కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 2025 విద్యా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: ఐఎంసీఈ ఇండియన్ గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్- 25 సీట్లు ప్రీ- సీ గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ కోర్స్- 120 సీట్లు కోర్సు వ్యవధి: 12 నెలలు- రెసిడెన్షియల్. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్/ నేవల్/ ఆర్కిటెక్చర్/ మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 24 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 20-07-2025. Website:https://cochinshipyard.in/