యూఐఐసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
చైన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్) మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో గ్యాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 145 వివరాలు: అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 21 - 28 ఏళ్లు. స్టైపెండ్: నెలకు రూ.9000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28 ఏప్రిల్ 2025 Website:https://uiic.co.in/recruitment/details/16691