దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో పోస్టులు
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్బీ) వివిధ విభాగాలలో మొత్తం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ & లగ్జరీ టాక్సెస్ డిపార్ట్మెంట్, లేబర్, డ్రగ్స్ కంట్రోల్, ఆర్బన్ డెవెలప్మెంట్, ఎన్సీసీ లాంటి విభాగాల్లో ఉన్నాయి. వివరాలు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 714 పోస్టులు విభాగాలు: ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ & లగ్జరీ టాక్సెస్ డిపార్ట్మెంట్, లేబర్, డ్రగ్స్ కంట్రోల్, ఆర్బన్ డెవెలప్మెంట్, ఎన్సీసీ, రిజిస్ట్రర్ కోఆపరేటివ్ సొసైటీస్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్, ఆఫీస్ ఆఫ్ ది లోకాయుక్తా, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, సాహిత్య కళా పరిషత్, తదితరాలు. అర్హత: మెట్రిక్యులేషన్/ 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 18- 27 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది. జీతం: నెలకు రూ.18,000- రూ.56,900. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత (టైర్-1) పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. పరీక్ష విధానం: జనరల్ అవేర్నెస్, రిజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ల నుంచి 200 అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ/ఎస్టీ/మహిళలు, దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 15.01.2026. Website:https://dsssb.delhi.gov.in/