ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్
ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫార్సులను సూచించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024, నవంబరు 15న విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిషన్ విధులివే...: జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమకాలీన సమాచారం, జనాభా గణన పరిగణనలోకి తీసుకోవడం. తద్వారా ఎస్సీల్లోని ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయడం. షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి అధ్యయనాలు చేయడం. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టిపెట్టడం.