Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క

అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్కను 175 ఏళ్ల తర్వాత కేరళలో పరిశోధకులు మళ్లీ కనుక్కున్నారు. ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’గా ఈ మొక్కను గుర్తించారు. వయనాడ్‌ జిల్లాలోని థొల్లాయిరాం ప్రాంతంలో ఇది కనిపించింది. ఈ జాతి మొక్కను మొదట 1849కి ముందు తమిళనాడులోని నడువట్టం వద్ద స్కాటిష్‌ వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్‌ విట్‌ చూశారు. అయితే, దీనికి సంబంధించిన విశ్వసనీయమైన రికార్డులేవీ లేవు.  కేరళలోని కాల్‌పెట్టకు చెందిన ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ పరిశోధకులు సలీం పిచాన్‌తోపాటు అలప్పుజలోని సనాతన ధర్మ కళాశాల నుంచి వచ్చిన డాక్టర్‌ జోస్‌ మాథ్యూ, అరుణ్‌రాజ్, డాక్టర్‌ వి.ఎన్‌.సంజయ్, శ్రీలంక యూనివర్సిటీకి చెందిన బి.గోపల్లవ బృందం ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’ను కనుగొంది.

Current Affairs

నీతీశ్‌ కుమార్‌

బిహార్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల పదోసారి ప్రమాణం చేసిన నీతీశ్‌కుమార్‌కు 2025, డిసెంబరు 5న లండన్‌కు చెందిన ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స’ గుర్తింపు లభించింది. 2000లో మొదటిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన నీతీశ్‌.. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత 2005లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, మధ్యలో స్వల్పకాలం (2014) మినహా ఇప్పటిదాకా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 

Current Affairs

తగ్గన రెపోరేటు

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ రెపోరేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీ)ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2024 డిసెంబరు 6న రెపో రేటు 6.50% కాగా.. ఏడాది తర్వాత ఇప్పుడు 5.25 శాతానికి దిగివచ్చింది. అంటే 2025లో రెపో రేటు 1.25% (ఫిబ్రవరిలో 0.25%, ఏప్రిల్‌లో 0.25%, జూన్‌లో 0.50%, డిసెంబరులో 0.25% చొప్పున) తగ్గింది. 2025-26కు జీడీపీ వృద్ధి అంచనాను 6.8% నుంచి 7.3 శాతానికి ఆర్‌బీఐ పెంచింది.

Current Affairs

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు

మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు(విక్రమ్‌)ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025, డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అధికార భాషా సంఘం చేపట్టాల్సిన కార్యాచరణను ఉత్తర్వుల్లో వివరించింది. 

Current Affairs

ఏపీ వాసులకు జాతీయ హస్తకళ అవార్డులు

కేంద్ర జౌళి శాఖ 2023, 2024 సంవత్సరాలకు ప్రకటించిన ‘జాతీయ హస్తకళ’ అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో డి.శివమ్మ (తోలుబొమ్మలాట) శిల్పగురు-2023, బ్రహ్మానంద మహారాణ (రాతి శిల్పం), గోర్సా సంతోష్‌కుమార్‌ (ఆటబొమ్మలు, గాలిపటాలు)లు జాతీయ హస్తకళ 2023, 2024 అవార్డులు గెలుచుకున్నారు.   

Current Affairs

పుతిన్‌తో మోదీ శిఖరాగ్ర భేటీ

భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో 2025, డిసెంబరు 5న శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్‌ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి.  భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇందుకుగానూ అయిదేళ్ల కాలానికి ‘2030 ఆర్థిక కార్యక్రమం’ ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి.

Government Jobs

Security Officer Posts In Cochin Shipyard Limited

Cochin Shipyard Limited, Kochi Unit is inviting applications for the Security Advisor, Project Advisor, Security Officer posts on contractual basis. No. of Posts: 04 Details: 1. Security Advisor: 01 2. Project Advisor: 01 3. Security Officer: 02 Eligibility: Degree, PG in the relevant discipline as per the posts along with work experience. Age Limit: Not more than 50 to 62 years as on December 20, 2025. Salary: Rs. 2,00,000 per month for Security Advisor, Rs. 1,50,000 for Project Advisor, Rs. 59,000 for Security Officer. Selection Process: Based on PowerPoint Presentation and Interview. Application Process: Online. Last Date for Application: December 20, 2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/683

Government Jobs

Junior Resident Jobs in AIIMS Deoghar

All India Institute of Medical Sciences (AIIMS) in Deoghar is inviting applications for the Junior Resident (Non-Academic) on contract basis. Details: Junior Resident (Non-Academic) - 09 Eligibility: Must have passed MBBS from a recognized university in the relevant discipline as per the posts. Maximum Age Limit: Age relaxation of 5 years for SC/ST candidates and 3 years for OBC candidates as on 18th December 2025. Salary: Rs. 56,100 per month. Application Procedure: Send by email to jr.recruitment@aiimsdeoghar.edu.in. Selection Process: Based on written test and interview. Application Fee: Rs. 3000 for General Candidates. Rs. 1000 for OBC/PWD Candidates. No fee for SC/ST/Women Candidates. Last Date of Application: 18th December 2025 Website:https://www.aiimsdeoghar.edu.in/recruitments/list

Current Affairs

Navy day

♦ Navy day is celebrated every year in India on December 4 to honour the dedication, discipline and sacrifices of naval personnel who continue to protect the country. Navy Day on December 4 marks Operation Trident, when the Indian Navy inflicted heavy damage on Pakistani vessels in Karachi harbour amid the Bangladesh Liberation War of 1971. ♦ The Indian Navy has played a vital role in keeping the nation safe, guarding long coastlines, and responding to crises at sea.

Current Affairs

Sarwagya Singh Kushwaha

♦ India’s Sarwagya Singh Kushwaha has become the youngest player in chess history to earn an official FIDE rating at the age of three years, seven months and 20 days. ♦ Kushwaha, from Sagar district in Madhya Pradesh, broke the record previously held by Kolkata’s Anish Sarkar, who achieved the milestone in November 2024 at the age of three years, eight months and 19 days. ♦ Currently enrolled in nursery school, Kushwaha holds a rapid rating of 1,572. ♦ To achieve a FIDE ranking, a player needs to beat at least one international player.