Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేతకు రూ.451 కోట్లు

2026 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. 2022 ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత కప్‌తో పోలిస్తే ఈసారి మొత్తం నగదు బహుమతిని ఫిఫా 48.9 శాతం పెంచింది. 2022 కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ 3971 కోట్లు కాగా.. ఈసారి రూ.5911 కోట్లకు పెరిగింది.  గ్రూప్‌ దశలో పోటీపడే 48 జట్లకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. 

Current Affairs

Ashwini Kumar Tewari

♦ The Central Government has re-appointed Ashwini Kumar Tewari as Managing Director in State Bank of India (SBI). It extends beyond his currently notified term, which ends on January 27, 2026, till the date of his superannuation—December 31, 2027—or until further orders, whichever is earlier, according to a notification by the Department of Financial Services, Ministry of Finance. ♦ Tewari started his career in the SBI as a probationary officer in 1991, was elevated by the Government as MD (from deputy MD) in January 2021 for three years with effect from the date of assumption of office, or until further orders, whichever is earlier. Thereafter, his tenure was extended by two years, beyond January 27, 2024.

Current Affairs

Artificial Intelligence (AI)

♦ India has launched its first Artificial Intelligence (AI)-driven community screening programme for diabetic retinopathy (DR). The initiative has been launched by the Armed Forces Medical Services (AFMS) in collaboration with the Dr. Rajendra Prasad Centre for Ophthalmic Sciences (RPC), AIIMS, and the eHealth AI Unit of the Ministry of Health. ♦ Trained medical officers, nursing staff and healthcare assistants will conduct screenings using MadhuNetrAI, a web-based AI tool developed by RPC. The platform facilitates automated screening, grading and triaging of retinal images captured using handheld fundus cameras.

Current Affairs

Pradhan Mantri Matsya Sampada Yojana

♦ India has recorded a significant surge in fish production and aquaculture productivity since the launch of the Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) in 2020. With total fish production rising from around 141.6 lakh tonnes in 2019–20 to an estimated 197.75 lakh tonnes in 2024–25, marking a 38% growth. ♦ The increase has been driven by inland aquaculture expansion, marine fisheries development, strengthened value-chain infrastructure, and policy interventions under PMMSY.   ♦ India’s average aquaculture productivity also improved to 4.7 tonnes per hectare in 2025, up from 3 tonnes per hectare before the scheme. ♦ The fisheries sector’s Gross Value Added (GVA) reached Rs. 3,68,124 crore in 2023–24, compared with Rs. 2,12,087 crore in 2018–19, with its share in agriculture rising from 7% to 7.55%. Fish and fishery product exports grew 33.7%, from Rs. 46,662.85 crore in 2019–20 to Rs. 62,408.45 crore in 2024–25. ♦ The information was provided by Rajeev Ranjan Singh (Lallan Singh), Minister of Fisheries, Animal Husbandry and Dairying, in Lok Sabha on 17 December 2025. 

Current Affairs

Narendra Modi

♦ Prime Minister Narendra Modi met Oman’s Deputy Prime Minister for Defence Affairs, Sayyid Shihab bin Tarik Al Said on 17 December 2025, marking the beginning of his official engagements in the Sultanate. ♦ The visit holds particular significance as India and Oman share a comprehensive strategic partnership rooted in centuries-old historical links, longstanding trade relations and strong people-to-people ties. It also coincides with the 70th anniversary of the establishment of diplomatic relations between the two countries and follows the State visit of Sultan Haitham bin Tarik to India in December 2023. ♦ Prime Minister Modi arrived in Oman after completing his maiden visit to Ethiopia, during which India and Ethiopia elevated their relationship to a Strategic Partnership.

Current Affairs

Tripura Agriculture Department

♦ The Tripura Agriculture Department on 17 December 2025 signed a Memorandum of Understanding (MoU) with the Nagpur-based National Bureau of Soil Survey and Land Use Planning (NBSS and LUP). ♦ This is a major step towards enhancing agricultural productivity and achieving self-sufficiency in foodgrain production. The collaboration aims to carry out in-depth research on cultivable land across several districts of the state, paving the way for sustainable farming practices and a stronger agricultural future for Tripura.

Current Affairs

‘హనుమాన్‌’ గవర్నింగ్‌ బాడీ

ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులు, ప్రజల మధ్య సంఘర్షణను నియంత్రించేందుకు అమలు చేయనున్న హీలింగ్‌ అండ్‌ నర్చరింగ్‌ యూనిట్స్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ నర్సింగ్‌ వైల్డ్‌లైఫ్‌ (హనుమాన్‌) ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేసింది. దీనికి ‘ఆంధ్రప్రదేశ్‌ హ్యూమన్‌-వైల్డ్‌లైఫ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ మిటిగేషన్‌ ఫౌండేషన్‌’ అని నామకరణం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఛైర్‌పర్సన్‌గా అటవీ శాఖ కార్యదర్శి, పీసీసీఎఫ్‌ సహా మొత్తం 18 మంది సభ్యులతో ఈ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసింది. సొసైటీల చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే 2025, డిసెంబరు 17న ఉత్తర్వులు జారీ చేశారు.

Current Affairs

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌- హురున్‌ జాబితా

స్వయంకృషితో ఎదిగిన 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్‌ - హురున్‌ ఇండియా ‘టాప్‌ 200 సెల్ఫ్‌ మేడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ద మిలేనియా 2025’ జాబితాను రూపొందించింది. ఇందులో విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేశ్‌ గంగ్వాల్‌ తొలిసారిగా అడుగుపెట్టి, ఏకంగా టాప్‌-10లో నిలిచారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సంస్థ మార్కెట్‌ విలువ 2025లో రూ. 2.2 లక్షల కోట్లకు చేరడంతో, ఈ జాబితాలో వీరు మూడో స్థానం దక్కించుకున్నారు.  ముఖ్యాంశాలు.. జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్‌ వంటి సంస్థలను నిర్వహిస్తున్న ఎటర్నల్‌ మార్కెట్‌ విలువ రూ.3.2 లక్షల కోట్లకు చేరడంతో.. ఈ జాబితా అగ్రస్థానంలో సంస్థ అధిపతి దీపిందర్‌ గోయల్‌ నిలిచారు. 2024లో తొలిస్థానంలో ఉన్న డిమార్ట్‌ మార్కెట్‌ విలువ 13% తగ్గడంతో, ఆ సంస్థ అధినేత దమానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు.  మొత్తం 200 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.42 లక్షల కోట్లుగా నిలిచింది. బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్ల) విలువైన కంపెనీల సంఖ్య 121 నుంచి 128కి చేరింది. 22 కొత్త కంపెనీలు ఈ జాబితాలోకి ఎక్కాయి.

Current Affairs

తారిక్‌ అల్‌ సయిద్‌తో నరేంద్ర మోదీ భేటీ

ఒమన్‌ ఉప ప్రధాని (రక్షణ వ్యవహారాలు) సయ్యిబ్‌ షిహాబ్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సయిద్‌తో 2025, డిసెంబరు 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. మోదీ ఇథియోపియా పర్యటనను ముగించుకొని ఒమన్‌ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్‌-ఒమన్‌ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఓ ఎగ్జిబిషన్‌ను మోదీ తిలకించారు. ఆయన ఒమన్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

Current Affairs

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సీఎండీగా వంశీ రామ్మోహన్‌ బుర్రా

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా వంశీ రామ్మోహన్‌ బుర్రా పేరు ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి (పీఈఎస్‌బీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన అదే సంస్థలో ఫంక్షనల్‌ డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌)గా పనిచేస్తున్నారు. వంశీకి విద్యుత్తు, టెలికాం రంగాల్లో మూడు దశాబ్దాల విస్తృత అనుభవం ఉంది. ఇది వరకు పవర్‌గ్రిడ్‌ టెలిసర్వీసెస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గానూ సేవలందించారు.