Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

పెరిగిన జిల్లాల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో రెండు జిల్లాలను చేరుస్తూ 2025, డిసెంబరు 29న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్‌ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.  మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.  

Current Affairs

52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి

సోయజ్‌-2.1బి అనే వాహక నౌక ద్వారా రష్యా 2025, డిసెంబరు 28న ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వోస్టోక్నీ స్పేస్‌పోర్టు నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్‌’ తెలిపింది.  కక్ష్యలో ప్రవేశపెట్టినవాటిలో ఇరాన్‌కు చెందిన మూడు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. 

Current Affairs

నౌకానిర్మాణ పథకాలు

రూ.44,700 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు మార్గదర్శకాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దేశీయ నౌకానిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా షిప్‌బిల్డింగ్‌ ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ స్కీమ్‌ (ఎస్‌బీఎఫ్‌ఏఎస్‌), షిప్‌బిల్డింగ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ (ఎస్‌బీడీఎస్‌)లను ప్రభుత్వం తీసుకొచ్చింది.

Current Affairs

ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో ద్రౌపదీ ముర్ము ప్రయాణం

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు.  2025, డిసెంబరు 28న కర్ణాటకలోని కార్వార నౌకాదళ స్థావరానికి నేవీ యూనిఫాంలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జలాంతర్గామిలో ప్రయాణం ప్రారంభించారు. గంటపాటు ఈ యాత్ర కొనసాగింది.  

Current Affairs

స్మృతి మంధాన

మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 28న శ్రీలంకతో నాలుగో టీ20లో ఆమె 80 పరుగులు చేసింది. 27 పరుగుల వద్ద ఆమె పది వేల పరుగులకు చేరుకుంది.  స్మృతి వన్డేల్లో 5322, టీ20ల్లో 4102, టెస్టుల్లో 629 పరుగులు చేసింది. 

Current Affairs

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌

తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్‌ ఇరిగేశి ఫిడే ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన హంపి.. మూడో స్థానంలో నిలిచింది. అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా (రష్యా)కు స్వర్ణం, జు జినెర్‌ (చైనా)కు రజతం దక్కాయి. ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌లో అయిదు పతకాలు నెగ్గిన తొలి ప్లేయర్‌గా హింపి రికార్డు సాధించింది. ఆమె స్వర్ణం (2019, 2024), రజతం (2023), కాంస్యం (2012, 2025) సాధించారు. 

Walkins

ఎంఎస్‌ఎంఈ విశాఖపట్నంలో ఫ్యాకల్టీ/ ట్రైయినీ పోస్టులు

విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన ట్రైనింగ్‌, ప్రొడక్షన్‌ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టులు: 19. వివరాలు: 1. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (సీఏడీ/ సీఏఎం):02 2. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ మెకానికల్‌ ఇంజినీర్‌- 02 3. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (టూల్‌ డిజైనర్‌- డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌/ షీట్‌ మెటల్‌/ఫారెన్‌/ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌)- 01 4. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ మెకట్రానిక్స్‌ ఇంజినీర్‌- 02 5. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (ఎలక్ట్రానిక్స్‌)- 01 6. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (సీఎన్‌సీ-టర్నింగ్‌/మిల్లింగ్‌)- 01 7. ఫ్యాకల్టీ/ ట్రైనర్‌ (ఎంబెడెడ్‌ ఇంజినీర్‌)- 01 8. పర్చెస్‌ ఇన్‌ చేంజ్‌: 01 9. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌: 01 10. హాస్టల్‌ వార్డెన్‌/కేర్‌ టేకర్‌: 01 11. సీఎన్‌సీ 5 యాక్సిస్‌ మిల్లింగ్‌ ప్రోగ్రామర్‌ కమ్‌ ఆపరేటర్‌- 01 12. సీఎన్‌సీ 3 యాక్సిస్‌ మిల్లింగ్‌ ప్రోగ్రామర్‌ కమ్‌ ఆపరేటర్‌- 02 13. సీఎన్‌సీ టర్నింగ్‌ ప్రోగ్రామర్‌ కమ్‌ ఆపరేటర్‌- 02 14. క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ కమ్‌ సీఎంఎం ఇంజినీర్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ట్రైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు 35 ఏళ్లు; ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. జాబ్‌ లొకేషన్‌: ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌, విశాఖపట్నం. ఇంటర్వ్యూ తేదీలు: 8, 9.01.2026. వేదిక: ఎంఎస్‌ఎంఈ-డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీస్‌ (డీఎఫ్‌ఓ), ఆటోనగర్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌. Website:https://www.msmetcvizag.org/

Internship

గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీలో ఇంటర్న్‌ పోస్టులు

గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ  (జీఈటీ) వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ:  గెమా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ పోస్టు పేరు: వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌  నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), వర్డ్‌ప్రెస్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.1,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 21-01-2026. Website:https://internshala.com/internship/detail/work-from-home-wordpress-development-internship-at-gema-education-technology-private-limited1766410967

Government Jobs

పీజీఐఎంఈఆర్‌లో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన గ్రూప్‌-ఏ, బీ, సీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: గ్రూప్‌-ఏ, బీ, సీ: 59 పోస్టులు అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌, ఫార్మసి, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. వేతనం: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి నెలకు రూ.18,000 - రూ.2.08,700. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేసిడ్ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 1.  ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 16. Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0

Government Jobs

బెల్‌లో ట్రైనీ ఇంజినీర్‌ ఉద్యోగాలు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కొద్వారా యూనిట్‌లో ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 51 వివరాలు: ట్రైనీ ఇంజినీర్‌-1: 50 (ఎలక్ట్రానిక్స్‌: 30; మెకానికల్‌: 17; ఎలక్ట్రికల్‌: 01; సివిల్‌: 02) ట్రైనీ ఆఫీసర్‌-1(ఫైనాన్స్‌): 01 అర్హత: ట్రైనీ ఇంజినీర్‌కు పోస్టుకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజినీరింగ్‌ డిగ్రీ, ట్రైనీ ఆఫీసర్‌కు ఎంబీఏ/ఎంకాం ఉత్తీర్ణత ఉండాలి.  జీతం: నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.35,000; మూడో ఏడాది రూ.40,000. వయోపరిమితి: 28 ఏళ్లు ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.150; ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2026. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 25.01.2026. ఇంటర్వ్యూ వేదిక: భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కొద్వారా, పారీ గర్వాల్‌. Website:https://bel-india.in/