Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

జీవావరణంలో మనుషులతోపాటు వన్యప్రాణులకు సమాన ప్రాధాన్యం ఉంది. వృక్ష, జంతు జాతులు సహజ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఉండి, ఆహార చక్రం సక్రమంగా కొనసాగడంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. పర్యావరణ సమతౌల్యంలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే అడవుల నిర్మూలన, సహజ ఆవరణ వ్యవస్థల విధ్వంసం లాంటి అనేక మానవ చర్యల కారణంగా ఎన్నో జాతులు ప్రస్తుతం అంతరించే స్థితికి చేరాయి. దీన్ని అరికట్టి వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 3న ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’గా  (World Wildlife Day) నిర్వహిస్తారు. వన్యప్రాణుల ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అవి అంతరించడం వల్ల కలిగే నష్టం గురించి హెచ్చరించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  చారిత్రక నేపథ్యం అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల్లో అంతర్జాతీయ వాణిజ్యంపై వాషింగ్టన్‌లో 1973, మార్చి 3న సమావేశం (The Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora - CITES) జరిగింది. అందులో త్వరగా అంతరించే ముప్పున్న వృక్షాలు, జంతువులతో ఒక జాబితా తయారు చేసి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలన్నీ ఒప్పందం చేసుకున్నాయి. ఇది 1975, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సమావేశాన్ని ‘వాషింగ్టన్‌ కన్వెన్షన్‌’ అని కూడా అంటారు. CITES జరిగిన రోజును పురస్కరించుకుని ఏటా మార్చి 3న ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’గా జరపాలని 2013, మార్చిలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.  2026 నినాదం: “Medicinal and Aromatic Plants: Conserving Health, Heritage and Livelihoods”

Current Affairs

ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం

తెలంగాణలో రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు దిల్లీలోని జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌) అధ్యయంన వెల్లడించింది. దేశంలో పురుగుమందులను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉండగా... ఎరువుల వినియోగంలో అయిదో స్థానంలో నిలిచింది. భారత వ్యవసాయ స్థితిగతులపై నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇందులోని ముఖ్యాంశాలు.. దేశంలో పురుగుమందుల సగటు వినియోగం హెక్టారుకు 500 గ్రాములు ఉండగా... తెలంగాణలో 900 గ్రాములను వాడుతున్నారు. ఎరువుల వినియోగం జాతీయ సగటు హెక్టారుకు 136.2 కిలోలు కాగా తెలంగాణలో 315 కిలోల వినియోగిస్తున్నారు. 

Current Affairs

రక్షణ మంత్రిత్వశాఖ ఒప్పందం

భారత తీరగస్తీ అవసరాల నిమిత్తం ఆరు అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌), వర్టికల్‌ లాంచ్‌ మిసైల్స్‌ (వీఎల్‌ఎం) తయారీకి రెండు సంస్థలతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,083 కోట్ల విలువగల ఒప్పందాలను చేసుకుంది. ఈ రెండు ఒప్పంద పత్రాలపై రక్షణశాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సింగ్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి.  ఆరు ఏఎల్‌హెచ్‌ల కోసం రూ.2,901 కోట్ల విలువగల ఆర్డర్‌కు హిందుస్థాన్‌ ఏరోనాటికల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో, వీఎల్‌ఎంల కోసం రూ.2,182 కోట్ల ఆర్డర్‌కు రష్యాకు చెందిన జేఎస్సీ రోసోబొరొన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌తో ఒప్పందాలు కుదిరాయి.

Current Affairs

‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ రికార్డు

భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ మీద ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించింది. ఈ విషయాన్ని 2026, మార్చి 3న నేవీ వర్గాలు తెలిపాయి. భారత బాహుబలిగా పేరుగాంచిన ఈ విమానవాహక నౌక 2022, సెప్టెంబరు 2న నౌకాదళంలో చేరింది.  దీన్ని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నిర్మించింది.

Current Affairs

‘హనుమాన్‌’

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో 2026, మార్చి 3న ‘హనుమాన్‌ ప్రాజెక్టు’ను ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణే లక్ష్యంగా హనుమాన్‌ (హీలింగ్‌ అండ్‌ నర్చరింగ్‌ యూనిట్స్‌ ఫర్‌ మానిటరింగ్, ఎయిడ్‌ అండ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌) ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు ఆయన అన్నారు. వన్యప్రాణుల్ని కాపాడుకుంటూనే.. పంటలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 100 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

Government Jobs

పీజీఐసీహెచ్‌ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ నోయిడా (పీజీఐసీహెచ్‌), ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ - 44  విభాగాలు: పీడియాట్రిక్ కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జరీ, అనస్థీషియా తదితర విభాగాలు... అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ట వయసు: 50 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,20,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా facultyrecpgich@gmail.com కు పంపాలి. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.5000. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ, ఈడౠ్ల్యఎస్‌ అభ్యర్థులకు రూ.3,500. దరఖాస్తు చివరి తేదీ: 10-04-2026  Website:https://pgich.edu.in/recruitment.php  

Government Jobs

ఎన్‌బీసీసీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన దిల్లీలోని నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో మెనేజీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 60 వివరాలు: జనరల్‌ మేనేజర్‌- 01 మేనేజర్‌- 02 డిప్యూటీ మేనేజర్‌- 01 అసిస్టెంట్‌ మేనేజర్‌- 08 సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌- 10 గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్- 02 జూనియర్‌ ఇంజినీర్‌- 35 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ, సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు జనరల్‌ మేనేజర్‌కు రూ.90,000-2,40,000;  గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్‌కు రూ.30,000- రూ.1,20,000; జూనియర్‌ ఇంజినీర్‌కు రూ.27,000; మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40,000- రూ.1,40,000. వయోపరిమితి: చివరి తేదీ నాటికి జనరల్‌ మేనేజర్‌కు 54 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌, గ్రాడ్యుయేట్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; మేనేజర్‌కు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 33 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌కు 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: సీబీటీ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ  తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 05.04.2026. Website:https://nbccindia.in/

Government Jobs

ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్‌యూ, వారణాసి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 05 వివరాలు: 1. నోడల్ ఆఫీసర్ - 01 2. రిసెర్చ్ ఇంజినీర్ - 01 3. డిజైన్ ఇంజినీర్ (పార్ట్స్) - 01 4. డిజైన్ ఇంజినీర్ (అసెంబ్లీ) - 01 5. డ్రాఫ్ట్స్‌మెన్/టెక్నికల్ అసిస్టెంట్ - 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  డిప్లొమా/బీటెక్‌/ఎంటెక్‌/పీహెచ్‌డీ(మెకానికల్ ఇంజినీరింగ్)లోఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నోడల్ ఆఫీసర్‌కు రూ.1,00,000. రిసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75,000. డిజైన్ ఇంజినీర్‌కు రూ.55,000. టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 20-03-2026. Website:https://www.iitbhu.ac.in/positions

Admissions

ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణామండలి.. ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2026కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.   వివరాలు: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మార్చి/ఏప్రిల్‌-2026లో జరిగే పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: రూ.400(ఓసీ/బీసీ); ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.100. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 03.03.2026. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 04-04-2026. పరీక్ష నిర్వహణ తేదీ: 25-04-2026. Website:https://sbtet.ap.gov.in/APSBTET/Welcome.do

Government Jobs

Faculty Jobs in PGICH Noida

Post Graduate Institute of Child Health Noida (PGICH) is inviting applications for the posts of Assistant Professor in various departments on contractual basis.  Details: Assistant Professor - 44 Departments: Pediatric Cardiology, Gastroenterology, Neurology, Nephrology, Surgery, Anesthesia etc. Eligibility: Must have passed MD/MS/DM/MCh in the relevant department from a recognized university along with work experience. Maximum age should not exceed 50 years. Salary: Rs. 1,20,000 per month. Selection Process: Candidates will be selected on the basis of interview. Application Procedure: Send by email to facultyrecpgich@gmail.com. Application Fee: Rs. 5000 for General Candidates. Rs. 3,500 for SC, ST, OBC, EDLS Candidates. Last Date of Application: 10-04-2026 Website:https://pgich.edu.in/recruitment.php