Posts

Current Affairs

విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్‌ శైలజ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) 80 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ ఈ హోదా పొందడం ఇదే మొదటిసారి. సాధారణంగా పదవీ విరమణ చేసిన అత్యంత నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్త పదవి ఇస్తుంటారు. ఐదేళ్ల సర్వీసు లేదా 70ఏళ్ల వయస్సు.. వీటిలో ఏది ముందైతే అంతవరకు డాక్టర్‌ శైలజ పదవిలో ఉంటారు. 

Current Affairs

ఐఎస్‌ఎస్‌కు శుభాంశు శుక్లా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 2025, మే 29న రోదసియాత్ర చేయనున్నారు. యాక్సియం-4 (ఏఎక్స్‌-4) మిషన్‌లో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనం కానున్నారు. ఈ యాత్రలో శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగరీ) కూడా పాలుపంచుకుంటారు. వీరు రెండు వారాలపాటు ఐఎస్‌ఎస్‌లో గడపనున్నారు.  ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ వ్యోమనౌకలో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనమవుతారు. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా ఈ మిషన్‌ను చేపడుతున్నాయి.

Current Affairs

కొత్త సీజేఐగా జస్టిస్‌ గవాయ్‌

భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, ఏప్రిల్‌ 29న నియమించారు. మే 14న ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో 52వ సీజేఐగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ని రాష్ట్రపతి నియమించారు. 

Current Affairs

2025-26 వార్షిక రుణ ప్రణాళిక

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) వివిధ రంగాలకు రూ.6.60 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 22శాతం అదనంగా రుణ ప్రణాళికను రూపొందించింది. సచివాలయంలో 2025, ఏప్రిల్‌ 29న జరిగిన 231వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.   ఎంఎస్‌ఎంఈ రంగానికి గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.87 వేల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.95,620 కోట్లు ఇచ్చినట్లు బ్యాంకర్లు వివరించారు. వ్యవసాయ రుణాల్లో 116 శాతం వృద్ధి సాధించామని.. గతేడాది ఖరీఫ్‌లో రూ.1,69,177 కోట్లు, రబీలో రూ.1,37,291 కోట్లు రుణంగా అందించామని నివేదించారు

Current Affairs

International Dance Day

♦ International Dance Day (World Dance Day) is observed every year on April 29 to raise awareness about the benefits of dance and bring people together through it. ♦ This day was created in 1982 by the Dance Committee of the International Theatre Institute (ITI), UNESCO's main partner for performing arts. ♦ It was first celebrated on April 29 to mark the birthday of Jean-Georges Noverre (1727-1810), the creator of modern ballet. ♦ Since then, International Dance Day is being observed annually to celebrate the art form.  

Current Affairs

India and Bhutan have reaffirmed their strong bilateral trade relationship

♦ India and Bhutan have reaffirmed their strong bilateral trade relationship during the 6th Joint Group of Customs (JGC) Meeting held in Thimphu, Bhutan. ♦ The meeting aimed to deepen cooperation on customs processes, streamline cross-border trade, and ensure efficient and secure border management.  ♦ The meeting was co-chaired by Surjit Bhujabal, Special Secretary and Member (Customs), Central Board of Indirect Taxes and Customs (CBIC), Government of India, and Mr. Sonam Jamtsho, Director General, Department of Revenue and Customs, Royal Government of Bhutan. ♦ Key areas of discussion included the automation and digitisation of transit processes, implementation of Coordinated Border Management (CBM), pre-arrival exchange of customs data, and the movement of goods under the Electronic Cargo Tracking System (ECTS). ♦ Both sides also discussed the Customs Mutual Assistance Agreement (CMAA) to further enhance collaboration.

Current Affairs

Kamla Persad-Bissessar

♦ Kamla Persad-Bissessar (73) will be the next Prime Minister of Trinidad and Tobago. ♦ Her party United National Congress has won the parliamentary election of the twin-island Caribbean nation. ♦ Persad-Bissesar previously served as Prime Minister from 2010-2015. She is the only woman ever to have led the Caribbean country.

Current Affairs

Gavai

♦ Supreme Court judge, Justice B.R. Gavai, was appointed as the next Chief Justice of India (CJI) on 29 April 2025. ♦ He succeeded incumbent CJI Sanjiv Khanna, who will retire on May 13. ♦ Justice Gavai, in line to be the 52nd CJI, will have a tenure of over 6 months, and he will demit office on November 23, 2025. ♦ Justice Gavai was elevated as a Judge of the Supreme Court on May 29, 2019. ♦ Appointed as Additional Judge of the Bombay High Court in November 2003, he became a permanent Judge in November 2005. ♦ He was appointed as Assistant Government Pleader and Additional Public Prosecutor in the Bombay High Court, Nagpur Bench in August 1992 and served till July 1993. ♦ He was appointed as Government Pleader and Public Prosecutor for the Nagpur Bench on January 17, 2000.

Government Jobs

ఇస్రోలో సైంటిస్ట్‌ పోస్టులు

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 63 వివరాలు: 1. సైంటిస్ట్‌/ఇంజినీర్‌(ఎలక్ట్రానిక్స్‌): 22 2. సైంటిస్ట్‌/ఇంజినీర్‌(మెకానికల్‌): 33 3. సైంటిస్ట్‌/ఇంజినీర్‌(కంప్యూటర్‌ సైన్స్‌): 08 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌, సీఎస్‌), గేట్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 28 ఏళ్లు. జీతం: నెలకు రూ.56,100. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.250. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 19. Website:https://www.isro.gov.in/ICRB_Recruitment8.html

Government Jobs

ఫెర్రో స్క్రాప్‌ నిగమ్ లిమిటెడ్‌లో పోస్టులు

ఫెర్రో స్క్రాప్‌ నిగమ్ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌) వివిధ విభాగాల్లో  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 44 వివరాలు: 1. జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 11 2. మేనేజర్‌(ఈ4)/సీనియర్‌ మేనేజర్‌(ఈ5): 03 3. జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 06 4. మేనేజర్‌(ఈ4)/సీనియర్‌ మేనేజర్‌(ఈ5): 02 5. జూనియర్‌ మేనేజర్‌(ఈ1): 09 6. అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2)/ డిప్యూటీ మేనేజర్‌(ఈ3): 01 7. మేనేజర్‌(ఈ4)/ సీనియర్‌ మేనేజర్‌(ఈ5): 02 8. ఎగ్జిక్యూటివ్(ఈ0)/ జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 07 9. ఎగ్జిక్యూటివ్(ఈ0)/ జూనియర్‌ మేనేజర్‌(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్‌(ఈ2): 03 విభాగాలు: ఆపరేషన్‌, మెయింటనెన్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, మెటీరియల్ మేనేజ్‌మెంట్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ, ఎల్ఎల్‌బీ, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, పీజీడీబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 9వ తేదీ నాటికి జూనియర్ మేనేజర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 34 ఏళ్లు, మేనేజర్‌కు 42 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 46 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌కు 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 38 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు జూనియర్‌ మేనేజర్‌కు రూ.40,000 - 1,40,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, మేనేజర్‌కు రూ.70,000 - 2,00,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 - రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000 - 1,80,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 9. Website:https://fsnl.co.in/career.php