Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

The Telecom Regulatory Authority of India (TRAI)

♦ The Telecom Regulatory Authority of India (TRAI) announced, India crossed 100 crore Internet connections in November 2025. In the last 10 years, the Broadband subscriber base in India has increased by more than six times. There were 131.49 million (13.15 crore) broadband subscribers at the end of November 2015, which grew to 1 billion (100.37 crore) at the end of November 2025, according to the Ministry of Communications. ♦ As per the data, out of 1,070.81 million internet subscribers, the number of Wired Internet subscribers is 44.42 million, and the number of Wireless Internet subscribers is 973.39 million.

Current Affairs

Market Access Support (MAS)

♦ The Government of India launched the Market Access Support (MAS) Intervention under the Export Promotion Mission (EPM), a flagship initiative approved by the Union Cabinet on 12 November 2025. The MAS Intervention is being implemented under the NIRYAT DISHA sub-scheme of EPM and is aimed at strengthening international market access for Indian exporters, particularly MSMEs, first-time exporters and firms from priority sectors. ♦ The Export Promotion Mission is jointly implemented by the Department of Commerce, Ministry of MSME and Ministry of Finance in coordination with Indian Missions abroad, Export Promotion Councils (EPCs), Commodity Boards and other industry associations.  ♦ The MAS Intervention focuses on improving buyer connect and enhancing India’s presence in global markets through structured and outcome-oriented market access interventions.

Current Affairs

సఖీ సురక్ష

పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ‘సఖీ సురక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరాలు, పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 26.53 లక్షల మంది మహిళలను ఉద్దేశించి దీన్ని రూపొందించింది.  తొలి దశలో వీరిలో లక్ష మందికి జీవనశైలి వ్యాధులపై పరీక్షలు చేయించడంతోపాటు వైద్యం అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్పించడం ప్రధాన ఉద్దేశం.

Current Affairs

చైనా అమ్ములపొదిలో అధునాతన యుద్ధనౌక

చైనా తన నౌకాదళంలోకి మరింత మెరుగుపరిచిన మిసైల్‌ డిస్ట్రాయర్‌ను చేర్చింది. టైప్‌ 052డి తరగతికి చెందిన ఈ యుద్ధనౌకకు లౌడీ అని పేరు పెట్టారు. ఇందులో మెరుగైన రాడార్, ఆయుధ, నెట్‌వర్క్‌ వ్యవస్థలు ఉన్నాయి. దీనివల్ల ఇది గగనతల రక్షణ, సాగరంలో దాడి, టాస్క్‌ఫోర్స్‌ కమాండ్‌ లాంటి విధులను నిర్వర్తించగలదు. ఇది లక్షిత యుద్ధనౌకలపై దాడి చేయడంతోపాటు సహచర నౌకలను రక్షించగలదు. చైనా నేవీ సగటున నెలకో కొత్త యుద్ధనౌకను చేర్చుకుంటోంది. అమెరికా నౌకాదళాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం చైనా నౌకాదళంలో 234, అమెరికా నేవీలో 219 చొప్పున యుద్ధనౌకలు ఉన్నాయి. 

Current Affairs

ఎగుమతిదార్లకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ

ఎగుమతిదార్లకు రుణాల లభ్యత మెరుగుపరచడానికి రూ.7,295 కోట్ల ఎగుమతుల తోడ్పాటు ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ సబ్‌వెన్షన్‌ పథకంతో పాటు రూ.2,114 కోట్ల తనఖా తోడ్పాటు కూడా ఉంది. ఈ రెండు పథకాలను, ఆరు సంవత్సరాల (2025-31) కాలవ్యవధిలో అమలు చేయనున్నారు. వీటితో ఎగుమతిదార్ల వాణిజ్య రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  2025 నవంబరులో ఆమోదించిన రూ.25,060 కోట్ల ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ (ఈపీఎం)లో ఇది రెండో భాగం. 

Current Affairs

ఈసీఎంఎస్‌

ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్‌) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన 22 నూతన ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖ 2025, జనవరి 2న తెలిపింది. ఇందువల్ల రూ.2,58,152 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని, 33,791 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. గతంలో రూ.12,704 కోట్ల పెట్టుబడి అంచనాలతో 24 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

Current Affairs

మహిళల హాకీ జట్టు కోచ్‌గా మరైన్‌

భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా షూవర్డ్‌ మరైన్‌ (నెదర్లాండ్స్‌) మళ్లీ నియమితుడయ్యాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు మరైన్‌ కోచ్‌గా ఉన్నాడు. తర్వాత పదవీ కాలం పూర్తవడంతో కోచ్‌గా తప్పుకొన్నాడు. 2025లో హరేంద్ర సింగ్‌ శిక్షణలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో డిసెంబర్‌లో హరేంద్ర తన పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో హాకీ ఇండియా మరోసారి మరైన్‌కు కోచ్‌ బాధ్యతలు అప్పగించింది.

Current Affairs

ఏప్రిల్‌లో ‘వీబీ జీ రామ్‌ జీ’

2026, ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌(గ్రామీణ)’ (వీబీ జీ రామ్‌ జీ) అమలులోకి రానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2026, మార్చి వరకు పాత విధానంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నారు.  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (నరేగా) కేంద్ర ప్రభుత్వం సవరించి కొత్తగా ‘వీబీ జీ రామ్‌ జీ’ని తీసుకొచ్చింది. 

Current Affairs

అంతర్జాతీయ పూల ప్రదర్శన

అహ్మదాబాద్‌లోని సబర్మతీ తీరాన 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీనిని అహ్మదాబాద్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ భారీ ప్రతిమ, అతిపెద్ద వలయాకృత పూల అలంకరణ (మండల)గా రెండు గిన్నిస్‌ రికార్డులు సాధించాయి. 

Internship

పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో పోస్టులు

విజయవాడలో పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌ హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌ హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌  నైపుణ్యాలు: ఎంఎస్‌-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: రూ.5,000 - రూ.7,500. వ్యవధి: 6 నెలలు దరఖాస్తు గడువు: 21-01-2026. Website:https://internshala.com/internship/detail/hr-consultant-internship-in-multiple-locations-at-pinkmoon-technologies1766389659