రియల్‌ ఎస్టేట్‌ ఎల్‌ఎల్‌పీ నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఆటోక్యాడ్, గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యాలు ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.5,000. వ్యవధి: నెల రోజులు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌. దరఖాస్తు చివరి తేదీ: 20.04.2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-architecture-internship-at-urbanica-real-estate-llp1742540662

Government Jobs

నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టులు

నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) కాంట్రాక్ట్‌/ రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 71 వివరాలు:  జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (సివిల్‌)- 35 జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 17 జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎస్‌ఎన్‌టీ)- 3 జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎస్‌)- 4 అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (అర్కిటెక్చర్‌)- 08 అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (డెటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌)- 01 అసిస్టెంట్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)- 01 అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌)- 02 అర్హతలు: 31.03.2025 నాటికి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: 31.03.2025 నాటికి అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి.  దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఫీజు లేదు. వేతనం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000-రూ.1,60,000; ఇతర పోస్టులకు రూ.40,000-1,40,000.  ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24.04.2025. Website:https://www.nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

ఐఐటీ కాన్పూర్‌లో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీకే) ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌: 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.50,400 - రూ.1,26,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-04-2025. Website:https://iitk.ac.in/dord/project/mcc-peo-01-04-25.html