Posts

Current Affairs

ఉత్తమ పర్యాటక గ్రామం దేవ్‌మాలీ

రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ సమీప బ్యావర్‌ జిల్లాకు చెందిన దేవ్‌మాలీ భారత్‌లో ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు, స్థానిక సంస్కృతిని పరిరక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక జరిగింది. దేవ్‌మాలీ ప్రత్యేకత ఏమిటంటే.. గ్రామానికి చెందిన 3,000 బీఘాల (1,875 ఎకరాల) భూమిని స్థానికంగా కొండపై వెలసిన దేవనారాయణ్‌ స్వామికి అంకితం చేశారు. ఏళ్లతరబడి గ్రామంలో నివసిస్తున్నా స్థానికులు ఎవరి వద్దా భూయాజమాన్య పత్రాలు ఉండవు. గ్రామస్థులకు శాశ్వత నివాసాలూ లేవు. ఎటుచూసినా గడ్డి కప్పిన మట్టి ఇళ్లే కనిపిస్తాయి. గ్రామంలో మాంసాహారం, మద్యపానం నిషేధం. వంటకు కిరోసిన్, వేప కలప వాడరు. ఇళ్లకు తాళాలు లేకున్నా, దశాబ్దాలుగా దొంగతనాలంటే ఏమిటో ఈ గ్రామస్థులు ఎరుగరు.

Current Affairs

చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాక్కంలోని కాందార్‌నగర్‌ రోడ్డుకు ‘ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం రోడ్డు’ అని పేరు పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్‌ 2024, సెప్టెంబరు 25న ప్రకటించారు. ఎస్పీబీ పలు భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. 

Government Jobs

Pharmacist Grade-II Posts In TG MHSRB, Hyderabad

TG Medical and Health Services Recruitment Board invites applications for the posts of Pharmacist Grade-II under various departments of Government of Telangana. No. of Posts: 633 Details: Department: 1. Director of Public Health and Family Welfare/ Director of Medical Education: 446 Posts 2. Telangana Vaidya Vidhana Parishad: 185 Posts 3. MNJ Institute of Oncology and Regional Cancer Centre: 2 Posts Scale of Pay: Per month Rs.31,040 – Rs.92,050. Qualification: D.Pharmacy/ B.Pharmacy/ Pharm.D. Must be registered with Telangana Pharmacy Council. Age limit(as on 01/07/2024): 18 to 46 years. Online Examination Fee: Rs.500. Selection Process: Based on written examination, work experience in state government hospitals/ institutions/ programmes on contract/outsourced basis, Rule of Reservation, Document verification etc. How to apply: Applications submitted online only will be accepted. Exam centers: Hyderabad, Nalgonda, Kodad, Khammam, Kothagudem, Sathupally, Karimnagar, Mahbubnagar, Sangareddy, Adilabad, Nizamabad, Warangal, Narsampet. Starting Date for online application: 05-10-2024. Last Date for online application: 21-10-2024. Applicants can edit their applications between: 23-10-2024 to 24-10-2024. Date of examination: 30-11-2024. Website:https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

Government Jobs

Teaching Posts In RRU, Gandhinagar

Rashtriya Raksha University (RRU), Gandhinagar, Gujarat State invites applications for filling up the vacant teaching posts on contractual basis.  Details: 1. Associate Professor 2. Assistant Professor 3. Assistant Professor (Research) 4. Teaching cum Research Officer 5. Research Officer Qualification: Degree, Ph.D., NET/ SLET/ SET pass in the relevant discipline as per the post and teaching experience. Salary: Per month Rs.2 lakhs-Rs.2,50,000 for Associate Professor posts; Rs.74,000-Rs.92,000 for teaching cum research officer posts; Rs.55,000-Rs.70,000 for Research Officer posts; Rs.90,000-Rs.1,15,000 for other posts. Selection Process: Based on Educational Qualification, Work Experience, Interview etc. Application Procedure: Offline applications to The Assistant Registrar, Human Resource Section, Rashtriya Raksha University, At.Lavad, Ta.Dehgam, Gandhinagar, Gujarat. Last date for application: 09-10-2024. Website:https://rru.ac.in/

Apprenticeship

Apprentice Posts In DRDO- RCI, Hyderabad

Defense Research and Development Organization (DRDO)- Research Center Imarat (RCI), Hyderabad invites applications from eligible candidates for Apprenticeship training for the year (2024-25). Number of Posts: 200 Details: 1. Graduate Apprentice: 40 2. Technician Apprentice: 40 3. Trade Apprentice: 120 Departments: Electronics and Communication, Electrical and Electronics, Computer Science, Mechanical, Chemical, Commercial, Fitter, Electrician, Electronic Mechanic, Welder etc. Qualification: ITI, Diploma in relevant discipline following the post, Must have passed BE/ B.Tech along with work experience. Age Limit: Should be between 18 to 25 years as on 01.08.2024. There is a relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PwBDs. Duration of Apprenticeship: One year. Selection Process: Based on Academic Merit, Scrutiny of Certificates, Interview etc. Last date of online application: 12.10.2024 Website:https://www.drdo.gov.in/drdo/

Admissions

TG 5th Phase ITI Admissions - 2024

Government of Telangana, Department of Employment and Training, Hyderabad invites applications for 5th Phase ITI Walk in Admission into Government ITIs and Private ITIs in the State under NCVT pattern for 2024 session.  Details:  ITI Course for 2024-25 (5th Phase) Trade: Carpenter, COPA, Draughtsman, Electrician, Fitter, Foundryman, Machinist, Plumber, Turner, Welder, Wireman etc. Qualification: 10th Class/ 8th Class Pass. Course Duration: 1 year, 2 years. Age limit: Candidates who have attained the age of 14 years. There is no upper age limit. Selection: Based on academic merit, rule of reservation. How to apply: The candidates who are seeking admission into vacant seats of Govt. ITIs/ Private ITIs can attend from 25-09-2024 to 28-09-2024, where the candidate wishes to appear either to Govt. or Private ITI. Last date for submission of Online Applications: 28-09-2024. Walk in admission date for Govt. ITIs and Private ITIs reporting time: 25-09-2024 to 28-09-2024. Website:https://iti.telangana.gov.in/ Apply online:https://tsiti.ucanapply.com/univer/public/secure?app_id=UElZMDAwMDA2NQ==

Government Jobs

ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ - ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులు

తెలంగాణలో 633 ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం ఖాళీలు: 633 వివరాలు: జోన్‌-1లో 79, జోన్‌-2లో 53, 3లో 86, 4లో 98, 5లో 73, 6లో 154, 7వజోన్‌లో 88 పోస్టులున్నాయి. విభాగాలు: 1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 445 పోస్టులు 2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 185 పోస్టులు 3. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్‌ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 2 పోస్టులు అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకొని ఉండాలి. వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్దులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు, ఎన్‌సీసీ, ఎక్స్‌ సర్వీ్స్‌మ్యాన్‌లకు మూడేళ్లు వయోపరిమితిని సడలింపునిచ్చారు. పే స్కేల్: నెలకు రూ.31,040- రూ.92,050. ఆన్‌లైన్ పరీక్ష ఫీజు: రూ.500. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-10-2024. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024. దరఖాస్తు సవరణ తేదీలు: 23-10-2024 నుంచి 24-10-2024 వరకు. పరీక్ష తేదీ: 30-11-2024. Website:https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

Government Jobs

రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం, గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (ఆర్ఆర్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: 1. అసోసియేట్ ప్రొఫెసర్ 2. అసిస్టెంట్ ప్రొఫెసర్ 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిసెర్చ్‌) 4. టీచింగ్ కమ్ రిసెర్చ్‌ ఆఫీసర్ 5. రిసెర్చ్‌ ఆఫీసర్ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి. జీతం: నెలకు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.2,00,000-రూ.2,50,000; టీచింగ్ కమ్ రిసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు రూ.74,000-రూ.92,000; రిసెర్చ్‌  ఆఫీసర్ పోస్టులకు రూ.55,000-రూ.70,000; మిగతా పోస్టులకు రూ.90,000-రూ.1,15,000. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, హ్యూమన్ రిసోర్స్‌ సెక్షన్, రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, దహెగామ్, గాంధీనగర్, గుజరాత్. దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2024. Website:https://rru.ac.in/

Apprenticeship

డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌ ఖాళీలు

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) 2024-25 ఏడాదికి అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 200 వివ‌రాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 40 2. టెక్నీషియన్ అప్రెంటిస్‌: 40 3. ట్రేడ్ అప్రెంటిస్: 120 విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌,  కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వెల్డర్‌ తదితరాలు.  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 01.08.2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ ధ‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ: 12.10.2024 Website:https://www.drdo.gov.in/drdo/

Admissions

తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024

తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి- శిక్షణ కమిషనర్‌, హైదరాబాద్ 2024-25 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో ఐదో విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: ఐదో విడత ఐటీఐ కోర్సు ప్రవేశాలు 2024-25 ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు. అర్హత: ట్రేడును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎంపిక: అకడమిక్ మెరిట్/ గ్రేడింగ్‌ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.  దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ/ ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఆయా కళాశాలల్లో 25-09-2024 నుంచి 28-09-2024 వరకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావచ్చు,  ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28-09-2024. Website:https://iti.telangana.gov.in/ Apply online:https://tsiti.ucanapply.com/univer/public/secure?app_id=UElZMDAwMDA2NQ==