Posts

Current Affairs

అర్కిన్‌ గుప్తా

ఫోర్బ్స్‌ అండర్‌-30 అచీవర్స్‌ జాబితాలో భారత సంతతికి చెందిన అర్కిన్‌ గుప్తా చోటు దక్కించుకున్నారు. 30 ఏళ్ల వయసులోపే ఆర్థిక రంగంలో విజయాలు సాధించిన వారితో ఈ జాబితాను ఫోర్బ్స్‌ రూపొందించింది. ఆర్థిక రంగంలో ఆవిష్కరణలు, ప్రారంభ స్థాయి పెట్టుబడుల వ్యూహాలకు గుప్తా కృషి చేశారని ఫోర్బ్స్‌ తెలిపింది. డేటా ఆధారిత పెట్టుబడుల మార్గాలను అభివృద్ధి చేయడం, ఆర్థిక ఉత్పత్తులను సృష్టించడంలో గుప్తా విశేషంగా రాణించారని, ఈ జాబితాలో ఆయన చోటు పొందడానికి ఇవే ముఖ్య కారణాలని ఫోర్బ్స్‌ వివరించింది. 

Current Affairs

జాతీయ హస్తకళా పురస్కారాలు

హస్తకళల్లో విశేష ప్రతిభ చూపుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కళాకారులను కేంద్ర జౌళి శాఖ జాతీయ అవార్డులతో సత్కరించింది. 2025, డిసెంబరు 9న న్యూ దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.  అవార్డులు అందుకున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి.శివమ్మ, అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారుడు గోర్సా సంతోష్, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన కళంకారి కళాకారిణి పి.విజయలక్ష్మి ఉన్నారు.

Current Affairs

యునెస్కో వారసత్వ గుర్తింపు

బంగ్లాదేశ్‌కు చెందిన తంగైల్‌ చీర నేత కళతోపాటు అఫ్గాన్‌కు చెందిన మినియేచర్‌ పెయింటింగ్‌లోని బేజాద్‌ శైలికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. వీటితోపాటు బిష్త్‌ (పురుషుల గౌను) తయారీ, నైపుణ్యానికి, పాకిస్థాన్‌లో అంతరిస్తున్న పురాతన జానపద సంగీత పరికరం బోరీండో, దాంతో ఆలపించే జానపద గీతాలు, పరాగ్వేకు చెందిన పురాతన సిరామిక్‌ పనితనం, కెన్యాలోని దైదా కమ్యూనిటీకి చెందిన మ్వాజిందికా ఆధ్యాత్మిక నృత్యం.. అంతర్జాతీయ గుర్తింపును దక్కిôచుకున్నాయి. ఇంకా వియత్నాంకు చెందిన డాంగ్‌ హో జానపద చెక్కబ్లాకుల ప్రింటింగ్‌ నైపుణ్యం.. తయారీ, ఫిలిప్పీన్స్‌లోని బొహోల్‌ ద్వీపానికి చెందిన సముద్రపు ఉప్పుతో తయారుచేసే ఆసిన్‌ టిబోక్‌ తయారీ విధానం, పనామాలోని క్వించా ఇంటి నిర్మాణం, జుంటా డి ఎంబారా, పోర్చుగల్‌లోని మోలిసీరో బోటు కార్పెంటరీ కళ, ఉజ్బెకిస్థాన్‌లోని కోబిజ్‌ కళ, ఆడే విధానం ఈ జాబితాలో చోటు సంపాదించాయి. వీటిని రక్షించుకోవాల్సి ఉందని దిల్లీలోని ఎర్రకోటలో జరుతుతోన్న యునెస్కో 20వ సదస్సులో ప్రతినిధులు స్పష్టం చేశారు.

Walkins

అలహాబాద్‌ యూనివర్సిటీలో కోచ్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన కోచ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: కోచ్ - 06 విభాగాలు: అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా,డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: నెలకు రూ.25,000. - రూ.35,000. ఇంటర్వ్యూ తేదీ: 20.12.2025. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: ది యూనివర్సిటీ గెస్ట్ హౌస్, చైతమ్ లైన్స్, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్. Website:https://www.allduniv.ac.in/recruitment_show/203

Private Jobs

యాక్సెంచర్‌లో క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్ పోస్టులు

యాక్సెంచర్ కంపెనీ క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివరాలు: క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్ అర్హత: ఏదైనా డిగ్రీ. 0 - 3 సంవత్సరాల అనుభవం. నైపుణ్యాలు/అనుభవం: గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్కిటెక్చర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్చర్‌ ప్రావీణ్యం, మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్కిటెక్చర్ వంటి నైపుణ్యాలు. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 22.12.2025 Website:https://www.accenture.com/us-en

Government Jobs

టీఐఎఫ్‌ఆర్‌లో వర్క్‌ అసిస్టెంట్ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివరాలు: 1. వర్క్‌ అసిస్టెంట్‌(ఆగ్జలరీ): 03 2. వర్క్‌ అసిస్టెంట్‌(టెక్నికల్)(ఫిట్టర్‌): 01 3. ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(బీ): 01 4. ప్రాజెక్ట్ ట్రేడ్స్‌మ్యాన్‌(బీ)(ఎలక్ట్రీషియన్‌): 01 5. ప్రాజెక్ట్ ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 28 నుంచి 31 ఏళ్లు ఉండాలి.  వేతనం: నెలకు వర్క్‌ అసిస్టెంట్‌కు రూ.35,973,  ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.63,900, ప్రాజెక్ట్ ట్రేడ్స్‌మ్యాన్‌, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.41,100.  ఎంపిక: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 3. Website:https://www.tifr.res.in/maincampus/careers.php

Apprenticeship

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) ఈస్టర్న్‌ రీజియన్‌లో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 509 వివరాలు: 1. డిప్లొమా టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 248 2. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 127 3. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 107  4. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 27 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, మొదలైనవి.. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 31.12.2025 తేదీ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 9. Website:https://iocl.com/apprenticeships

Apprenticeship

హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని హిందుస్థాన్‌ ఉర్వ్‌రక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ హెచ్‌యూఆర్‌ఎల్‌ బరౌనీ యూనిట్‌లో వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 33 వివరాలు:  1. టెక్నికల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌)- 02 2. టెక్నికల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌)- 02 3. టెక్నికల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (కెమికల్‌)- 09 4. టెక్నికల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (సివిల్‌)- 02 5. టెక్నికల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (మెకానికల్‌)- 05 6. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ- 13 అర్హత: టెక్నికల్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు బీఈ/బీటెక్‌, బీకాం/బీబీఏ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జీతం: నెలకు టెక్నికల్‌ అప్రెంటిస్‌కు రూ.9,000; గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 8,000. వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 20-12-2025. Website:https://hurl.net.in/

Walkins

Coach Jobs at Allahabad University

Allahabad University in Uttar Pradesh is conducting interviews for the Coach jobs on contract basis. Details: Coach - 06 Departments: Athletics, Hockey, Volleyball, Basketball, Cricket, Football. Qualification: Must have passed Diploma or Degree from a recognized university in the relevant department as per the posts. Salary: Rs.25,000 per month. - Rs.35,000. Interview Date: 20.12.2025. Selection Process: Based on Interview. Venue: The University Guest House, Chaitham Lines, University of Allahabad. Website:https://www.allduniv.ac.in/recruitment_show/203

Private Jobs

Cloud Migration Engineer Posts In Accenture

Accenture Company invites applications for Cloud Migration Engineer Posts. Details: Cloud Migration Engineer  Qualification: Any Degree. 0 - 3 year experience.  Skills/Experience: Google Cloud Platform Architecture, Microsoft Azure Architecture, Proficiency in Google Cloud Platform Architecture, Microsoft Azure Architecture ect skills. Job Location: Hyderabad. Application Mode: Through Online. Last date: 22.12.2025 Website:https://www.accenture.com/in-en