Posts

Government Jobs

డీఎంహెచ్‌వో సంగారెడ్డిలో పోస్టులు

డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌ సంగారెడ్డి (డీహెచ్‌ఎంఓ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 117 వివరాలు: 1. పీడీయాట్రీషియన్‌: 01 2. స్టాఫ్‌ నర్స్‌: 56 3. ఎంఎల్‌హెచ్‌పీ: 17 4. మెడికల్‌ ఆఫీసర్‌(ఎంబీబీఎస్‌): 06 5. డిస్ట్రిక్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌: 01 6. సీనియర్‌ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్‌: 01 7. టీబీహెచ్‌వీ: 01 8. ఫార్మసిస్ట్స్‌: 04 9. ఫిజీషియన్స్‌: 01 10. డీఈఐసీ మేనేజర్‌: 01 11. డెంటల్‌ టెక్నీషియన్‌: 01 12. మెడికల్ ఆఫీసర్‌(మేల్‌) ఆర్‌బీఎస్‌కే(ఎంబీబీఎస్‌/ఆయూష్‌): 04 13. మెడికల్ ఆఫీసర్‌(ఫీమేల్‌) ఆర్‌బీఎస్‌కే(ఎంబీబీఎస్‌/ఆయూష్‌): 01 14. బయోకెమిస్ట్‌: 01 15. సపోర్టింగ్‌ స్టాఫ్‌: 10 16. కంటిజెంట్‌ వర్కర్‌: 07 17. డీఈవో: 01 18. ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్: 01 19. అనస్థీషియిస్ట్‌: 01 20. సిటి రేడియోగ్రాఫర్‌: 01 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్‌, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌, బీఏఎంస్‌, జీఎన్‌ఎం, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఎంఎస్‌/ఎండీ, అయిదవ తరగతి, డీ ఫార్మ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 - 46 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డిస్ట్రిక్‌ మెడికల్ & హెల్త్‌ ఆఫీసర్‌ సంగారెడ్డి. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 3. Website:https://sangareddy.telangana.gov.in/recruitment-of-117-various-posts-under-nhm-on-contract-outsourcing-basis/

Apprenticeship

డీఆర్‌డీవోలో అప్రెంటిస్‌ పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీవో-డిఫెన్స్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్ డాక్యుమెంటేషన్‌ సెంటర్‌ (డీఆర్‌డీఓ - డీఈఎస్‌ఐడీఓసీ) 2025-26 సంత్సరానికి గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 20 2. డిప్లొమా అప్రెంటిస్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 07 3. డిప్లొమా అప్రెంటిస్‌(వీడియో అండ్ ఫోటోగ్రఫి): 02 4. డిప్లొమా అప్రెంటిస్‌(ప్రింటింగ్ టెక్నాలజీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డైరెక్టర్, డీఈఎస్‌ఐడీఓసీ, మెట్‌కాల్ఫ్ హౌస్, ఢిల్లీ-110 054. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 20. Website:https://drdo.gov.in/drdo/careers

Government Jobs

Scientist Posts In ISRO

Indian Space Research Organization (ISRO) is inviting applications for the recruitment of Scientist/ Engineer posts.  Number of Posts: 63 Details: 1. Scientist/Engineer (Electronics): 22 2. Scientist/Engineer (Mechanical): 33 3. Scientist/Engineer (Computer Science): 08 Qualification: Candidates should have passed BE, BTech (Mechanical, Electronics, CS) and GATE in the relevant discipline as per the post. Age Limit: 28 years. Salary: Rs. 56,100 per month. Selection Process: Based on Interview. Application Fee: Rs. 250. Online Application Closing Date: May 19, 2025. Website:https://www.isro.gov.in/ICRB_Recruitment8.html

Government Jobs

Posts In Ferro Scrap Nigam Limited

Ferro Scrap Nigam Limited (FSNL) is inviting applications for the filling of following posts in various departments.  Number of Posts: 44 Details: 1. Junior Manager (E1)/ Assistant Manager (E2): 11 2. Manager (E4)/ Senior Manager (E5): 03 3. Junior Manager (E1)/ Assistant Manager (E2): 06 4. Manager (E4)/Senior Manager (E5): 02 5. Junior Manager (E1): 09 6. Assistant Manager (E2)/Deputy Manager (E3): 01 7. Manager (E4)/Senior Manager (E5): 02 8. Executive (E0)/Junior Manager (E1)/Assistant Manager (E2): 07 9. Executive (E0)/Junior Manager (E1)/Assistant Manager (E2): 03 Departments: Operation, Maintenance, Finance and Accounts, Material Management, Personnel Administration. Qualification: Degree, BTech/BE, LLB, Diploma, CA, MBA/PGDM, PG Diploma, PGDBA in the relevant discipline as per the post along with work experience. Age Limit: As on May 9, 2025, Junior Manager should be 30 years old, Assistant Manager should be 34 years old, Manager should be 42 years old, Senior Manager should be 46 years old, Executive should be 28 years old, and Deputy Manager should be 38 years old. Salary: Rs.40,000 - Rs.1,40,000 per month for Junior Manager, Rs.50,000 - Rs.1,60,000 for Assistant Manager, Rs.70,000 - Rs.2,00,000 for Manager, Rs.80,000 - Rs.2,20,000 for Senior Manager, Rs.30,000 - Rs.1,20,000 for Executive, Rs.60,000 - Rs.1,80,000 for Deputy Manager. Selection Process: Based on Written Test and Interview. Online Application Last Date: 9th May 2025. Website:https://fsnl.co.in/career.php

Government Jobs

DMHO SANGAREDDY

District Medical and Health Office Sangareddy (DMHO SANGAREDDY) is inviting applications for the filling of vacant posts in various departments on contractual basis. Eligible candidates can apply offline till May 3rd. Number of Posts: 117 Details: 1. Pediatrician: 01 2. Staff Nurse: 56 3. MLHP: 17 4. Medical Officer (MBBS): 06 5. District Program Coordinator: 01 6. Senior Treatment Supervisor: 01 7. TBHV: 01 8. Pharmacists: 04 9. Physicians: 01 10. DEIC Manager: 01 11. Dental Technician: 01 12. Medical Officer (Male) RBSK (MBBS/AYUSH): 04 13. Medical Officer (Female) RBSK (MBBS/AYUSH): 01 14. Biochemist: 01 15. Supporting Staff: 10 16. Contingent Worker: 07 17. DEO: 01 18. Ophthalmic Assistant: 01 19. Anaesthetist: 01 20. CT Radiographer: 01 Qualification: Degree, MBBS, Diploma, Inter, Tenth, BAMs, GNM, MSc, MBA/PGDM, PG Diploma, MS/MD, 5th Class, D Pharm in the relevant discipline as per the posts along with work experience. Age Limit: 18 - 46 years. Application Process: Offline. Address: District Medical & Health Officer Sangareddy. Application Closing Date: 3rd May 2025. Website:https://sangareddy.telangana.gov.in/recruitment-of-117-various-posts-under-nhm-on-contract-outsourcing-basis/

Apprenticeship

Apprentice Posts In DRDO

DRDO-Defense Scientific Information and Documentation Centre (DRDO-DESIDOC), Delhi invites applications from eligible candidates for Graduate and Diploma Apprenticeship training for the year 2025-26.  Number of Posts: 30 Details: 1. Graduate Apprentice: 20 2. Diploma Apprentice (Computer Science): 07 3. Diploma Apprentice (Video and Photography): 02 4. Diploma Apprentice (Printing Technology): 01 Qualification: Degree or Diploma in the relevant discipline as per the post. Age Limit: 28 years as on the date of written test and interview. Stipend: Rs. 9000 per month for Graduate Apprentice, Rs. 8000 for Diploma Apprentice. Selection method: Based on interview. Application Process: Offline. Address: Director, DESIDOC, Metcalfe House, Delhi-110 054. Last date for application: 20 May 2025. Website:https://drdo.gov.in/drdo/careers

Current Affairs

లోకాయుక్తగా జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బి.ఎస్‌.జగ్జీవన్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో 2025, ఏప్రిల్‌ 28న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

Current Affairs

సిప్రి’ నివేదిక

భారతదేశ సైనిక వ్యయం పాకిస్థాన్‌ సైనిక వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువని ప్రముఖ స్వీడిష్‌ అధ్యయన సంస్థ స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) వెల్లడించింది. ఈ మేరకు 2024కు సంబంధించిన నివేదికను 2025, ఏప్రిల్‌ 28న విడుదల చేసింది. సిప్రి ‘థింక్‌ ట్యాంక్‌-2024’ అధ్యయనం ప్రకారం.. భారత సైనిక వ్యయం 1.6 శాతం మేర పెరిగి 86.1 బిలియన్‌ డాలర్ల(రూ.7.3 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. అదే సమయంలో పాకిస్థాన్‌ సైనిక వ్యయం 10.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం కలిగిన దేశాల జాబితాను పరిశీలిస్తే అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్‌ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ ఐదు దేశాల సైనిక వ్యయం ప్రపంచ సైనిక వ్యయంలో 60 శాతం వాటా కలిగి ఉంది. 

Current Affairs

భారత నౌకాదళానికి అధునాతనమైన రఫేల్‌-మెరైన్‌ జెట్‌

భారత నౌకాదళానికి అధునాతనమైన రఫేల్‌-మెరైన్‌ జెట్‌ల కోసం భారత్, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య రూ.64వేల కోట్ల ఒప్పందంపై 2025, ఏప్రిల్‌ 28న సంతకాలు జరిగాయి. దీనికింద 26 రఫేల్‌-ఎం జెట్‌లు మన దేశానికి అందుతాయి. వీటిలో 22 సింగిల్‌ సీటర్‌ ఫైటర్లు కాగా.. మిగతావి రెండు సీట్ల ట్రైనర్‌ వెర్షన్‌కు చెందినవి. ఈ యుద్ధవిమానాలను విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై మోహరిస్తారు. తాజా ఒప్పందంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఫ్రాన్స్‌ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్‌ లెకోర్నులు సంతకాలు చేశారు. రఫేల్‌-ఎంను ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రఫేల్‌ జెట్‌లు ఉన్నాయి.

Current Affairs

యూట్యూబ్‌ కంట్రీ ఎండీగా గుంజన్‌ సోనీ

భారత్‌లో యూట్యూబ్‌ కంట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గుంజన్‌ సోనీ 2025, ఏప్రిల్‌ 28న నియమితులయ్యారు. దీనికి ముందు జలోరా గ్రూప్‌ సీఈఓగా సోనీ ఆరేళ్లు పని చేశారు. అంతకు ముందు స్టార్‌ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంఓగా బాధ్యతలు నిర్వర్తించారు. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఇ-కామర్స్‌లో ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం ఉంది.