బెల్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులు
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్-సీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 14 వివరాలు: 1. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ(ఈఏటీ): 10 2. టెక్నీషియన్ సీ: 04 విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెషినిస్ట్. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 1-12-2025 నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: నెలకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీకి రూ.24,500 - రూ.90,000, టెక్నీషియన్ సీకి రూ.21,500 - రూ.82,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక: రాత పరీక్ష (సీబీటీ) ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 23. Website:https://bel-india.in/job-notifications/