Posts

Current Affairs

సెబీ చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే

మార్కెట్ల నియంత్రణ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) చీఫ్‌గా తుహిన్‌ కాంత పాండే 2025, ఫిబ్రవరి 27న నియమితులయ్యారు. మూడేళ్ల ఈయన ఈ పదవిలో ఉంటారు. సెబీ ప్రస్తుత ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌ పదవీకాలం పూర్తవుతున్నందున, ఆమె స్థానంలో మార్చి 1న పాండే బాధ్యతలు చేపడతారు.  ప్రస్తుతం పండే ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు. 

Current Affairs

ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జాబితా

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 24 మంది సూపర్‌ బిలియనీర్ల జాబితాను ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ విడుదల చేసింది. సంపద నికర విలువ కనీసం 50 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు) ఉన్న వారిని సూపర్‌ బిలియనీరుగా సంస్థ పరిగణించింది. ఈ 24 మందిలో 16 మంది సెంటి బిలియనీర్ల (100 బిలియన్‌ డాలర్లు/రూ.8.7 లక్షల కోట్ల)ని నివేదిక తెలిపింది. వీరందరి సంపద విలువ కలిపితే 3.3 లక్షల కోట్ల డాలర్లని, ఫ్రాన్స్‌ జీడీపీకి ఇది సమానమని పేర్కొంది.  ఇందులో మనదేశం నుంచి ముకేశ్‌ అంబానీ (90.6 బి.డాలర్లు), గౌతమ్‌ అదానీ (60.6 బి.డాలర్లు)కి చోటు దక్కింది. 

Current Affairs

హిందీ ప్రాజెక్టు పొడిగింపుపై ఒప్పందం

ఐక్యరాజ్య సమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతోపాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగింపుపై మరోసారి ఒప్పందం కుదిరింది. దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి పి.హరీశ్, సంస్థ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ మెలిసా ఫ్లెమింగ్‌ 2025, ఫిబ్రవరి 27న సంతకాలు చేశారు.  ఈ ఒప్పందం 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2030 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. 

Current Affairs

జపాన్‌లో జననాల రేటు తగ్గుముఖం

జపాన్‌లో వరుసగా 9వ ఏడాదీ జననాల రేటు తగ్గింది. తాజాగా 2024లో జననాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే మరో 5 శాతం పతనమై 7,20,988గా నమోదయ్యాయి. 1899 తర్వాత జపాన్‌లో ఇంత తక్కువగా జననాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ 2025, ఫిబ్రవరి 27న వెల్లడించింది.  జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో మరణాల రేటు మాత్రం 1.8 శాతం పెరిగి 16 లక్షలకు చేరింది. ఇదే ఒరవడి కొనసాగితే 2060 నాటికి జనసంఖ్య 8.67 కోట్లకు పడిపోతుందని అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం ఇప్పటికే పబ్లిక్‌ రుణాలు జీడీపీ కంటే 232.7 శాతం వరకు ఉన్నాయి. 

Current Affairs

జాబిల్లిపైకి డ్రోన్‌

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా ‘అథీనా’ అనే ల్యాండర్‌ను ప్రయోగించింది. అందులో ఓ డ్రోన్‌ను పంపించింది. నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా 2025, ఫిబ్రవరి 27న దీన్ని ప్రయోగించారు. ఇది మార్చి 6న జాబిల్లిపై దిగనుంది. ఈ ల్యాండర్‌ ఎత్తు 15 అడుగులు. చందమామ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్‌ అయ్యేలా దీనికి లక్ష్యాన్ని నిర్దేశించారు. జాబిలిపై సూర్య కిరణాలు ఎన్నడూ పడని జెట్‌ బ్లాక్‌ బిలానికి దాదాపు 400 మీటర్ల దూరంలోనే ఆ ప్రాంతం ఉంది. 

Walkins

ఐఓసీఎల్‌లో మెడికల్ ఆఫీర్‌ పోస్టులు

అస్సాంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఐఓసీఎల్‌), గువహటి  మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: మెడికల్ ఆఫీసర్‌(సీడీఎంఓ): 03 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌ డిగ్రీ, ఎండీ, ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.1.05,200. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 3-3-2025. వేదిక: ఎసీఎంఓ, గువహటి రిఫైనరీ హాస్పిటల్‌, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్, పీఓ-నూన్‌మతి, కామ్రూప్‌ మెట్రో, గువహటి-781020. Website:https://iocl.com/latest-job-opening  

Private Jobs

టెక్ మహీంద్రాలో టెక్‌ లీడ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ టెక్‌ లీడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 15 వివరాలు: కంపెనీ: టెక్ మహీంద్రా  అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, లేదా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నైపుణ్యాలు: పైథాన్‌, టెలీకామ్‌ డొమైన్‌, ఏపీఐ టెస్టింగ్‌ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలు ఉండాలి.  జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 30-03-2025. Website:https://careers.techmahindra.com/JobDetails.aspx?JobCode=NgAAADIAAAA1AAAAOQAAADEAAAA=-GFemJuZW+C0=&&IndustryType=SQAAAFQAAAA=-cu6HGbNv01o=

Government Jobs

ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 2. డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 3. డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్ డిసైన్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: మార్చి 03, 2025 తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.50,000 - రూ. 1,60,000. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 03-03-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/662

Government Jobs

ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పోస్టులు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్ం పోస్టులు: 8 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏఐసీటీఈ గుర్తించిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: మార్చి 17, 2025 తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.25,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-03-2025. Website:https://cochinshipyard.in/careerdetail/career_locations/665

Government Jobs

టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీలో పోస్టులు

ఫరిదాబాద్‌లోని బీఆర్‌ఐసీ- ట్రాన్స్‌లేషనల్ హెల్త్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ-బీఆర్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. ప్రాజెక్టు నర్స్‌-3: 02 2. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-2: 01 3. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-3: 01 4. ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-1: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా(ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, ఐటీఐ), డిగ్రీ, ఇంటర్‌, బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఉండాలి.  వయోపరిమితి: ప్రాజెక్టు నర్స్‌, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-3 పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-2 పోస్టుకు 30 ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్‌-1 పోస్టుకు 28 ఏళ్లు. జీతం: నెలకు ప్రాజెక్టు నర్స్‌, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-3 పోస్టులకు రూ.28,000, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-2 పోస్టుకు రూ.20,000, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-1 పోస్టుకు రూ.18,000. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-03-2025. Website:https://thsti.res.in/en/Jobs