Posts

Government Jobs

Engineer Posts in IHMCL

Indian Highways Management Company Limited (IHMCL) is inviting applications for the recruitment of Engineer (ITS) posts through direct recruitment.  No. of Posts: 49 Details: Qualification: Engineering degree in the relevant discipline (IT/Computer Science/Electronics and Communications/Data Science and AI) and GATE pass as per the post. Age Limit: 21 - 30 years as on 2nd June 2025. Salary: Rs.40,000 - 1,40,000 per month. Selection Process: Based on Merit in GATE Score. Online Application Last Date: June 2, 2025. Website:https://ihmcl.co.in/careers/

Government Jobs

Posts In Bharat Electronics Limited

Bharat Electronics Limited (BEL) in Uttar Pradesh, is inviting applications for the vacant project posts in various departments at its Ghaziabad unit.  Number of Posts: 07 Details: 1. Havaldar: 03 2. Driver: 04 Qualification: Candidates should have passed 10th class and have driving experience in Army, Navy, Air Force. Age Limit: 43 - 48 years. Salary: Rs.20,500 - Rs.79,000 per month. Selection Process: Based on PET Test, Written Test. Application Mode: Offline. Last Date for Application: 21-05-2025. Website:https://bel-india.in/job-notifications/

Current Affairs

భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ వృద్ధి 6.5-6.7 శాతం మధ్య ఉండొచ్చని డెలాయిట్‌ అంచనా వేసింది. బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను ఉపశమనంతో దేశీయ గిరాకీ పుంజుకోవచ్చని, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులను తట్టుకోవచ్చని తన ‘ఇండియా ఎకానమీ ఔట్‌లుక్‌’లో అభిప్రాయపడింది. 2024-25లో జీడీపీ వృద్ధి 6.3-6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

Current Affairs

దేశవ్యాప్తంగా ఇకపై 28 ఆర్‌ఆర్‌బీలే

2025, మే 1 నుంచి దేశవ్యాప్తంగా 700 జిల్లాల వ్యాప్తంగా 22,000కు పైగా శాఖలతో 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్‌ఆర్‌బీ) కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ‘ఒక రాష్ట్రం ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం అమల్లోకి రావడమే ఇందుకు కారణం. ఈ విధానం కింద ఒక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కటే ఆర్‌ఆర్‌బీ ఉండేలా.. 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 26 ఆర్‌ఆర్‌బీలను ఏకీకరణ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కు తగ్గింది. 

Current Affairs

జీఎస్‌టీ వసూళ్లు

2025, ఏప్రిల్‌లో జీఎస్‌టీ స్థూల వసూళ్లు జీవనకాల గరిష్ఠమైన రూ.2.37 లక్షల కోట్లకు చేరాయి. 2024 ఏప్రిల్‌ వసూళ్లయిన రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.6% అధికం. జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక.. ఒక నెలకు సంబంధించి అత్యధిక వసూళ్లు ఏప్రిల్‌ నెలలోనే నమోదయ్యాయి. 2025 మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు    రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి.  2025, ఏప్రిల్‌లో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్‌టీ ఆదాయం 10.7% పెరిగి రూ.1.9 లక్షల కోట్లుగా నమోదైంది. వస్తువుల ఎగుమతుల ద్వారా ఆదాయం 20.8% అధికమై రూ.46,913 కోట్లకు చేరింది. స్థూలంగా వసూలైన రూ.1.9 లక్షల కోట్లలో కేంద్ర జీఎస్‌టీ రూ.48,634 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.59,372 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ రూ.69,504 కోట్లుగా నమోదైంది. సెస్సు రూపేణా రూ.12,293 కోట్లు వచ్చాయి. మొత్తం రిఫండ్‌లు 48.3% పెరిగి రూ.27,341 కోట్లకు చేరాయి. 

Current Affairs

కన్నుమూసిన ప్రపంచ అత్యధిక వృద్ధురాలు

ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందిన సిస్టర్‌ ఇనా కనబారో లుకాస్‌ 2025, మే 1న మరణించారు. ఆమె వయసు 116 సంవత్సరాలు. దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండ్‌ దు సుల్‌ రాష్ట్రంలో 1908, మే 27న జన్మించిన ఇనా తన 20వ ఏట కేథలిక్‌ నన్‌ (సన్యాసిని)గా మారారు. ఇనాకు 106వ ఏట కంటి శుక్లాలు తొలగించారు. అంతకు మించి ఆమెకు మరెలాంటి శస్త్ర చికిత్సలూ జరగలేదు. 

Current Affairs

పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు

పాకిస్థాన్‌ జాతీయ భద్రతా సలహాదారుగా నిఘా సంస్థ ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ మహమ్మద్‌ ఆసిమ్‌ మాలిక్‌ నియమితులయ్యారు. ఆయన దేశానికి పదో జాతీయ భద్రతా సలహాదారు. అయితే ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న అధికారిని సలహాదారుగా నియమించడం ఇదే తొలిసారి.

Current Affairs

అమెరికా - ఉక్రెయిన్‌ ఒప్పందం

అమెరికా 2025, మే 1న ఉక్రెయిన్‌తో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ దేశంలోని అరుదైన ఖనిజ సంపదపై అగ్రరాజ్యానికీ హక్కులు ఏర్పడనున్నాయి. ప్రపంచంలో 90 శాతం అరుదైన ఖనిజాలను చైనా ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆ దేశంతో సుంకాల యుద్ధం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందం అమెరికాకు భారీస్థాయిలో లబ్ధి చేకూర్చనుంది. 

Current Affairs

అమెరికా ఎన్‌ఎస్‌ఏ వాల్జ్‌పై ట్రంప్‌ వేటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైక్‌ వాల్జ్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయనను ఐక్యరాజ్య సమితి రాయబారిగా ట్రంప్‌ నియమించారు. వాల్జ్‌ స్థానంలో తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. 

Current Affairs

ఖేల్‌రత్న అందుకున్న సాత్విక్, చిరాగ్‌

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు (2023)ను భారత స్టార్‌ డబుల్స్‌ ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి 2025, మే 1న అందుకున్నారు. దిల్లీలోని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) కేంద్ర కార్యాలయంలో కేంద్ర క్రీడల మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయ వీరికి పురస్కారం ప్రదానం చేశారు. ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన సాత్విక్, చిరాగ్‌లు విదేశాల్లో టోర్నీలు ఉండటంతో రాష్ట్రపతి భవన్‌లో అవార్డులు అందుకోలేకపోయారు.