Posts

Current Affairs

లోకాయుక్తగా జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి

తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అడవెల్లి రాజశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం 2025, ఏప్రిల్‌ 11న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఉపలోకాయుక్తగా జిల్లా, సెషన్స్‌ మాజీ జడ్జి బీఎస్‌ జగ్‌జీవన్‌కుమార్‌ను నియమించింది. రాజశేఖర్‌రెడ్డి 1960 మే 4న నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సిర్సంగండ్ల గ్రామంలో జన్మించారు. 

Current Affairs

నీతి ఆయోగ్‌ నివేదిక

‘ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ: పవరింగ్‌ ఇండియాస్‌ పార్టిసిపేషన్‌ ఇన్‌ గ్లోబల్‌ వేల్యూ చైన్స్‌’ పేరిట నివేదికను నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బెరీ 2025, ఏప్రిల్‌ 11న ఆవిష్కరించారు. 145 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12.47 లక్షల కోట్ల) దిశగా వాహన విడిభాగాల తయారీ వృద్ధి చెందుతోందని, 2030 కల్లా ఈ విభాగ ఎగుమతులు 20 బి. డాలర్ల నుంచి 60 బిలియన్‌ డాలర్లకు చేరతాయని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ వృద్ధి కారణంగా 25 లక్షల మందికి కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని.. మొత్తం మీద ఈ రంగంలో ప్రత్యక్ష ఉద్యోగాలు 30-40 లక్షలకు చేరతాయని తెలిపింది. 

Current Affairs

ఆస్కార్‌ పురస్కారాల్లో కొత్త విభాగం

సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల్లో కొత్త కేటగిరీ ‘అచీవ్‌మెంట్‌ ఇన్‌ స్టంట్‌ డిజైన్‌’ని ప్రవేశపెడుతున్నట్లు అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ సైన్సెస్‌ సంస్థ ప్రకటించింది. స్టంట్‌ వర్క్‌ను ఫిల్మ్‌ మేకింగ్‌లో భాగంగా గుర్తించి, తెరవెనుక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2027లో విడుదలయ్యే చిత్రాలను ‘స్టంట్‌ డిజైన్‌’ ఆస్కార్‌ పురస్కారం వరించనుంది.

Current Affairs

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ రెండో స్థానం సాధించింది. 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలు కైవసం చేసుకుంది. సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా (మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌), రుద్రాంక్ష్ పాటిల్‌ (పురుషుల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌), సురుచి (మహిళల 10 మీ ఎయిర్‌ పిస్టల్‌), విజయ్‌వీర్‌ సిద్ధూ (పురుషుల 25 మీ ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌) భారత్‌కు బంగారు పతకాలు అందించారు. 11 పతకాలతో చైనా (5 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది.

Current Affairs

వినీత్‌జోషి

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషికి యూజీసీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు 2025, ఏప్రిల్‌ 11న జారీచేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న తెలంగాణకు చెందిన మామిడాల జగదీశ్‌కుమార్‌ ఏప్రిల్‌ 7న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత నియామకం జరిగింది. పూర్తిస్థాయి ఛైర్మన్‌ నియమాకం జరిగే వరకు వినీత్‌జోషి.. యూజీసీ బాధ్యతలను అదనంగా చూస్తారు.

Current Affairs

సియర్రా లియోన్‌కు భారత్‌ సహాయం

వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్‌కు భారత్‌ రూ.8.52 కోట్ల (9,90,000 డాలర్లు) ఆర్థిక సహాయాన్ని అందించనుంది. తమ దేశంలో వికలాంగులకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం కోసం సియర్రా లియోన్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా భారత్‌ తాజా సహాయం అందించనుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) పేర్కొంది.  2017లో భారత ప్రభుత్వం స్థాపించిన ‘ఇండియా-ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ ఫండ్‌’ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పలు ప్రాజెక్టులకు మద్దతును ప్రకటిస్తోంది. ఆయా దేశాలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతోంది. 

Current Affairs

దీర్ఘశ్రేణి గ్లైడ్‌ బాంబు పరీక్షలు విజయవంతం

దీర్ఘశ్రేణి గ్లైడ్‌ బాంబు ‘గౌరవ్‌’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ 2025, ఏప్రిల్‌ 11న పేర్కొంది. వెయ్యి కిలోల తరగతికి చెందిన ఈ అస్త్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. తాజా పరీక్షల్లో భాగంగా ఈ బాంబును సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధవిమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడిచారు. నిర్దేశిత 100 కిలోమీటర్ల పరిధిని అది అత్యంత కచ్చితత్వంతో సాధించగలిగింది. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ అస్త్రాన్ని భారత వైమానిక దళంలో చేర్చడానికి మార్గం సుగమమైంది. 

Government Jobs

రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీర్‌ పోస్టులు

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 11 వివరాలు: 1. ఇంజినీర్‌-ఎ(ఎలక్ట్రానిక్స్‌): 03 2. ఇంజినీర్‌-ఎ(ఫోటినిక్స్‌): 02 3. ఇంజినీర్‌ అసిస్టెంట్-సి(సివిల్): 01 4. అసిస్టెంట్: 04 5. అసిస్టెంట్‌ క్యాంటీన్‌ మేనేజర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 మే 14వ తేదీ నాటికి ఇంజినీర్‌కు 35 ఏళ్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, అసిస్టెంట్ క్యాంటీన్‌ మేనేజర్‌కు 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 14. Website:https://www.rri.res.in/careers/other-openings

Government Jobs

నేషనల్ హైవేస్ అథారిటీలో ఎక్స్‌పర్ట్స్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా- డీపీఆర్‌సెల్‌ ఆఫ్‌ ఎన్‌హెచ్‌ఏఐలో (ఎన్‌హెచ్‌ఏఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 26. వివరాలు: 1. ప్రిన్సిపల్‌ డీపీఆర్‌ ఎక్స్‌పర్ట్‌- 04 2. డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌- సీనియర్‌ హైవే ఎక్స్‌పర్ట్‌- 04 3. రోడ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌- 04 4. ట్రాఫిక్‌ ఎక్స్‌పర్ట్‌- 05 5. ఎన్పిరాన్మెంట్‌/ ఫారెస్ట్‌ స్పెషలిస్ట్‌- 05 6. ల్యాండ్‌ ఆక్వీజిషన్‌ ఎక్స్‌పర్ట్- 04 అర్హత: గ్రాడ్యుయేషన్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌) లేదా తత్సమానం, పీజీ, పీహెచ్‌డీ విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2025. Website:https://nhai.gov.in/#/

Government Jobs

హెచ్‌ఏఎల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 98 వివరాలు: 1. డిప్లొమా టెక్నీషియన్‌(మెకానికల్‌): 20 2. డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌): 26 3. ఆపరేటర్‌(ఫిట్టర్‌): 34 4. ఆపరేటర్‌(ఎలక్ట్రీషీయన్‌): 14 5. ఆపరేటర్‌(మెషనిస్ట్‌): 03 6. ఆపరేటర్‌(షీట్‌ మెటల్ వర్కర్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 మార్చి 31వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.47,868, ఆపరేటర్‌కు రూ.45,852. ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 18. Website:https://www.hal-india.co.in/home