Posts

Current Affairs

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ తన్వి శర్మ (16 ఏళ్లు) రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 19న గువాహటిలో జరిగిన బాలికల సింగిల్స్‌ తుది పోరులో తన్వి 7-15, 12-15తో అన్యాపత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది.  ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌లో 17 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన పతకమిది. 

Current Affairs

జాబిల్లిపై సూర్యుడి ప్రభావం

సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్‌-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్‌), దాని ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, అక్టోబరు 18న తెలిపింది.  2019 జులై 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌.. అదే ఏడాది ఆగస్టు 20న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అందులో భాగంగా ఉన్న ల్యాండర్‌.. చందమామ ఉపరితలంపై కూలిపోయినా ఆర్బిటర్‌ మాత్రం సేవలు అందిస్తూనే ఉంది. అందులోని చంద్రా అట్మాస్పియరిక్‌ కంపోజిషనల్‌ ఎక్స్‌ప్లోరర్‌-2 (చేస్‌-2) పరికరం.. చంద్రుడి వాతావరణంపై సౌర జ్వాలల ప్రభావాన్ని నిశితంగా పరిశీలించింది. 

Current Affairs

ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్‌జింగ్‌ (చైనా)లో జరిగిన కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌)ను ఓడించింది. ఈ పోరులో ఆమె వరుసగా 15 సార్లు ఫర్‌ఫెక్ట్‌ టెన్‌ స్కోరు చేసింది.  ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో భారత్‌కు ఇదే  తొలి పతకం.

Current Affairs

చెన్‌నింగ్‌ యాంగ్‌ కన్నుమూత

 చైనాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత చెన్‌ నింగ్‌ యాంగ్‌(103) బీజింగ్‌లో 2025, అక్టోబరు 18న మరణించారు. తూర్పు చైనాలోని అన్హుయ్‌ ప్రావిన్స్‌లో ఉన్న హెఫెయ్‌లో 1922లో యాంగ్‌ జన్మించారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన అనంతరం బోధనా పదవులను చేపట్టారు. భౌతికశాస్త్రంలో చేసిన కృషికి 1957లో యాంగ్‌కు నోబెల్‌ బహుమతి లభించింది. 

Government Jobs

ఐఐటీ రూర్కెలాలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కెలా ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: రిసెర్చ్ అసోసియేట్ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.58,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా anjaneya.dixit@ce.iitr.ac.in కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: 26-10-2025. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html  

Apprenticeship

సీఎస్ఐఆర్- ఎన్‌ఎంఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్‌ మెటలార్జికల్‌ ల్యాబొరేటరీ గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ట్రేయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 22 వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 13 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 09 విభాగాలు: మెటలార్జికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, ఈసీఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌ డిగ్రీ, ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఇప్పటికే అప్రెంటిషిప్‌ అర్హత పొంది ఉండకూడదు. వయోపరిమితి: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు 18 నుంచి 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు మించకూడదు.  స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.10,900.  దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీ: 31-10-2025. వేదిక: సీఎస్‌ఐఆర్‌- నేషనల్‌ మెటలార్జికల్‌ ల్యాబొరేటరీ, బర్మామైన్స్‌, జంషెడ్పూర్‌. Website:https://nml.res.in/

Admissions

ఐఐఎం బెంగళూరులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు (ఐఐఎంబీ) 2026-27 విద్యాసంవత్సరానికి స్కూల్‌ ఆఫ్‌ మల్టీడిసిప్లినరీ అందించే నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: బీఎస్సీ (హానర్స్‌) ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ప్రోగ్రామ్‌ మొత్తం సీట్లు: 80 అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షను పూర్తి చేసి ఉండాలి, ఇంటర్‌లో గణితాన్ని ఒక సబ్జెక్టుగా, టెన్త్‌లో గణితంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. వయోపరిమితి: 1 ఆగస్టు 2026 నాటికి 20 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం: అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు తదితరాల ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2025. ఐఐఎం యూజీ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీ: 13.12.2025. Website:https://www.iimv.ac.in/careers

Government Jobs

Research Associate Posts In IIT Roorkee

Indian Institute of Technology Rourkela (IIT Roorkee) is inviting applications for the Research Associate posts on contractual basis.  Details: Research Associate Eligibility: Candidates should have passed ME/MTech, PhD in the relevant discipline along with work experience as per the post. Salary: Rs.58,000 per month. Selection Process: Based on Interview. Application Process: Send by email to anjaneya.dixit@ce.iitr.ac.in. Application Last Date: 26-10-2025. Website:https://iitr.ac.in/Careers/Project%20Jobs.html

Apprenticeship

Apprentice Posts In CSIR-NML

CSIR-National Metallurgical Laboratory, Jamshedpur, Jharkhand is inviting applications for the Graduate and Technician Apprentice Trainee posts. No. of Posts: 22 Details: Graduate Apprentice: 13 Technician Apprentice: 09 Departments: Metallurgical Engineering, Chemical, Computer Science/IT, ECE, Mechanical Engineering. Qualification: Diploma, BE/B.Tech degree in the relevant discipline as per the post. Candidates should not have already qualified for apprenticeship. Age Limit: 18 to 24 years for Technician Apprentice, 21 to 26 years for Graduate Apprentice. Stipend: Per month Rs.12,300 for Graduate Apprentice; Rs.10,900 for Technician Apprentice. Application Procedure: Candidates should register on NAT portal. Interview Date: 31-10-2025. Venue: CSIR- National Metallurgical Laboratory, Burmamines, Jamshedpur. Website:https://nml.res.in/

Admissions

Undergraduate Program In IIM Bangalore

Indian Institute of Management Bangalore (IIMB) invites applications for admissions to the four-year undergraduate program for the academic year 2026-27.  Details: B.Sc. (Hons.) in Data Science and Economics Program Total Seats: 80 Eligibility: Must have completed 12th class or its equivalent examination from a recognized board, with Mathematics as a subject in Inter and at least 60% marks in Mathematics in Tenth. Age Limit: Not more than 20 years as on 1 August 2026. Selection Process: Based on Under Graduate Admissions Test, Interviews etc. Last Date for Application: 20.11.2025. Date of IIM UG Admission Test: 13.12.2025. Website:https://www.iimv.ac.in/careers