Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.

Posts

Current Affairs

వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌

అమెరికా అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధ (వైట్‌హౌస్‌) తదుపరి ప్రెస్‌ సెక్రటరీగా కరొలైన్‌ లెవిట్‌ (27)ను ఎంపిక చేశారు. 2025, జనవరి 20న ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. అమెరికన్‌ రచయిత అయిన లెవిట్‌ ఇటీవలి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ బృందానికి నేషనల్‌ ప్రెస్‌ సెక్రటరీగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషించారు. ట్రంప్‌ మొదటి దఫా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరొలైన్‌ లెవిట్‌ శ్వేతసౌధ అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. 

Current Affairs

దేశంలోనే తొలి ‘మహిళా’ బస్‌ డిపో

దేశంలోనే తొలి ‘మహిళా’ బస్‌ డిపోను దిల్లీలో 2024, నవంబరు 16న ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ ప్రారంభించారు. సరోజినీ నగర్‌లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి ‘సఖి డిపో’ అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని.. దీని కోసం మొత్తం 225 మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. 

Current Affairs

భారత వృద్ధి 7.2%

2024లో భారతదేశ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అదేవిధంగా  2025లో 6.6%, 2026లో 6.5% చొప్పున వృద్ధి ఉండొచ్చని మూడీస్‌ పేర్కొంది. స్వల్పకాలంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్త పెరిగినా.. రాబోయే నెలల్లో ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా అది పయనించగలదని మూడీస్‌ పేర్కొంది. 

Current Affairs

గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్లో షాంగై అగ్రస్థానం

ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను వెదజల్లుతున్న నగరాల్లో షాంగై ముందుందని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘క్లైమేట్‌ ట్రేస్‌’ సంస్థ వెల్లడించింది. షాంగై దాదాపు 256 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌హౌస్‌ వాయువులను వాతావరణంలోకి వదులుతోందని పేర్కొంది. తర్వాతి స్థానాల్లో టోక్యో (250 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు), న్యూయార్క్‌ (160 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు), హ్యూస్టన్‌ (150 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు) నగరాలు ఉన్నాయి.    అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న ‘కాప్‌ 29’ సదస్సులో 2024. నవంబరు 15న  ‘క్లైమేట్‌ ట్రేస్‌’ ఈ వ్యాఖ్యలు చేసింది.

Current Affairs

శ్రీలంక పార్లమెంటూ ఎన్‌పీపీదే

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సారథ్యంలోని నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) పార్టీ అఖండ విజయం సాధించింది. 225 సీట్లు ఉన్న పార్లమెంటులో 159 స్థానాల్లో ఎన్‌పీపీ విజయం సాధించిందని 2024, నవంబరు 15న ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీ 68 లక్షలకుపైగా (61 శాతం) ఓట్లు సాధించింది. సాజిత్‌ ప్రేమదాస నేతృత్వంలోని సమజి జన బలవేగయ పార్టీ 40 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Current Affairs

అమెరికా ఆరోగ్య మంత్రిగా కెన్నడీ జూనియర్‌

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ నూతనంగా ఏర్పాటుకాబోయే తన ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ను నామినేట్‌ చేయనున్నట్లు 2024, నవంబరు 15న ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సెనెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడిగా, న్యాయవాదిగా కెన్నడీ జూనియర్‌ సుపరిచితులు. మాజీ అటార్నీ జనరల్‌ రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ కుమారుడీయన. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీకి సమీప బంధువు.

Current Affairs

Union Minister for Youth Affairs & Sports,

♦ Union Minister for Youth Affairs & Sports, Dr. Mansukh Mandaviya has launched the ‘Know Your Medicine (KYM)’ app. ♦ This innovative tool aims to empower athletes with critical information, helping them avoid inadvertent doping and maintain fair play. ♦ This is part of a nationwide initiative to combat doping in sports.  ♦ The KYM app is part of National Anti-Doping Agency (NADA) India’s broader mission to raise anti-doping awareness and education, equipping athletes with essential information to stay clean. ♦ The app allows users to easily verify whether a specific medicine or its ingredients contain any substances listed as prohibited by the World Anti-Doping Agency (WADA).

Current Affairs

External Affairs Minister Dr. S. Jaishankar

♦ External Affairs Minister Dr. S. Jaishankar inaugurated Symbiosis International University’s first overseas campus at Dubai Knowledge Park. ♦ The campus will offer comprehensive programs in management, technology, and media, focusing on developing 21st-century skills while promoting collaboration aligned with the philosophy of “Vasudhaiva Kutumbakam”—“the world is one family.” ♦ This development further strengthens the educational cooperation between the two nations, already benefiting over 300,000 students through various Indian educational frameworks in the UAE. ♦ The campus establishment builds upon the momentum of bilateral relations initiated by Prime Minister Modi’s 2015 visit and the subsequent Comprehensive Economic Partnership Agreement (CEPA).

Current Affairs

According to the USA's Climate Trace organization

♦ According to the USA's Climate Trace organization, Shanghai tops the list of most polluting cities in the world. ♦ It emits 256 million metric tons of greenhouse gases. Tokyo (250 million metric tons), New York (160 million metric tons), and Houston (250 million metric tons) is ranked 2nd, 3rd, and 4th respectively. The data was compiled by using advanced observations and artificial intelligence. ♦ China, India, Iran, Indonesia and Russia had the biggest increases in emissions from 2022 to 2023, while Venezuela, Japan, Germany, the United Kingdom and the United States had the biggest decreases in pollution. ♦ Earth’s total greenhouse gas emissions rose to 61.2 billion metric tons in 2023, a 0.7% increase from the previous year.

Current Affairs

President-elect Donald Trump

♦ President-elect Donald Trump has nominated Robert F. Kennedy Jr., to lead the Department of Health and Human Services on 15 November 2024. ♦ If confirmed, Kennedy would oversee major agencies including the Centers for Disease Control and Prevention, the National Institutes of Health, the Centers for Medicare and Medicaid Services, and the Food and Drug Administration.