Posts

Current Affairs

ది లాన్సెట్‌’ జర్నల్‌

2023 నాటికి- బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 101 కోట్లుగా ఉందని ఒక అధ్యయనం తెలిపింది. సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింస (ఐపీవీ)కు గురైన మహిళల సంఖ్య 60.8 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. 2023 నాటికి 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసుకు చేరుకున్నవారి పరిస్థితినే ఈ అధ్యయనంలో విశ్లేషించినట్లు పేర్కొంది. ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి. వాటి ప్రకారం- లైంగిక వేధింపులు, ఐపీవీకి సంబంధించిన ఘటనలు సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. భారత్‌లో మహిళల్లో 30% మంది, పురుషుల్లో 13% మంది బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. మహిళల్లో 23% మంది సన్నిహిత భాగస్వామి చేతుల్లో హింసకు గురయ్యారు. 

Current Affairs

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

జూనియర్‌ హకీ ప్రపంచకప్‌లో భారత జట్టు కాంస్యం నెగ్గింది. 2025, డిసెంబరు 10న ఆతిథ్య జట్టు అర్జెంటీనాను 4-2తో ఓడించి మూడో స్థానం సాధించింది. సెమీస్‌లో భారత్‌ను ఓడించిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ.. ఫైనల్లో విజయం సాధించింది. ఆ జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో 1-1తో సమమైన ఫైనల్లో జర్మనీ షూటౌట్‌లో 3-2తో స్పెయిన్‌ను ఓడించింది.

Current Affairs

2025-26లో భారత వృద్ధి 7.2%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన 6.5 శాతాన్ని గణనీయంగా పెంచింది. ద్రవ్యోల్బణ అంచనాను కూడా 3.1% నుంచి 2.6 శాతానికి ఏడీబీ సవరించింది. ఇటీవలి జీఎస్‌టీ రేట్ల కోతలు.. దేశీయ వినియోగం, వృద్ధికి మద్దతు ఇస్తాయని తెలిపింది. 

Current Affairs

దీపావళికి యునెస్కో గుర్తింపు

యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో దీపావళి పండగను చేర్చారు. దిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో 2025, డిసెంబరు 10న ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లయింది. వీటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్‌లోని గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్‌లీల సంప్రదాయ ప్రదర్శనలున్నాయి. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు వెల్లడించారు.

Internship

డీఆర్‌డీఓ ఎస్‌ఏజీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

న్యూదిల్లీలోని డీఆర్‌డీవో- సైంటిఫిక్‌ అనాలసిస్‌ గ్రూప్‌ (ఎన్‌ఏజీ) ఆరు నెలల కాలానికి యూజీ, పీజీ ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 30 వివరాలు: అర్హత: బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ విభాగాలు: సీఎస్‌/ఏఐ/ఐఎస్‌ఈ/సైబర్‌ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్‌/ ఈసీఈ/ఈఐఈ, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు. అర్హత: సంబంధిత విభాగాల్లో చివరి ఏడాది బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ అర్హత ఉండాలి. స్టైపెండ్‌: నెలకు 5,000 చొప్పున ఆరు నెలలకు మొత్తం రూ.30,000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ (saghr.sag@gov.in) ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 19.12.2025. Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies 

Government Jobs

ఎన్టీపీసీ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ (ఐబీడీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ (కంబైన్డ్‌ సైకిల్ పవర్‌ ప్లాంట్‌-ఓ అండ్ ఎం): 15 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్‌/ఇనుస్ట్రుమెంటేషన్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు.  జీతం: నెలకు రూ.90,000.  దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/సీబీటీ, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 24.  Website:https://careers.ntpc.co.in/recruitment/

Government Jobs

ఐఐబీఎఫ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐబీఎఫ్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: జూనియర్ ఎగ్జిక్యూటివ్‌: 10 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంకామ్‌, ఎంఏ, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 నవంబర్ 1వ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.40,400 - రూ.1,30,400. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.700 + జీఎస్‌టీ. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 13. Website:https://www.iibf.org.in/

Apprenticeship

రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

పంజాబ్‌ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) యాక్ట్ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికషన్‌ విడుదల చేసింది.  వివరాలు: యాక్ట్ అప్రెంటిస్: 550 ఖాళీలు (యూఆర్‌-275; ఎస్సీ-85; ఎస్టీ-42; ఓబీసీ-148) ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, మోటర్‌ వెహికిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌. అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 07-01-2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-01-2026. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 09-01-2026. Website:https://rcf.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,296,640

Apprenticeship

హెచ్‌ఏల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏల్‌) గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 55 వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌(టెక్నికల్) అప్రెంటిస్‌: 29 2. గ్రాడ్యుయేట్‌(నాన్‌-టెక్నికల్) అప్రెంటిస్‌: 25 3. డిప్లొమా అప్రెంటిస్‌: 01 విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్‌, కెమికల్, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌, బీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, నర్సింగ్ అసిస్టెంట్‌ అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ (టెక్నికల్ & నాన్‌టెక్నికల్‌) అప్రెంటిస్‌కు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్‌ 15, 17. వేదిక: హాల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ డివిజన్‌ నాసిక్‌ మెయిన్‌ గేట్‌. Website:https://www.hal-india.co.in/home

Internship

Internship Posts In DRDO-SAG

DRDO-Scientific Analysis Group (SAG) in New Delhi invites applications for internship posts for UG, PG Engineering and Science students for a period of six months.  No. of Posts: 30 Details: Departments: CS/AI/ISE/Cybersecurity, Electronics/ECE/EIE, Physics, Mathematics/Statistics. Duration of Internship: 6 months. Qualification: Final year BE/B.Tech, ME/M.Tech, M.Sc qualification in the relevant disciplines. Stipend: Per month Rs.5,000.  Selection Process: Based on marks in educational qualifications, interview, etc. Application Process: Through Email (saghr.sag@gov.in). Last Date of Application: 19.12.2025. Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies