Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా టౌడెరా

మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌ దేశ అధ్యక్షుడిగా ఫస్టీన్‌ అర్చాంజ్‌ టౌడెరా మూడోసారి విజయం సాధించారు. 2025, డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో దాదాపు 76 శాతం ఓట్లతో ఆయన నెగ్గినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రెండో స్థానంలో ఉన్న అనిసెట్‌ జార్జెస్‌ అనే వ్యక్తికి 14 శాతం ఓట్లు వచ్చాయి. 

Current Affairs

2026-27లో భారత వృద్ధి 6.9%

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌-రా) అంచనా వేసింది. జీఎస్‌టీ, ఆదాయపు పన్ను కోతలకు తోడు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాల లాంటివి మన దేశానికి ఆర్థిక ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయని పేర్కొంది.

Current Affairs

ఏఈపీసీ ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్

దుస్తుల ఎగుమతిదార్ల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్‌ 2026, జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. సుధీర్‌ సెఖ్రి స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ఈ మండలికి శక్తివేల్‌ ఛైర్మన్‌ కావడం ఇది అయిదో సారి. స్వెటర్లను ఎగుమతి చేసే పాపీస్‌ నిట్వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులే శక్తివేల్‌.  తిరుప్పూర్‌ను ప్రపంచ నిట్వేర్‌ కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఏఈపీసీ తెలిపింది. 

Current Affairs

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు పినాక ఆధునికీకరణ పనులు

భారత సైన్యానికి చెందిన మొదటి తరం ‘పినాక మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ (ఎంఎల్‌ఆర్‌ఎస్‌)’, బ్యాటరీ కమాండ్‌ పోస్టులను ఆధునికీకరించేందుకు, మరమ్మతులు చేసే పనులను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏసీఎల్‌) దక్కించుకుంది. 2026, జనవరి 6న దిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారత సైన్యం నుంచి ఈ ఆర్డర్‌ అందుకున్నట్లు టీఏసీఎల్‌ తెలిపింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో భాగంగా, సైన్యంలోని 510 అడ్వాన్స్‌ బేస్‌ వర్క్‌షాప్‌ (ఏబీడబ్ల్యూ), టాటా సంస్థ సంయుక్తంగా పనిచేయనున్నాయి. 

Current Affairs

మిజోరంలో కొత్తరకం రెల్లుజాతి పాము

రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. భారత సరీసృప జంతుజాల వర్గీకరణలో చాలాకాలంగా ఉన్న తప్పులను సరిచేసి, కొత్త రకం జాతులను చేర్చడం కోసం చేపట్టిన పరిశోధనల్లో దీన్ని గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని తెలిపారు. దీనికి కలమారియా మిజోరమెన్సిస్‌ అని నామకరణం చేశారు. పామును కనుగొన్న రాష్ట్రానికి గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు తెలిపారు.

Current Affairs

‘భైరవ్‌’

శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్‌’ పేరుతో కొత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. లక్ష మందికి పైగా ‘డ్రోన్‌ ఆపరేటర్ల’తో ఈ భారీ మానవ సైన్యాన్ని తయారుచేసింది. భైరవ్‌ దళ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్‌ ఫోర్సెస్‌కు మధ్య వారధిలా పనిచేస్తుంది.  ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్‌ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి, వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో కచ్చితత్వంతో దెబ్బకొట్టగలరు. అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత. 

Current Affairs

సాహిత్య సంపుటాలు విడుదల

దేశంలోని వివిధ ప్రాచీన భాష అధ్యయన పీఠాలు ప్రచురించిన సాహిత్య సంపుటాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026, జనవరి 6న దిల్లీలో విడుదల చేశారు. నెల్లూరులోని తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం ప్రచురించిన ఎనిమిది గ్రంథాలు అందులో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే.. వైద్యం వెంకటేశ్వరాచార్యులు రచించిన ‘చిత్రకవిత్వ దర్పణం’, మొట్టమొదటి తెలుగు చందోగ్రంథం కవిజనాశ్రయంకు ప్రొఫెసర్‌ బి.వెంకటేశ్వర్లు తెలుగులో, ప్రొఫెసర్‌ ఆర్‌వీ సుందరం ఇంగ్లిష్‌లో రాసిన వ్యాఖ్యానాలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తమిళంలోకి అనువదించిన 15వ శతాబ్దానికి చెందిన క్రీడాభిరామం, డాక్టర్‌ గీతా నావల్‌ కన్నడంలోకి అనువదించిన అన్నమయ్య ‘సంకీర్తన లక్షణం’, డాక్టర్‌ రమేష్‌ రాసిన మల్లు పురాణం, రత్నావళి పరిణయం, డాక్టర్‌ టీఎస్‌ వెంకటేష్‌ రచించిన హరిచంద్రోపాఖ్యానాలను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. 

Current Affairs

హరియాణాలో హైడ్రోజన్‌ రైలు

భారత్‌లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును హరియాణా ప్రారంభించనుంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్‌-సోనిపత్‌ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్‌లో హైడ్రోజన్‌ ప్లాంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ప్రారంభం, నిర్వహణ దశలకు 11 కేవీల విద్యుత్‌ సరఫరాను ఈ ప్లాంట్‌ అంతరాయం లేకుండా అందించనుంది. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు. 

Walkins

ఎయిమ్స్‌ రాయ్‌బరేలిలో సీనియర్ రెసిడెంట్‌ పోస్టులు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), రాయ్‌బరేలి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: జూనియర్ రెసిడెంట్‌: 103 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.67,700. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 9, 23, ఫిబ్రవరి 6, 20.  వేదిక: ఎయిమ్స్‌ రాయ్‌బరేలీ, మెడికల్ కాలేజీ. Website:https://aiimsrbl.edu.in/recruitments

Private Jobs

మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ పోస్టులు

మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రొడక్ట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  వివరాలు: పోస్ట్: ప్రిన్సిపల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌-ll   కంపెనీ: మైక్రోసాఫ్ట్. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్‌/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ లేదా ఎల్‌ఎల్‌ఎం, జేన్‌ఏఐ సిస్టమ్‌ అనుభవం, కమ్యూనికేషన్‌ తదితరాల నైపుణ్యాలు ఉండాలి. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. చివరి తేదీ: 12.1.2026 Website:https://apply.careers.microsoft.com/careers?start=0&location=Hyderabad%2C+TS%2C+India&pid=1970393556654592&sort_by=distance&filter_distance=160&filter_include_remote=1