Posts

Current Affairs

డుప్లాంటిస్‌ ప్రపంచ రికార్డ్‌

స్వీడన్‌ పోల్‌వాల్ట్‌ స్టార్‌ మోండో డుప్లాంటిస్‌ మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తాజాగా 2025, మార్చి 1న క్లేర్‌మాంట్‌ ఫెరాండ్‌ (ఫ్రాన్స్‌)లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ టూర్‌ మీటింగ్‌లో 6.27 మీటర్లు ఎగిరి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2024లో జరిగిన పోలెండ్‌ డైమండ్‌ లీగ్‌లో నెలకొల్పిన రికార్డు (6.26 మీటర్లు)ను అతను బద్దలు కొట్టాడు. ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేయడం ఇతడికి ఇది పదకొండోసారి. మరోవైపు ప్రపంచ అథ్లెటిక్స్‌లో టోర్నీలో పోల్‌వాల్ట్‌లో కరాలిస్‌ (గ్రీస్, 6.02 మీ), మార్షల్‌ (ఆస్ట్రేలియా, 5.91 మీ) రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 

Current Affairs

ఫిడే క్లాసికల్‌ రేటింగ్స్‌

ఫిడే క్లాసికల్‌ రేటింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ కెరీర్‌లో ఉత్తమంగా మూడో ర్యాంకు సాధించాడు. 2024, డిసెంబర్‌లో డింగ్‌ లిరెన్‌ ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌ అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తున్నాడు. ఇటీవల ప్రదర్శనతో ఖాతాలో పది పాయింట్లు చేరడంతో 2787 రేటింగ్‌తో ఉన్నాడు.  మరో భారత స్టార్‌ అర్జున్‌ ఇరిగేశి (2777) అయిదో ర్యాంకులో నిలిచాడు. ఇంకోవైపు ప్రజ్ఞానంద తిరిగి టాప్‌-10లోకి వచ్చాడు. తాజాగా టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన అతడు 17 రేటింగ్‌ పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు 2758 పాయింట్లతో ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు. 

Current Affairs

ఎన్‌ఎండీసీలో డైరెక్టర్‌గా ప్రియదర్శిని గడ్డం

ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌)గా ప్రియదర్శిని గడ్డం 2025 మార్చి 1న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఎన్‌ఎండీసీ కార్పొరేట్‌ కార్యాలయంలో పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతిగా వ్యవహరిస్తున్నారు.  ఎన్‌ఎండీసీలో ప్రియదర్శిని 1992లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీగా చేరారు. అదే సంస్థలో డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. అంతేకాక ఒక మైనింగ్‌ సంస్థలో ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Current Affairs

సెబీ ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ 11వ ఛైర్మన్‌గా తుహిన్‌ కాంత పాండే 2025, మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను 2025, ఫిబ్రవరి 27న గురువారం సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.  మిర్చి 1తో పదవీ కాలం పూర్తి చేసుకున్న మాధవి పురి బుచ్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 

Walkins

ఎన్‌సీఈఎస్‌ఎస్-కేరళలో పోస్టులు

కేరళలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (ఎన్‌సీఈఎస్‌ఎస్) తిరువనంతపురం కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 06 వివరాలు: 1. ప్రాజెక్టు అసోసియేట్‌-2(ఫైనాన్స్‌): 04 2. సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 02 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, సీఎంఏ,(ఇంటర్‌), ఎంకామ్, ఎంబీఏ(ఫైనాన్స్‌), డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రాజెక్టు అసోసియేట్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.28,000, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు రూ.18,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 11 మార్చి 2025 వేదిక: ఎన్‌సీఈఎస్‌ఎస్‌, అక్కులం, తిరువనంతపురం-695011 Website:https://www.ncess.gov.in/notifications/vacancies.html

Private Jobs

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా టీఎంబీ శాఖల్లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌సీఎస్‌ఈ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 124 వివరాలు: రాష్ట్రాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 241, అస్సాం 1, గుజరాత్ 34, హరియాణా 2, కర్ణాటక 14, కేరళ 2, మధ్యప్రదేశ్ 2, మహారాష్ట్ర 22, రాజస్థాన్ 2, తెలంగాణ 18, ఉత్తరాఖండ్ 1, పశ్చిమ్‌ బెంగాల్ 2, అండమాన్ అండ్‌ నికోబార్ 1, దాద్రా నగర్ హవేలీ 1, దిల్లీ 2. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 30.09.2024 నాటికి 26 ఏళ్లు మించకూడదు. బేసిక్‌ పే: రూ.32,000. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఆధారిత రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఎడిట్‌ ఆప్షన్‌ తేదీలు: 28.02.2025 నుంచి 16.03.2025 వరకు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 28.02.2025 నుంచి 16.03.2025 వరకు. ఆన్‌లైన్ పరీక్ష: ఏప్రిల్‌ 2025. ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల ప్రకటన: మే 2025. Website:https://www.tmbnet.in/tmb_careers/ Apply online:https://ibpsonline.ibps.in/tmbfeb25/

Internship

ఎడ్యుకేస్‌ ఇండియాలో ఇన్‌సైడ్‌ సేల్స్‌ పోస్టులు

ఎడ్యుకేస్‌ ఇండియా కంపెనీ.. ఇన్‌సైడ్‌ సేల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: ఎడ్యుకేస్‌ ఇండియా నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, తమిళం, తెలుగు మాట్లాడటం స్టైపెండ్‌: నెలకు రూ.10,000. వ్యవది: 6 నెలలు. జాబ్‌ లొకేషన్‌: హైదరాబాదు. దరఖాస్తు గడువు: 17-03-2025స Website:https://internshala.com/internship/details/inside-sales-internship-in-hyderabad-at-educase-india1739775765

Government Jobs

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టులు

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ), దిల్లీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 350 వివరాలు: 1. క్రెడిట్ ఆఫీసర్‌: 250 2. ఇండస్ట్రీ ఆఫీసర్‌: 75 3. మేనేజర్‌(ఐటీ): 05 4. సీనియర్ మేనేజర్‌(ఐటీ): 05 5. మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌: 03 6. సీనియర్ మేనేజర్‌(డేటా సైంటిస్ట్‌): 02 7. మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీ: 05 8. సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, సీఎ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడిఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 38 ఏళ్లు నిండి ఉండాలి. జీతం: నెలకు క్రెడిట్‌ ఆఫీసర్‌, ఇండస్ట్రీ ఆఫీసర్‌కు రూ.48,480 - రూ.85,920, మేనేజర్‌ (ఐటీ), మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌, మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీకు రూ.64,820 - 93,960, సీనియర్ మేనేజర్‌(ఐటీ), సీనియర్ మేనేజర్‌(డేటా సైంటిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీకు రూ.85,920 - 1,05,280. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.50. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపుర్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్ బెంగాల్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-03-2025. రాత పరీక్ష తేదీలు: మార్చి/మే 2025 Website:https://www.pnbindia.in/hi/

Government Jobs

ఎన్‌హెచ్‌ఏఐలో అసిస్టెంట్ సిస్టం మేనేజర్‌ పోస్టులు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అసిస్టెంట్ సిస్టం మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: అసిస్టెంట్‌ సిస్టం మేనేజర్‌: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ అండ్ టెలికమ్, ఐటీ, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్)లో త్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 40 ఏళ్లు. జీతం: సంత్సరానికి రూ.60,000. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ hr.nhipmpl@nhai.org ద్వారా. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 14-03-2025. Website:https://nhai.gov.in/#/

Government Jobs

ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరులో పోస్టులు

ఇండియన్‌ అకాడమీ ఆఫ్ సైన్స్‌ (ఐఏఎస్‌), బెంగళూరు  ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివరాలు: 1. ఎడిటోరియల్ అసిస్టెంట్: 01 2. కాపీ ఎడిటర్‌: 01 3. సెక్రటేరియల్ అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌), డిప్లొమా(సెక్రటేరియల్  ప్రాక్టీస్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: మార్చి 7, 2025 తేదీ నాటికి ఎడిటోరియల్ అసిస్టెంట్‌, కాపీ ఎడిటర్‌కు 35 ఏళ్లు, సెక్రటేరియల్ అసిస్టెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు ఎడిటోరియల్ అసిస్టెంట్‌, సెక్రటేరియల్ అసిస్టెంట్‌కు రూ.25,000, కాపీ ఎడిటర్‌కు రూ.28,000. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా recruitment@ias.ac.in  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 7 మార్చి 2025 Website:https://www.ias.ac.in/About_IASc/Positions_Available/