Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

Uttar Pradesh

♦ The Uttar Pradesh government has mandated newspaper reading in all secondary and basic primary schools in the state as a daily activity for students. ♦ This initiative aimed at  developing reading interest, logical thinking, expression skills, and the values of aware citizenship among children.  ♦ At least 10 minutes must be dedicated daily during morning assembly for newspaper reading. ♦ During this time, students will read out key editorials and major news developments from national, international and sports news on a rotational basis. 

Current Affairs

మీరాకు డేమ్‌హుడ్‌ అవార్డు

ప్రముఖ బ్రిటిష్‌ ఇండియన్‌ నటి మీరా సియాల్‌ (64)ను ప్రతిష్ఠాత్మక డేమ్‌హుడ్‌ అవార్డు వరించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్‌లో కింగ్‌ చార్లెస్‌-3 ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. ఈ మేరకు అవార్డు గ్రహీతల జాబితాను 2025, డిసెంబరు 30న లండన్‌లో విడుదల చేశారు. కమెడియన్‌గా, రచయిత్రిగా, ఫిలిం మేకర్‌గా సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇంగ్లాండులో పంజాబీ దంపతులకు జన్మించిన మీరా ‘గుడ్‌నెస్‌ గ్రేషియస్‌ మి’, ‘ది కుమార్స్‌ ఎట్‌ నం.42’ కామెడీ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందారు. ఈమె రచించిన ‘అనిత అండ్‌ మి’ పుస్తకానికి 1997లో  ‘మెంబర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’ (ఎంబీఈ) అవార్డు వచ్చింది. 

Current Affairs

ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఆయనకు ‘ఇజ్రాయెల్‌ ప్రైజ్‌ ఫర్‌ పీస్‌’ను అందజేయనున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన నెతన్యాహు ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో రిసార్టులో ట్రంప్‌తో భేటీ అయ్యారు.  చరిత్రలో ఇప్పటివరకూ విదేశీ నేతలెవరికీ ఇజ్రాయెల్‌ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించలేదు.  

Current Affairs

కామ్యా కార్తికేయన్‌

స్కీయింగ్‌ చేస్తూ దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్‌ (18 ఏళ్లు) ఘనత సాధించారు. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతను, ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్‌ చేసింది. ప్రపంచంలో స్కీయింగ్‌ ద్వారా అక్కడికి చేరుకున్న రెండో అతిపిన్న వయసు మహిళ ఆమే.

Current Affairs

బ్లిట్జ్‌ టోర్నీ

ప్రపంచ ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశి.. బ్లిట్జ్‌ విభాగంలోనూ కంచు పతకం నెగ్గి ‘డబుల్‌’ సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ (2017) తర్వాత ఒకే టోర్నీలో రెండు విభాగాల్లో పతకాలు గెలిచిన ఘనత అర్జున్‌దే. నార్వే స్టార్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ బ్లిట్జ్‌ టోర్నీ ట్రోఫీని దక్కించుకున్నాడు. ఈ టైటిల్‌ గెలవడం అతడికి తొమ్మిదోసారి. మొత్తంగా అతడికిది 20వ ప్రపంచ టైటిల్‌.  మహిళల విభాగంలో బిబిసారా అసుబయెవా (కజకిస్థాన్‌) విజేతగా నిలిచింది. 

Current Affairs

ఖాలిదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా సేవలందించిన బేగం ఖాలిదా జియా (80) 2025, డిసెంబరు 30న ఢాకాలో మరణించారు. ఆమె బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు కూడా. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆమె 1946 ఆగస్టు 15న అవిభాజ్య భారత్‌లోని దినాజ్‌పుర్‌ జిల్లాలో జన్మించారు. 1960లో ఖాలిదా.. సైనిక కెప్టెన్‌ జియావుర్‌ రహ్మాన్‌ను వివాహం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు జియావుర్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 మే 30న సైనిక తిరుగుబాటు సందర్భంగా అధ్యక్షుడు జియావుర్‌ హత్యకు గురయ్యారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1978లో తన భర్త స్థాపించిన బీఎన్‌పీకి ఆయన హత్యానంతరం 1984లో ఛైర్‌పర్సన్‌ అయ్యారు. అప్పటి నుంచి చనిపోయే వరకూ ఆ పదవిలో కొనసాగారు.

Current Affairs

ధ్రువ్‌-ఎన్‌జీ

పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు 2025, డిసెంబరు 30న బెంగళూరులో పౌర హెలికాప్టర్‌ ధ్రువ్‌-ఎన్‌జీ (నెక్స్ట్‌ జనరేషన్‌)ను లాంఛనంగా ప్రారంభించారు. మల్టీరోల్, తేలికపాటి ట్విన్‌ ఇంజిన్‌ వ్యవస్థలున్న ఈ హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్‌ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. పౌర సేవలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర వైద్య సేవలు, ప్రముఖుల ప్రయాణాలు.. ఇలా బహుళ ప్రయోజనాల లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

Current Affairs

‘కౌశలం’

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు వచ్చే నాలుగు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్‌ అగ్రిగేటర్లకు వారధిలా ‘కౌశలం’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి, చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది.

Current Affairs

పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం

దీర్ఘశ్రేణి గైడెడ్‌ రాకెట్‌ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్‌ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి, పూర్తి సత్తాను చాటింది. నిర్దేశించిన రీతిలో గాల్లో విన్యాసాలూ చేసింది. పినాకను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ల్యాబ్‌ తయారుచేసింది.

Current Affairs

5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి

అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్‌లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ.. 2025, డిసెంబరు 29న గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు పయనమైంది. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య తయారీలో మొత్తం పురాతన విధానాలనే అవలంబించారు. లోహాలు, మేకులను ఉపయోగించలేదు. చెక్కలను వాడారు. వీటిని కొబ్బరి పీచుతో తయారుచేసిన తాళ్లతో గుదిగుచ్చారు. అందువల్ల ఈ నౌకను ‘స్టిచ్డ్‌ షిప్‌’గా పిలుస్తున్నారు. సముద్ర ఉప్పునీటి నుంచి రక్షణ కోసం దీనికి సహజసిద్ధ జిగురుపూతను వేశారు. ఈ నౌకలో ఇంజిన్‌ ఉండదు. తెరచాపల సాయంతో ప్రయాణిస్తుంది.