ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ: 08 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 01.08.2025 27 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ట్రైనీ శిక్షణ కాలంలో రూ.60,000. తరువాత రూ.40,000- రూ.1,40,000. దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌సర్విస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.12.2025. దరఖాస్తు చివరి తేదీ: 20.12.2025. Website:https://rcfltd.com/hrrecruitment/recruitment-1