Posts

Government Jobs

ఎఫ్‌డీడీఐలో అకాడమిక్‌, నాన్‌ అకాడమిక్‌ పోస్టులు

హైదరాబాద్‌, అంకలేశ్వర్‌లోని ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ) ఒప్పంద ప్రాతిపదికన అకాడిమిక్‌ అండ్‌ నాన్‌ అకాడమిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 18 వివరాలు:  1. సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌ 1/ చీఫ్‌ ఫ్యాకల్టీ: 01 2. జూనియర్‌ ఫ్యాకల్టీ/ ఫ్యాకల్టీ/ సీనియర్‌ ఫ్యాకల్టీ: 08 3. ల్యాబ్‌ అసిస్టెంట్‌: 03 4. జూనియర్‌ ఫ్యాకల్టీ/ ఫ్యాకల్టీ/ సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌2,1: 01 5. అసిస్టెంట్‌ మేనేజర్‌: 05 విభాగాలు: ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌, స్కూల్‌ ఆఫ్ ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌ అండ్‌ అడ్మిషన్స్‌, స్టూడెంట్‌ అపైర్‌ అండ్‌ ఎగ్జామినేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, టెన్త్‌, ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌, బీఈ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు జూనియర్‌ ఫ్యాకల్టీ పోస్టుకు రూ.45,000; ఫ్యాకల్టీకి రూ.65,000; సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌1కు రూ.80,000;  సీనియర్‌ ఫ్యాకల్టీ గ్రేడ్‌2కు రూ.1,10,000; చీఫ్‌ ఫ్యాకల్టీకి రూ.1,50,000; ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.25,000; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000.   కనిష్ఠ వయోపరిమితి: 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 26-05-2025. Website: https://fddiindia.com/

Current Affairs

Manohar Lal Khattar

♦ Minister of Power and Minister of Housing and Urban Affairs Minister Manohar Lal Khattar inaugurated the Bharat Bodh Kendra in India Habitat Centre (IHC). ♦ Bharat Bodh Kendra is a new wing within its Habitat Library & Resource Centre, dedicated to enhancing understanding and appreciation of India's cultural and civilizational legacy. ♦ The new facility will house a curated collection of books and resources on Indian art, music, spirituality, history, philosophy and other related fields.

Government Jobs

సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్‌ కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) స్పోర్ట్స్‌ కోటా (హాకీ విభాగంలో) కింద అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి హెడ్‌ కానిస్టేబుల్(జనరల్‌ డ్యూటీ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: * హెడ్‌ కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ): 30 ఖాళీలు అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు హాకీలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.(01.01.2023 నుంచి 30.05.2025 వరకు జరిగిన క్రీడలు/ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ప్రతిభవంతులు దరఖాస్తుకు అర్హులు.     వయోపరిమితి: 01.08.2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.  శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 153 సెం.మీ ఉండాలి. జీత భత్యాలు: నెలకు రూ.25,500-రూ.81,100. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ: ట్రయల్‌ టెస్ట్‌, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.05.2025. Website: https://www.cisf.gov.in/cisfeng/recruitment/ Apply online: https://cisfrectt.cisf.gov.in/index.php

Current Affairs

BrahMos Aerospace Integration and Testing Facility in Lucknow on 11 May 2025

♦ Defence Minister Rajnath Singh has virtually launched the BrahMos Aerospace Integration and Testing Facility in Lucknow on 11 May 2025. ♦ Built at a cost of Rs.300 crore, the facility will manufacture one of the world's fastest supersonic cruise missiles, with a range of 290 to 400 km and a top speed of Mach 2.8. ♦ The missile, a product of BrahMos Aerospace, a joint venture between India and Russia, can be launched from land, sea, or air and uses a "fire and forget" system.

Admissions

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో పీజీడీటీడీఎం ప్రోగామ్‌

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ట్రైబల్‌ డెవెలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీటీడీఎం) ప్రోగ్రామ్ 2025-26 విద్యాసంవత్సరానికి దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: * పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ట్రైబల్‌ డెవెలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ (PGDTDM) 2025-26 ప్రోగ్రామ్‌ వ్యవది: 18 నెలలు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈడబ్ల్యూఎస్‌కు రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-07-2025. Website: https://www.nirdpr.org.in/index.aspx Apply online: http://admissions.nirdpr.org.in/DECAdmissionApp/login.aspx

Current Affairs

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వైద్యులతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో వారు చేస్తోన్న కృషి, అన్ని సమయాల్లో రోగికి తోడుగా ఉంటూ జబ్బును నయం చేయడంలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: ‘మదర్‌ ఆఫ్‌ మోడ్రన్‌ నర్సింగ్‌’గా పేర్కొనే ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ 1812, మే 12న ఇటలీలో జన్మించారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సింగ్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆమె పుట్టిన రోజైన మే 12ను ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’గా జరపాలని ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌ (ఐసీఎన్‌) 1965లో తీర్మానించింది. 2025 నినాదం: 'Our Nurses. Our Future. Caring for nurses strengthens economies'

Current Affairs

నలుగురు సమాచార కమిషనర్ల నియామకం

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2025, మే 12న ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రభుత్వం పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్‌లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించింది. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 

Current Affairs

విరాట్‌ కోహ్లి

అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్‌గా పేరొందిన విరాట్‌ కోహ్లి ఆ ఫార్మాట్‌ నుంచి రిటైరవుతున్నట్లు 2025, మే 12న ప్రకటించాడు. 2024లో టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఆ తర్వాత ఆ ఫార్మాట్‌ నుంచి రిటైరయ్యాడు. ఇక అతడు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడతాడు. భారత 269వ టెస్టు ఆటగాడిగా 2011లో అరంగేట్రం చేసిన విరాట్‌.. 123 టెస్టుల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 30 శతకాలతో 9230 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో ఆడిన అయిదో టెస్టే కోహ్లికి చివరి టెస్టు. కోహ్లి 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు వన్డేల్లో కొనసాగే అవకాశముంది. 

Current Affairs

మాల్దీవులకు భారత్‌ తోడ్పాటు

మాల్దీవుల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే లక్ష్యంతో ఆ దేశానికి భారత్‌ 50 మిలియన్‌ డాలర్ల(రూ.424 కోట్లు) సహాయం అందించింది. ఇది తమ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ద్వారా ఖజానా బిల్లుల నుంచి వడ్డీ రహిత సాయాన్ని 2019 నుంచి మాల్దీవులకు భారత్‌ ఇస్తూ వస్తోంది. ఈ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది.

Current Affairs

జాతీయ సాంకేతిక దినోత్సవం

పోఖ్రాన్‌ అణు పరీక్ష విజయవంతమైన సందర్భంగా మన దేశంలో ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా  నిర్వహిస్తారు. భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకుల శాస్త్ర - సాంకేతిక విజయాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సాంకేతికత ముఖ్య పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యం: 1998, మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత్‌ విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించింది. ‘ఆపరేషన్‌ శక్తి’గా పేర్కొనే ఈ మిషన్‌ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ పరీక్ష విజయవంతమయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషిని అభినందించడంతోపాటు శాస్త్ర, సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఏటా మే 11న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించారు. 1999 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.