కైనన్, సబీరా జోడీకి కాంస్యం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో కైనన్ చెనాయ్, సబీరా హారిస్ జోడీ మిక్స్‌డ్ ట్రాప్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. 2025, మే 11న నికోసియా (సైప్రస్)లో మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత ద్వయం 34-33తో టోల్గా టన్సర్-పెలిన్ కాయా (తుర్కియే) జంటను ఓడించింది. పురుషుల ట్రాప్ క్వాలిఫయర్స్‌లో కైనన్ షెనాయ్ (117) భారత్ తరఫున అత్యుత్తమంగా ముగించి 17వ స్థానం సాధించాడు. శార్దూల్ విహాన్ 62, భౌనీష్ మెండిరట్ట 65వ స్థానాల్లో నిలిచారు.