Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Asian Development Bank (ADB)

♦ India and the Asian Development Bank (ADB) on 15 December 2025 signed loan agreements worth over $2.2 billion to support five major development projects spanning skilling, renewable energy, healthcare, urban transport and sustainable livelihoods across multiple states. The agreements were finalised under the guidance of the Department of Economic Affairs, Ministry of Finance.  ♦ The loan documents were signed by Deputy Secretary Saurabh Singh on behalf of the Government of India and by Aarti Mehra, Officer-in-Charge and Deputy Country Director of the ADB India Resident Mission, on behalf of the multilateral lender. ♦ The financing package includes support for the Pradhan Mantri Skilling and Employability Transformation through Upgraded Industrial Training Institutes Programme ($846 million), Accelerating Affordable and Inclusive Rooftop Solar Systems Development Programme – Subprogramme 1 ($650 million), Assam State Tertiary Health Care Augmentation Project ($398.8 million), Chennai Metro Rail Investment Project – Tranche 2 ($240 million), and the Integrated Ecotourism and Sustainable Agri-based Livelihood Development in Meghalaya Project ($77 million). ♦ The skilling programme aims to create a future-ready workforce by modernising 650 Industrial Training Institutes across 12 states and upgrading five National Skill Training Institutes into centres of excellence. The initiative is expected to improve employability for at least 1.3 million youth by offering demand-driven courses in high-growth sectors such as renewable energy, electric mobility and advanced manufacturing.

Current Affairs

చిలీ అధ్యక్షుడిగా ఆంటోనియో

చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష మధ్యేవాద సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోయింది. అతిమితవాద నాయకుడు హోసే ఆంటోనియో కాస్ట్‌ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. కమ్యూనిస్టు అభ్యర్థి, మాజీ మంత్రి జీనెట్‌ జారాను కాస్ట్‌ ఓడించారు. చిలీలో 35 ఏళ్లపాటు వర్థిల్లుతున్న ప్రజాస్వామ్యాన్ని వెనక్కునెట్టి అతిమితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు.  కాస్ట్‌కు 58.2 శాతం ఓట్లు రాగా, జారాకు 41.8 శాతం ఓట్లు వచ్చాయి. 

Current Affairs

మానవ రహిత వైమానిక వాహనాలు

భారత రక్షణ దళాల కోసం 6 అత్యాధునిక మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీ)ను, హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రఘు వంశీ ఏరోస్పేస్‌ అనుబంధ డీప్‌టెక్‌ బ్రాండ్‌ ఆర్రోబోట్‌ ఆవిష్కరించింది. వీటిలో ఆర్‌వీ అస్త్ర, ఆర్‌వీ మాయ, ఆర్‌వీ లక్ష్య, ఆర్‌వీ రుద్ర, ఆర్‌వీ ఇంద్ర, ఆర్‌వీ యోధ, ఆర్‌వీ దృష్టి ఉన్నాయి. నిఘా, దాడి, యుద్ధభూమి లాజిస్టిక్స్, బలగాలకు మద్దతు వంటి అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి. పౌర అవసరాల కోసమూ వీటిని వినియోగించుకోవచ్చు. కొన్ని 300 కిలోమీటర్లు, మరికొన్ని అంతకు మించీ ప్రయాణించగలవు. 

Current Affairs

ఈ ఏటి మాటగా ‘స్లాప్‌’

కృత్రిమ మేధ విస్తృత ప్రచారం కల్పించిన ‘స్లాప్‌’ మాటను మరియం-వెబ్‌స్టర్‌ నిఘంటు సంస్థ ఈ సంవత్సరపు (2025) మేటి మాటగా గుర్తింపునిచ్చింది. జుగుప్సాకరమైన, మూర్ఖత్వంతో కూడుకున్న, తప్పుడు డిజిటల్‌ సమాచారాన్ని ఆన్‌లైన్‌ జగతిలో ‘‘స్లాప్‌’’ అని పిలవడం పరిపాటి అయింది.  ‘ఇదో చక్కటి వర్ణణాత్మక పదం’ అని మరియం వెబ్‌స్టర్‌ సంస్థ అధ్యక్షుడు గ్రెగ్‌ బార్లో 2025, డిసెంబరు 15న వెల్లడించారు. స్లాప్‌ అనే మాటను 1700 సంవత్సర ప్రాంతంలో మెత్తటి బురదను అభివర్ణించడానికి తొలుత వాడారు. 

Current Affairs

ఎస్‌బీఐ ఎండీగా రవి రంజన్‌

ఎస్‌బీఐ నూతన మేనేజింగ్‌ డైరెక్టరుగా రవి రంజన్‌ను ప్రభుత్వం 2025, డిసెంబరు 15న నియమించింది. ఆయన ఇప్పటివరకు డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 2025 నవంబరు 30న పదవీ విరమణ చేసిన వినయ్‌ స్థానంలో రవి బాధ్యతలు స్వీకరించారు. 2028 సెప్టెంబరు 30 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

Current Affairs

సీఐసీగా రాజ్‌కుమార్‌ గోయల్‌ ప్రమాణం

సమాచార ప్రధాన కమిషనర్‌ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్‌ అధికారి, న్యాయశాఖ మాజీ కార్యదర్శి రాజ్‌కుమార్‌ గోయల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, డిసెంబరు 15న రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు.  అనంతరం 8 మంది నూతన సమాచార కమిషనర్లతో రాజ్‌కుమార్‌ గోయల్‌ కమిషన్‌ కార్యాలయంలో ప్రమాణం చేయించారు.  తాజా నియామకాలతో దాదాపు 9 ఏళ్ల తర్వాత కేంద్ర సమాచార కమిషన్‌లో పోస్టులన్నీ పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి.

Current Affairs

జోర్డాన్‌ రాజుతో ప్రధాని మోదీ భేటీ

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా 2025, డిసెంబరు 15న జోర్డాన్‌ చేరుకున్నారు. దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్‌ అల్‌ హుసేన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చర్చించారు. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్‌ సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ నొక్కిచెప్పారు.  భారత్‌-జోర్డాన్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక పర్యటన కోసం జోర్డాన్‌కు రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి. 

Internship

బడ్డింగ్‌ మారినర్స్‌లో కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

బడ్డింగ్‌ మారినర్స్‌లో కంపెనీ కెమిస్ట్రీ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: బడ్డింగ్‌ మారినర్స్‌  పోస్టు పేరు: కెమిస్ట్రీ టీచింగ్‌   నైపుణ్యం: కెమిస్ట్రీ, కొలాబరేషన్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్, మెటీరియల్‌ సోర్సింగ్, టీచింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.1,500- రూ.2,000. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 03-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-chemistry-teaching-internship-at-budding-mariners1764821700

Internship

ఇన్‌అమింగోస్‌ ఫౌండేషన్ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

ఇన్‌అమింగోస్‌ ఫౌండేషన్ గ్రాఫీక్‌ డిజైన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఇన్‌అమింగోస్‌ ఫౌండేషన్ పోస్టు పేరు: గ్రాఫీక్‌ డిజైన్  నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌ వీడియో ఎడిటింగ్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.4,500- రూ.6,500. వ్యవధి: 2 వారాలు  దరఖాస్తు గడువు: 07-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-graphic-design-internship-at-inamigos-foundation1765167991

Government Jobs

నైపర్‌లో సివిల్‌ ఇంజినీర్‌ పోస్టులు

పంజాబ్‌ మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. మెకానికల్‌ ఇంజినీర్‌ అండ్‌ టెస్టింగ్‌ ఇన్‌ చార్జ్‌: 01 2. సీనియర్‌ ఇంజినీర్‌: 01 3. జూనియర్‌ అకౌంటెంట్‌: 01 4. ఎస్టెట్‌ అండ్‌ సెక్యూరిటీ సూపర్వైజర్‌: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు మెకానికల్‌ ఇంజినీర్‌, సివిల్‌ ఇంజినీర్‌కు రూ.45,000- 55,000; జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ అకౌంటెంట్‌కు రూ.40,000- 50,000. వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 24-12-2025. Website:https://www.niper.gov.in/