ఏసీసీ అధ్యక్షుడిగా నఖ్వీ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ సయ్యద్ మొహ్‌సిన్ నఖ్వీ 2025, ఏప్రిల్ 3న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. శ్రీలంకకు చెందిన షమ్మి సిల్వా స్థానంలో అతడు నియమితులయ్యాడు. ఏసీసీ అధ్యక్ష పదవి సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుంది. ఈసారి పాకిస్థాన్ వంతు వచ్చింది. నఖ్వీ 2027 వరకు పదవిలో ఉంటాడు.