Posts

Current Affairs

యునెస్కో అధ్యయనం

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమాటిక్స్‌ (స్టెమ్‌) కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి గత దశాబ్ద కాలంగా (2014-24) అనుకున్నంత పురోగతి కనిపించలేదని యునెస్కో అధ్యయనం వెల్లడించింది. ఈ విభాగాల్లో మహిళలు 35 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొంది. యునెస్కోకు చెందిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ (జీఈఎం) బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గణితం అంటే భయపడటం, లింగ వివక్ష ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. ప్రస్తుతం నూతన సాంకేతికత అయిన కృత్రిమ మేధ రంగంలోనూ స్త్రీలు 26 శాతానికే పరిమితమయ్యారని వెల్లడించింది. 

Current Affairs

శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంప్‌ భారత్‌

 శాఫ్‌ అండర్‌-19 ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ టైటిల్‌ నిలబెట్టుకుంది. 2025, మే 18న యుపియాలో జరిగిన ఫైనల్లో 1-1 (4-3)తో పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. నిర్ణీత సమయానికి భారత్‌-బంగ్లా 1-1తో నిలిచాయి. భారత్‌ తరఫున సింగమయుం షామి (2వ నిమిషం).. బంగ్లా జట్టులో జోయ్‌ అహ్మద్‌ (61వ) గోల్స్‌ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో తొలి మూడు ప్రయత్నాల్లో బంగ్లా సఫలం కాగా భారత్‌ రెండే గోల్స్‌ చేసింది. కానీ తర్వాతి రెండు ప్రయత్నాల్లోనూ బంగ్లా విఫలమైతే.. భారత్‌ వరుసగా రెండు గోల్స్‌ కొట్టి విజేతగా నిలిచింది. 

Current Affairs

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్‌కు నాలుగో స్థానం

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే మనదేశం నాలుగో స్థానానికి చేరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. 2024-25లో మనదేశం నుంచి 130 దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2014-15లో మన ఉత్పత్తులు తరలి వెళ్లిన దేశాల సంఖ్య 105గా ఉంది.  2014-15లో 10.51 లక్షల మెట్రిక్‌ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా.. 2024-25లో 16.85 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి. అధునాతన ఆక్వా పద్ధతులు, శీతల గిడ్డంగులు - రవాణా మౌలిక సదుపాయాలు పెరగడం, సాగు-నిల్వలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడం వంటివి ఇందుకు దోహదపడ్డాయి.

Current Affairs

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాలు

గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్లు అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2025, మే 18న తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతుల బిల్లు కంటే అధిక విలువైన స్మార్ట్‌ఫోన్లే వివిధ దేశాలకు తరలి వెళ్లాయి. 2024-25లో భారత స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 55% వృద్ధితో 24.14 బిలియన్‌ డాలర్ల (రూ.2 లక్షల కోట్ల)కు చేరాయి. 2022-23లో ఇవి 10.96 బి.డాలర్లుగా, 2023-24లో 15.57 బి.డాలర్లుగా ఉన్నాయి. భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు పెరిగిన దేశాల్లో అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్‌ రిపబ్లిక్‌ ఉన్నాయి. అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 2022-23లో 2.16 బి.డాలర్లు, 2023-24లో 5.57 బి.డాలర్లుగా ఉండగా.. 2024-25లో 10.6 బి.డాలర్లకు వృద్ధి చెందాయి. ప్రధానంగా ఐఫోన్‌ ఎగుమతులు గణనీయంగా పెరగడం ఇందుకు కారణం. 2024-25లో కట్‌ అండ్‌ పాలిష్ట్‌ వజ్రాల ఎగుమతులు 13.29 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

Current Affairs

భారత మొదటి అణు పరీక్షకు 51 ఏళ్లు

భారత మొట్టమొదటి అణు పరీక్షకు 2025, మే 18తో 51ఏళ్లు పూర్తయ్యాయి. వీటిలో మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు వారి అంకితభావంతో అసాధారణ ఘనతను సాధించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వీటిని నిర్వహించారు. 1974 మే 18న తొలిసారిగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణు పరీక్షలు జరిగాయి.

Current Affairs

పీఎస్‌ఎల్‌వీ-సీ61 విఫలం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 101వ కారెట్‌ ప్రయోగం విఫలమైంది. 2025, మే 18న తిరుపతి జిల్లాలోని సతీశ్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ61 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. తర్వాత 12వ నిమిషంలోనే లోపం తలెత్తింది. రెండు దశల వరకు అంతా బాగానే ఉంది. మూడోదశ మోటార్‌ సరిగ్గానే మొదలైనా.. ఆ దశలోనే సమస్య వచ్చిందని, అందువల్ల మిషన్‌ పూర్తికాలేదని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ ప్రకటించారు. మోటార్‌ కేసులో ఛాంబర్‌ ప్రెషర్‌ తగ్గిపోవడంతో ఈ వైఫల్యం ఎదురైందన్నారు. ఎన్‌వీఎస్‌-02 వైఫల్యం తర్వాత.. 2025 జనవరి 29న ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 వాహకనౌక ద్వారా సొంత నావిగేషన్‌ వ్యవస్థ కోసం ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో అప్పట్లో ఇదీ నిర్ణీత భూస్థిర కక్ష్యలోకి వెళ్లలేదు. ప్రస్తుతం అది వృత్తాకార కక్ష్యలో నుంచి పనిచేస్తోంది. దాని నుంచి తేరుకుని సరిహద్దుల భద్రత కోసం ఈఓఎస్‌-09 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాలని ముందుకెళ్లిన శాస్త్రవేత్తలకు మళ్లీ నిరాశే మిగిలింది. 

Current Affairs

ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ దినోత్సవం

ఇంటర్నెట్, ఇతర సమాచార సాధనాల ఉపయోగాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా మే 17న ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్నే ‘వరల్డ్‌ టెలీకమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సొసైటీ డే’ అని కూడా అంటారు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో డిజిటల్‌ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. టెలీకమ్యూనికేషన్, సమాచార వ్యవస్థలు ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు అందించే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 1850 దశకంలో ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్‌ల వినియోగం ఊపందుకుంది. దీంతో దేశాల మధ్య టెలిగ్రాఫ్‌ సేవలను సరళీకృతం చేసి, ఒప్పందాలు కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో 1865, మే 17న యూరప్‌కు చెందిన 20 దేశాల ప్రతినిధులు పారిస్‌లో సమావేశమయ్యారు. అందులో అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ యూనియన్‌ (ఐటీయూ) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 1934లో దీని పేరును ఇంటర్నేషనల్‌ టెలీకమ్యూనికేషన్‌ యూనియన్‌గా మార్చారు. 1947 నుంచి ఇది యూఎన్‌ఓకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఐటీయూ ఏర్పాటుకు గుర్తుగా 1969 నుంచి ఏటా మే 17న ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2025 నినాదం: Gender equality in digital transformation

Current Affairs

అమెరికా ఎంఏహెచ్‌ఏ సలహాదారుగా అసీమ్‌ మల్హోత్ర

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానమైన ‘మేక్‌ అమెరికా హెల్తీ ఎగైన్‌ (ఎంఏహెచ్‌ఏ)’కు బ్రిటన్‌కు చెందిన భారత సంతతి కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అసీమ్‌ మల్హోత్ర సలహాదారుగా నియమితులయ్యారు. ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీలో 2001లో వైద్య పట్టా పొందిన ఈయన.. 2013లో అదే వర్సిటీలో సీసీటీ కార్డియాలజీ పూర్తి చేశారు.  ఇప్పుడు ఎంఏహెచ్‌ఏకు సలహాదారుగా నియమితులవడంతో అమెరికాలో ఆహార మార్గదర్శకాలను సవరించడం, ఎక్కువగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తగ్గించడం, ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌ వ్యాక్సిన్లపై తాత్కాలిక నిషేధం విధించడానికి ఒత్తిడి తేవడం లాంటి వాటిపై ఆయన పనిచేయనున్నారు.

Current Affairs

ప్రపంచంలోనే తొలి ఏఐ క్లినిక్‌

కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రోగులను పరీక్షించే  క్లినిక్‌ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామ్యం ద్వారా అల్‌మూసా హెల్త్‌ గ్రూప్‌ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సౌదీలోని అల్‌ అహ్సా ప్రావిన్స్‌లో ఇది ఏర్పాటైంది. రోగులతో తొలుత సంభాషించి, వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి వైద్యులను తప్పించడం దీని ఉద్దేశం.  ఏఐ వైద్య వ్యవస్థకు ‘డాక్టర్‌ హువా’ అని పేరుపెట్టారు. క్లినిక్‌కు వచ్చాక.. ఒక ట్యాబ్‌ సాయంతో ఏఐకి తమ వ్యాధి లక్షణాలను రోగి వివరించాలి. వెంటనే అది మరిన్ని ప్రశ్నలు సంధిస్తుంది. మానవ సహాయకుల సాయంతో సేకరించిన డేటాను, చిత్రాలను విశ్లేషిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే డాక్టర్‌ హువా ఒక చికిత్స ప్రణాళికను అందిస్తుంది. దీన్ని వైద్యుడు కూలంకషంగా సమీక్షించి, సంతకం చేస్తారు. అయితే ఏఐ పరిశీలించలేని అత్యవసర కేసుల కోసం వైద్యులు అందుబాటులో ఉంటారు.

Current Affairs

International Museum Day

♦ International Museum Day is observed every year on May 18 to highlight the vital role of museums in cultural exchange, education, and societal development. ♦ Established in 1977 by the International Council of Museums (ICOM), IMD fosters global awareness of museums as hubs for preserving heritage and promoting peace. ♦ At the 1977 ICOM General Assembly in Moscow, Russia, this served as the impetus for the official creation of IMD. The first IMD was celebrated on May 18, 1978, across 22 countries ♦ 2025 theme: ‘The Future of Museums in Rapidly Changing Communities’.