Posts

Current Affairs

అమెరికాలో భారతీయ అంతరిక్ష కర్మాగారం

అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్‌ సాధనాల తయారీకి ఒక యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు బెంగుళూరుకు చెందిన అంకుర సంస్థ ‘దిగంతర’ 2025, ఫిబ్రవరి 11న ప్రకటించింది. కీలక, సరికొత్త సాంకేతికతలలో వ్యూహపరమైన భాగస్వామ్యం నెరపాలని భారత్‌-అమెరికాలు గతంలోనే నిశ్చయించాయి. దాని ఫలితమే కొలరాడోలో ఏర్పడనున్న దిగంతర యూనిట్‌. దీనిపై 10 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతోంది. కొలరాడో ప్రభుత్వం కూడా 10 లక్షల డాలర్ల విలువైన ప్రోత్సాహకాలను అందిస్తుంది.

Current Affairs

‘వికసిత్‌ పంచాయత్‌’

వివిధ రంగాల్లో పంచాయతీల సమగ్రాభివృద్ధికి నిర్దేశించిన ‘వికసిత్‌ పంచాయత్‌’ కార్యక్రమానికి గుజరాత్, అస్సాం, ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు.  అల్లూరి జిల్లాలో ఎంపిక చేసిన పంచాయతీలు: పాడేరు మండలంలో: కిండంగి, మినుములూరు, గుతులపుట్టు, డోకులూరు, కడెలి, డి.గొందూరు, వంజంగి. హుకుంపేట మండలం: మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకే మందా, తాడిపుట్టు.జి.మాడుగుల మండలం: బోయితిలి.    

Current Affairs

2027లో రియాద్‌లో ఈస్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌

తొలి ఈస్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌ 2027లో రియాద్‌ వేదికగా జరగనున్నాయి. 2025లోనే ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉన్నా రెండేళ్లు ఆలస్యంగా ఆరంభం కానున్నాయి. కింగ్‌డమ్‌ ఈస్పోర్ట్స్‌ ప్రపంచకప్‌ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఆటలను నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 2025, ఫిబ్రవరి 11న వెల్లడించింది.   2034 పురుషుల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు కూడా సౌదీ అరేబియానే వేదిక. 

Current Affairs

పంకజ్‌ అడ్వాణీ

భారత క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ 10వ జాతీయ స్నూకర్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తంగా పంకజ్‌కిది 36వ టైటిల్‌. 2025, ఫిబ్రవరి 11న ఇందౌర్‌లో జరిగిన ఫైనల్లో బ్రిజేశ్‌ దమానిపై అతడు విజయం సాధించాడు.   పంకజ్‌ ఇప్పటికే 26 జాతీయ బిలియర్డ్స్‌ టైటిళ్లు నెగ్గాడు. 

Current Affairs

అవినీతి సూచీ

అవినీతి సూచీ-2024 (కరప్షన్‌ పర్సెప్షన్స్‌ ఇండెక్స్‌-2024)లో భారత్‌ 96వ స్థానంలో నిలిచింది. మొత్తం 180 దేశాలతో రూపొందించిన ఈ సూచీని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ 2025, ఫిబ్రవరి 11న విడుదల చేసింది. నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీ రూపొందిస్తారు. సున్నా నుంచి 100 వరకూ స్కోరు ఉండే ఈ సూచీలో, సున్నా స్కోరు కలిగిన దేశం పూర్తి అవినీతి మయమైనదిగా, 100 స్కోరు పొందిన దేశం అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు.  డెన్మార్క్‌ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ దేశంలో అవినీతి అతితక్కువ స్థాయిలో ఉంది.

Government Jobs

India Post GDS Recruitment - 2025

The Department of Posts, Government of India, invites online applications for the engagement of Gramin Dak Sevaks (GDS) including Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM), and Dak Sevak under Schedule-I, January-2025. A total of 21,413 vacancies are available across various postal circles. Total Vacancies Across Circles: 21,413 (Andhra Pradesh: 1,215 posts, Telangana: 519 posts) Details: 1. Branch Postmaster (BPM) Number of Posts: As per Circle-wise distribution. Educational Qualification: 10th standard pass with Mathematics and English as subjects. Age Limit: 18 to 40 years (relaxation as per government norms). Job Responsibilities: Managing daily postal operations at the Branch Post Office. Marketing and promotion of India Post and IPPB services. Handling mail conveyance and delivery. Must arrange accommodation for the Branch Post Office. 2. Assistant Branch Postmaster (ABPM) Number of Posts: As per Circle-wise distribution. Educational Qualification: 10th standard pass with Mathematics and English as subjects. Age Limit: 18 to 40 years (relaxation as per government norms). Job Responsibilities: Assisting BPM in various postal and financial operations. Doorstep delivery of mail and IPPB transactions. Selling stamps, stationery, and other postal services. Marketing and promotion of postal products. 3. Dak Sevak Number of Posts: As per Circle-wise distribution. Educational Qualification: 10th standard pass with Mathematics and English as subjects. Age Limit: 18 to 40 years (relaxation as per government norms). Job Responsibilities: Delivery of mail and parcels. Handling deposits, withdrawals, and other transactions of IPPB. Assistance in post office operations. Must reside within the jurisdiction of the assigned post office. Application fee is Rs. 100/- The last date to apply online is: 03.03.2025. Website:https://indiapostgdsonline.gov.in/

Government Jobs

Navik Posts In Indian Coast Guard

Online applications are invited from Male candidates, for recruitment to the Post of Navik (General Duty), Yantriks in the Indian Coast Guard through Coast Guard Enrolled Personnel Test (CGEPT)-01/ 2025 Batch. No. of Posts: 300 Details: 1. Navik (General Duty): 260 posts Region/Zone-wise vacancies: North- 65; West- 53; East- 38; South- 54, Central- 50. 2. NAVIC (Domestic Branch): 40 posts Region/Zone wise vacancies: North- 10; West- 09; East- 05; South- 09, Central- 07. Eligibility: For NAVIC General posts, 12th class (Maths/Physics) should be passed, for NAVIC Domestic Branch posts, 10th class should be passed. Age limit: Should be between 18 to 22 years. That is, should be born between 01-09-2003 and 28-08-2007. Relaxation in upper age limit of five years for SC and ST; Three years for OBC. Basic pay: Per monthRs.21,700. Selection Process: Selection will be made on the basis of Stage-I, Stage-II, Stage-III, Stage-IV exams, medical exams and verification of certificates. Exam Fee: Rs. 300 (SC, ST candidates will be exempted). Last Date for Online Applications: 25-02-2024. Exam Dates/ Download E-Admit Card: Stage-I: April 2025. Stage-II: June 2025. Stage-III: September 2025. Website:http://https//cgept.cdac.in/icgreg/candidate/login

Apprenticeship

Apprentice Posts In IOCL Pipelines Division

Indian Oil Corporation Limited, Pipelines Division invites applications for Apprentices in Technical and Non-Technical trades at its locations under its 5 Regions. No. of Posts: 457 (UR- 264, SC- 52, ST- 25, OBC- 84, EWS- 32, PWBD- 12). Details: Pipeline Regions: Western, Northern, Eastern, Southern, South Eastern. Trades: Mechanical, Electrical, T&I, Assistant Human Resource, Accounts, Data Entry Operator, Domestic Data Entry Operator. Qualification: 12th Class, ITI, Diploma, Degree in the relevant discipline. Age Limit: Should be between 18 to 24 years as on 28.02.2025. Selection Process: Selection will be made on the basis of educational qualifications, medical examination and verification of certificates. Last date for receipt of online applications: 03.03.2025. Website:https://iocl.com/

Admissions

B.Sc(Hons) Agriculture course In TGSWREIS, Hyderabad

Telangana Social Welfare Residential Education Institutions Society (TGSWREIS) is inviting applications from eligible students into the B.Sc(Hons) Agriculture course for the  acadamic year 2024-2025 at TSWER Agriculture college for Women, Korutla. Details: Qualification: Candidates should have passed Inter (Biology, Physics, Chemistry), Two Year Diploma in Agriculture, TS-MSET-2024 for the courses. Application Process: Through Offline. Address to which application should be sent: TGSWREI Society Head Office, DSS Bhawan, Masabtank, Hyderabad. Last date of application: 21-02-2025. Website:http://www.tgswreis.ac.in/

Government Jobs

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ (Schedule-I, January-2025) వెలువడింది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు: 21,413  (ఆంధ్రప్రదేశ్‌లో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి.) వివరాలు: గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు  సర్కిల్ వారీగా ఖాళీలు: 1. ఆంధ్రప్రదేశ్- 1,215 2. అస్సాం- 555 3. బిహార్- 783 4. ఛత్తీస్‌గఢ్- 638 5. దిల్లీ - 30 6. గుజరాత్- 1,203 7. హరియాణా- 82 8. హిమాచల్‌ప్రదేశ్- 331 9. జమ్మూ అండ్‌ కశ్మీర్- 255 10. జార్ఖండ్- 822 11. కర్ణాటక- 1,135 12. కేరళ- 1,385 13. మధ్యప్రదేశ్- 1,314 14. మహారాష్ట్ర- 1,498 15. నార్త్ ఈస్ట్రన్‌- 1,260 16. ఒడిశా- 1,101 17. పంజాబ్- 400 18. రాజస్థాన్- 2718 19. తమిళనాడు- 2,292 20. తెలంగాణ- 519 21. ఉత్తర్‌ ప్రదేశ్- 3,004 22. ఉత్తరాఖండ్- 568 23. పశ్చిమ్‌ బెంగాల్- 923 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.  వయసు: 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది. ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌ 1 తర్వాత దానికి ఆప్షన్‌ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఏదైనా ఒక పోస్టల్‌ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ  పోస్టల్‌ సర్కిల్‌లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: 03.03.2025. దరఖాస్తు సవరణలకు అవకాశం: 06.03.2025 నుంచి 08.03.2025 వరకు. Website:https://indiapostgdsonline.gov.in/